మాకూ సాయం చేయండి: సుష్మాకు పాక్ వ్యక్తి విజ్ఞప్తి, స్పందించిన మంత్రి
‘భారత్, పాక్ ఘర్షణల కారణంగా నా బిడ్డ ఎందుకు బాధపడాలి. సర్తాజ్ అజీజ్ లేదా సుష్మా మేడమ్.. చెప్పండి’ అని సుష్మాని ప్రశ్నించాడు. దీనికి వెంటనే స్పందించిన సుష్మా.. ‘లేదు. నీ బిడ్డకు ఎలాంటి కష్టం రాదు.
ఇస్లామాబాద్/న్యూఢిల్లీ: భారత విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ తనకు వచ్చిన వినతుల పట్ల ఎంత వేగంగా స్పందిస్తారో అందరికీ తెలిసిన విషయమే. సాయం కావాలని కోరగానే వెంటనే అందుకు సంబంధించిన చర్యలు చేపడతారు.
ఇటీవల పాకిస్థాన్‌లో చిత్రహింసలకు గురైన భారత మహిళ ఉజ్మాను స్వదేశానికి తీసుకొచ్చి మరోసారి తన సామర్థ్యాన్ని చాటుకున్నారు సుష్మా. ఇందుకు ఉజ్మా కన్నీళ్లపర్యాంతమవుతూ సుష్మాకు ధన్యవాదాలు తెలిపారు. స్వదేశం వచ్చిన వెంటనే ఆమె పాదాలకు నమస్కరించి పునర్ జన్మనిచ్చారంటూ ధన్యవాదాలు తెలిపారు.
Why my bud suffers for medical treatment!! Any answers Sir Sartaaj Azeez or Ma'am Sushma?? pic.twitter.com/p0MGk0xYBJ
— Ken Sid (@KenSid2) May 24, 2017
కాగా, ఇప్పుడు దాయాది దేశం పాకిస్థాన్‌కు చెందిన ఓ వ్యక్తి.. సుష్మా సాయాన్ని కోరారు. పాకిస్థాన్‌లోని లాహోర్‌కి చెందిన కెన్ సిద్ అనే సివిల్ ఇంజినీర్.. అనారోగ్యంతో బాధపడుతున్న తన నెలల పసికందుకి భారతదేశంలో చికిత్స చేయించడానికి వీసా వచ్చేలా చూడాలని ట్విట్టర్ ద్వారా కోరాడు.
No. The child will not suffer. Pls contact Indian High Commission in Pakistan. We will give the medical visa. pic.twitter.com/4ADWkFV6Ht https://t.co/OLVO3OiYMB
— Sushma Swaraj (@SushmaSwaraj) May 31, 2017
'భారత్, పాక్ ఘర్షణల కారణంగా నా బిడ్డ ఎందుకు బాధపడాలి. సర్తాజ్ అజీజ్ లేదా సుష్మా మేడమ్.. చెప్పండి' అని సుష్మాని ప్రశ్నించాడు. దీనికి వెంటనే స్పందించిన సుష్మా.. 'లేదు. నీ బిడ్డకు ఎలాంటి కష్టం రాదు. మీ ముందు పాక్‌లోని భారత హైకమిషన్‌ను సంప్రదించండి. ఆ తర్వాత మెడికల్ వీసా వచ్చేలా చూస్తాం' అని హామీ ఇచ్చారు. దీనికి స్పందించిన కెన్ సిద్.. చాలా సంతోషమంటూ సుష్మాకు ధన్యవాదాలు తెలిపాడు.












Click it and Unblock the Notifications