Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Facebook: ప్రధాని నరేంద్ర మోదీ, బిపిన్ రావత్ ను కించపరిచి ఫేస్ బుక్ లో పోస్టు, ల్యాబ్ టెక్నీషియన్ కు !

బెంగళూరు/ మైసూరు: హెలికాప్టర్ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన సీడీఎస్ బిపిన్ రావత్ పట్ల దేశం మొత్తం విచారం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. సైన్యంలో చేరి దేశానికి ఎనలేని సేవలు అందించిన బిపిన్ రావత్, ఆయన భార్య, సైనికులు హెలికాప్టర్ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోవడంతో అందరికి దేశం మొత్తం ఘనంగా నివాళులు అర్పించింది. అయితే బిపిన్ రావత్ పట్ట, సైనికుల పట్ల అనుచిత వ్యాఖ్యలు చెయ్యడమే కాకుండా ప్రధాని నరేంద్ర మోదీని దూషిస్తూ సోషల్ మీడియాలో ఓ వ్యక్తి పోస్టు చేశాడు. ప్రధాని నరేంద్ర మోదీ, బిపిన్ రావత్ ను చులకనగా మాట్లాడుతూ అతని ఫేస్ బుక్ లో ఓవ్యక్తి పోస్టు చేశాడు. బిపిన్ రావత్ పాటు ప్రధాని నరేంద్ర మోదీకి వ్యతిరేకంగా అతను చేసిన పోస్టు వైరల్ అయ్యింది. విషయం గుర్తించి ఓ లేడీ ఎస్ఐ కేసు పెట్టడంతో ఐటీ హబ్ పోలీసులు రంగంలోకి దిగారు. ప్రధాని నరేంద్ర మోదీతో పాటు బిపిన్ రావత్ కు వ్యతిరేకంగా పోస్టు చేసిన వ్యక్తిని గాలించి పట్టుకుని అతన్ని జైల్లో పెట్టారు.

 బిపిన్ రావత్

బిపిన్ రావత్

ఇటీవల తమిళనాడులోని హెలికాప్టర్ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన సీడీఎస్ బిపిన్ రావత్ పట్ల దేశం మొత్తం విచారం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. సైన్యంలో చేరి దేశానికి ఎనలేని సేవలు అందించిన బిపిన్ రావత్, ఆయన భార్య, సైనికులు హెలికాప్టర్ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోవడంతో అందరికి దేశం మొత్తం ఘనంగా నివాళులు అర్పించింది.

 ప్రధాని మోదీ, బిపిన్ రావత్ ను చులకనగా మాట్లాడుతూ !

ప్రధాని మోదీ, బిపిన్ రావత్ ను చులకనగా మాట్లాడుతూ !

కర్ణాటకలోని మైసూరులో నివాసంఉంటున్న వసంత్ కుమార్ ప్రైవేట్ ల్యాబ్ లో పని చేస్తున్నాడు. సీడీఎస్ బిపిన్ రావత్ పట్ట, సైనికుల పట్ల అనుచిత వ్యాఖ్యలు చెయ్యడమే కాకుండా ప్రధాని నరేంద్ర మోదీని దూషిస్తూ సోషల్ మీడియాలో వసంత్ కుమార్ ఓ పోస్టు చేశాడు. ప్రధాని నరేంద్ర మోదీ, బిపిన్ రావత్ ను చులకనగా మాట్లాడుతూ వసంత్ కుమార్ ఫేస్ బుక్ లో ఓ పోస్టు చేశాడు. బిపిన్ రావత్ పాటు ప్రధాని నరేంద్ర మోదీకి వ్యతిరేకంగా అతను చేసిన పోస్టు వైరల్ అయ్యింది.

 కేసు పెట్టిన లేడీ ఎస్ఐ

కేసు పెట్టిన లేడీ ఎస్ఐ

ప్రధాని నరేంద్ర మోదీతో పాటు సీడీఎస్ బిపిన్ రావత్ ను కించపరిచి వసంత్ కుమార్ ఫేస్ బుక్ లో చేసిన పోస్టు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో బెంగళూరు సిటీ పోలీసు కమీషనర్ కార్యాలయంలోని కమాండ్ సెంటర్ లో సోషల్ మీడియా విభాగంలో పని చేస్తున్న లేడీ ఎస్ఐ దీపా ఆ విషయం గమనించి బెంగళూరులోని విధాన సౌధ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Recommended Video

    VJ Sunny కి సపోర్ట్ చేస్తున్న వాళ్ళకి బెదిరింపులు Madhavi Latha ఫైర్| Rowdy Rohini | Oneindia Telugu
     సీఎం వార్నింగ్

    సీఎం వార్నింగ్

    లేడీ ఎస్ఐ దీపా కేసు పెట్టడంతో ఐటీ హబ్ లోని విధాన సౌధ పోలీసులు రంగంలోకి దిగారు. ప్రధాని నరేంద్ర మోదీతో పాటు బిపిన్ రావత్ కు వ్యతిరేకంగా పోస్టు చేసిన వసంత్ కుమార్ కోసం గాలించి అతన్ని అరెస్టు చేసి కోర్టు ముందు హాజరుపరిచారు. కోర్టు ఆదేశాలతో నిందితుడు వసంత్ కుమార్ ను జైలుకు పంపించామని పోలీసు అధికారులు తెలిపారు. సీడీఎస్ బిపిన్ రావత్ ను ఎవరైనా కించపరిచి సోషల్ మీడియాలో పోస్టు చేస్తే కఠిన చర్యలు తీసుకోవాలని కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బోమ్మయం మీడియాకు చెప్పారు.

    More From
    Prev
    Next
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+