వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కర్ణాటక ఎన్నికల్లో పేస్‌బుక్ పైలెట్ ప్రాజెక్ట్, నకిలీ వార్తలకు చెక్

By Narsimha
|
Google Oneindia TeluguNews

బెంగుళూరు: ఫేస్‌బుక్ దిద్దుబాటు చర్యలకు దిగింది. ఫేస్‌బుక్ యూజర్ల డేటా లీకైందని ప్రచారం సాగుతున్న తరుణంలో కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ఫేస్‌బుక్ జాగ్రత్తలు తీసుకొంటుంది. నకిలీ వార్తలను నిరోధించేందుకు పైలెట్ ప్రాజెక్టును కర్ణాటక ఎన్నికల్లో ప్రయోగాత్మకంగా ప్రారంభించంది.

87 మిలియన్ ఫేస్‌బుక్ యూజర్ల డేటా లీక్: కేంబ్రిడ్జి ఎనలిటికా మాజీ ఉద్యోగి ప్రకటన 87 మిలియన్ ఫేస్‌బుక్ యూజర్ల డేటా లీక్: కేంబ్రిడ్జి ఎనలిటికా మాజీ ఉద్యోగి ప్రకటన

ఫేస్‌బుక్ యూజర్ల సమాచారం లీకౌతున్న సందర్భాన్ని పురస్కరించుకొని ఫేస్‌బుక్ జాగ్రత్తలు తీసుకొంటుంది. ఇండియాలో సుమారు 217 బిలియన్ల యూజర్లు ఫేస్‌బుక్‌కు ఉన్నారు. అయితే ఈ తరుణంలో కర్ణాటక ఎన్నికల్లో నకిలీ వార్తలను నిరోధించేందుకు గాను ఫేస్‌బుక్ పైలెట్ ప్రాజెక్టును తీసుకొంది.

Facebook starts fact-checking news for users, launches pilot in Karnataka

తప్పుడు వార్తలను నిరోధించేలా ప్రోగ్రామ్‌ను తయారు చేసింది. ఈ ఎన్నికల సందర్భంగా ఫేస్‌బుక్ ప్రయోగాత్మకంగా పరిశీలిస్తోంది. ఒక స్వతంత్ర డిజిటల్ జర్నలిజం సంస్థ బూమ్‌తో కలిసి పైలట్ కార్యక్రమాన్ని మంగళవారం ప్రకటించింది. థర్‌పార్టీ ఫాక్ట్‌ చెకింగ్‌ కార్యక్రమాన్ని ప్రారంభించినట్టు బ్లాగ్‌ స్పాట్‌లో తెలిపింది.

దీని ద్వారా ఫేక్‌ న్యూస్‌కు చెక్‌ పెట్టేందుకు ప్రయత్నిస్తున్నట్టు ఫేస్‌బుక్ ప్రకటించింది. . ఒక కథనాన్ని తప్పుగా రేట్ చేస్తే, దాన్నిన్యూస్ ఫీడ్లో లోయర్‌ చేసిన చూపుతామని తేల్చి చెప్పింది. అంతేకాదు ఈ నకిలీ వార్తల వ్యాప్తిని అడ్డుకునేందుకు యూజర్లకు, పేజీ అడ్మిన్స్ నోటిఫికేన్‌ పంపుతామని తెలిపింది.

తప్పుడు వార్తలను షేర్ చేసే పేజీలు, డొమైన్లకు షేరింగ్ తగ్గుతోందని ఫేస్‌బుక్ అభిప్రాయపడుతోంది. తద్వారా ఆదాయం కూడా తగ్గిపోనుంది. ఇంటర్నేషనల్ ఫ్యాక్ట్-చెకింగ్ నెట్ వర్క్, పోయింటర్‌ చేత ధృవీకరించబడిన బూమ్‌ తో భాగస్వామాన్ని కుదుర్చుకున్నట్టు తెలిపింది.

దీని ద్వారా ఆంగ్ల భాషా వార్తా కథనాలను ఫ్లాగ్ చేసి వాస్తవాలను తనిఖీ చేసి వాటి ఖచ్చితత్వాన్ని అంచనా వేయినున్నట్టు చెప్పింది. ఫేస్‌బుక్‌పై ప్రపంచవ్యాప్తంగా చర్చ జరుగుతున్న తరుణంలో కర్ణాటక ఎన్నికల సమయంలో నకిలీ వార్తలకు చెక్ పెట్టేందుకు తీసుకొన్న నిర్ణయం అందరి ప్రశంసలు పొందే అవకాశం ఉంది.

English summary
With Karnataka heading for the polls in May, Facebook has announced a third-party fact-checking programme in the state to fight spread of fake news on its platform.The social media giant on Tuesday partnered with BOOM, an independent digital journalism initiative, for a pilot programme that will first roll out in the southern state.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X