ఏటీఎంలు పని చేయవా?, ఆన్‌లైన్ నగదు బదిలీ చేయకూడదా?: ఎస్బీఐ ఏం చెబుతోంది
India Pakistan War: పాకిస్తాన్‌పై ప్రతీకార యుద్ధానికి దిగింది భారత్. జమ్మూ కాశ్మీర్‌లో నియంత్రణ రేఖ పొడవునా డ్రోన్లు, మిస్సైళ్లతో పాకిస్తాన్ సాగించిన దాడిని తిప్పికొట్టింది. కౌంటర్ అటాక్ చేపట్టింది. రాజధాని ఇస్లామాబాద్, లాహోర్, సియాల్‌కోట్ వంటి నగరాలపై విరుచుకుపడింది.
భారత్ మిస్సైళ్ల దాడులతో రాత్రంతా బిక్కు బిక్కుమంటూ గడిపారక్కడి జనం. సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లారు. లాహోర్, సియాల్ కోట్ వంటి నగరాలు క్రమంగా ఖాళీ అవుతున్నాయి. ప్రత్యేకించి- సియాల్ కోట్. దాదాపుగా ఏడున్నర లక్షల మంది వరకు జనాభా ఉండే ఈ సిటీ ఖాళీ అవుతోంది.

అదే సమయంలో- పాకిస్తాన్‌కు చెందిన కొన్ని సోషల్ మీడియా గ్రూపులు భారత్‌పై విషం చిమ్ముతున్నాయి. దుష్ప్రచారానికి తెర తీశాయి. పాత వీడియోలను తవ్వి తీసి తాజాగా పోస్ట్ చేస్తోన్నాయి. భారత్‌లోని పలు కీలక ఆర్మీ పోస్టులను నిర్వీర్యం చేసినట్లు చెప్పుకొంటోన్నాయి. ఆర్మీ బ్రిగేడ్ ప్రధాన కార్యాలయాలపై విధ్వంసక దాడిని చేసినట్లు ప్రగల్భాలు పలుకుతున్నాయి.
మొదట భారత ఆర్మీపై ఉగ్రవాదుల ఆత్మాహూతి దళాలు దాడులు చేశాయని, పెద్ద ఎత్తున నష్టం సంభవించిందంటూ వార్తలు వెల్లువెత్తాయి. సోషల్ మీడియాలో విస్తృతంగా కథనాలు పోస్ట్ అయ్యాయి. జమ్మూ కాశ్మీర్ రాజౌరీ సెక్టార్‌లో ఈ దాడి జరిగిందని, ఆర్మీ బ్రిగేడ్ హెడ్ క్వార్టర్ ధ్వంసమైందనే ప్రచారం సాగింది. ఈ వార్తలను కేంద్ర ప్రభుత్వం తోసిపుచ్చింది. అవాస్తవమని తేల్చి చెప్పింది.
అదే సమయంలో గుజరాత్‌లోని హజీరా పోర్ట్‌పైనా పాకిస్తాన్ భయానక దాడి సాగించినట్లు కొన్ని వీడియోలు పోస్ట్ అయ్యాయి. ఆ వీడియోలు నిజమే అయినప్పటికీ- ఇప్పటివి కావు. 2021 జులై 7వ తేదీన హజీరా పోర్ట్‌లో ఓ ట్యాంకర్ పేలుడుకు సంబంధించిన వీడియోలు అవి. వాటిని ఇప్పుడు సర్కులేట్ చేస్తోన్నారని ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో వెల్లడించింది. దీన్ని నమ్మవద్దని కోరింది.
దీనికి ఇక్కడితో బ్రేకులు పడట్లేదు. మరింత విస్తరిస్తూనే ఉన్నాయి. ఫేక్ న్యూస్, ఫాల్స్ న్యూస్.. సోషల్ మీడియా వేదికపై పోస్ట్ అవుతూనే వస్తోన్నాయి. భారత్‌తో యుద్ధం చేస్తోన్న ప్రస్తుత పరిస్థితుల్లో పాకిస్తాన్.. భారత్‌లోని అన్ని ఏటీఏంలపై సైబర్ దాడికి ప్రిపేర్ అయిందంటూ వార్తలు వచ్చాయి.
ఈ వాట్సప్‌లో ఈ సమాచారం పెద్ద ఎత్తున సర్కులేట్ అయింది. రెండు మూడు రోజుల పాటు ఏటీఎంలు మూతపడతాయని, వినియోగదారులు కూడా ఎటువంటి ఆన్‌లైన్ లావాదేవీలు నిర్వహించకూడదనేది ఈ వాట్సప్ మెసేజీల సారాంశం. తెలియని అడ్రస్‌ల నుంచి ఇమెయిల్‌కు వచ్చిన ఏ లింక్ గానీ, అటాచ్‌మెంట్ గానీ క్లిక్ చేయొద్దని, అవి పాకిస్తాన్ నుంచి వచ్చి ఉండొచ్చని ఇందులో రాశారు.
"All our ATMs, CDMs/ADWMs and digital services are fully operational and available for public use," reads a statement by State Bank of India (@TheOfficialSBI). pic.twitter.com/9qeXDX8Dd2
— Press Trust of India (@PTI_News) May 9, 2025
దీనిపై ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూర్ ఫ్యాక్ట్ చెక్ ఇచ్చింది. ఈ వార్తలు అవాస్తవమని తేల్చింది. ఇందులో వాస్తవం లేదని, పూర్తిగా నిరాధారమైనవని తెలిపింది. ఏటీఎంలు యధాతథంగా పని చేస్తాయని, బ్యాంక్ ఖాతాదారులు ఎటువంటి ఉద్రిక్తతలకు గురి కావొద్దని సూచించింది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా దీనిపై స్పష్టత ఇచ్చింది. ఏటీఎంలు, క్యాష్ డిపాజిట్ మిషన్లు, డిజిటల్ సర్వీసులు పూర్తిస్థాయిలో పని చేస్తాయని పేర్కొంది.
Are ATMs closed⁉️
— PIB Fact Check (@PIBFactCheck) May 9, 2025
A viral #WhatsApp message claims ATMs will be closed for 2–3 days.
🛑 This Message is FAKE
✅ ATMs will continue to operate as usual
❌ Don't share unverified messages.#IndiaFightsPropaganda pic.twitter.com/BXfzjjFpzD
-
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
త్వరలో తిరుపతి, హైదరాబాద్‌కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
పాకిస్తాన్ క్రికెట్ కు ఓ దండం..మెయిన్ విలన్ ఆయనే: కిర్‌స్టెన్ -
"ధురంధర్" డైరెక్టర్ నెక్స్ట్ సినిమా ఆ స్టార్ హీరోతోనే ??? -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
డైరెక్ట్ గా ఇరాన్ నుంచే భారత్ ఆయిల్ కొనుగోళ్లు: గ్యాస్ కొరతకూ చెక్ -
డొనాల్డ్ ట్రంప్ సడన్ యూటర్న్- యుద్ధ విరామం -
'ధురంధర్ 2'పై టాలీవుడ్ హీరోల ప్రశంసలు.. ప్రకాష్ రాజ్ రియాక్షన్ ఇదే!












Click it and Unblock the Notifications