ప్రధాని పదవికి సిద్ధం: రాహుల్ గాంధీ, స్మృతి ఇరానీ కౌంటర్

Posted By:
Subscribe to Oneindia Telugu

న్యూఢిల్లీ: సార్వత్రిక ఎన్నికల్లో ప్రధాని పదవి పోటీకి తాను సిద్ధంగా ఉన్నానని ఏఐసిసి ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీ సంకేతాలు ఇచ్చారు. రెండు వారాల పర్యటన నిమిత్తం ఆయన ఆమెరికా వెళ్లారు.

ఈ సందర్భంగా బెర్క్‌లీలోని కాలిఫోర్నియా వర్సిటీలో ఆయన ప్రసంగించారు. ఇండియా ఎట్ 70: రిఫ్లెక్షన్స్ ఆన్ ది పాత్ ఫార్వార్డ్ అనే అంశంపై ఆయన మాట్లాడారు.

నేను పీఎం పదవికి పోటీ చేస్తా

ప్రధాని నరేంద్ర మోడీ, ఎన్డీయే ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. విభజన రాజకీయాలు ప్రజలను వేరు చేస్తున్నాయన్నారు. ఈ సందర్భంగా ప్రధాని పదవికి పోటీ చేస్తారా అని అడిగితే.. అవును అని సమాధానం ఇచ్చారు. నేను పీఎం పదవికి పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నానని చెప్పారు.

'Failed Dynast:' Smriti Irani Slams Rahul Gandhi Over Berkeley Speech

నేనే కాదు, అందరూ అలాగే ఉన్నారు

కానీ తమది సంస్థాగత పార్టీ అని రాహుల్ చెప్పారు. దీనిపై పార్టీ నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు. ప్రస్తుతం దీనిపై పార్టీలో చర్చలు జరుగుతున్నాయన్నారు. నేను మాత్రమే వారసత్వ రాజకీయాల్లోకి వచ్చానని అనుకోవద్దని, ప్రతి రాజకీయ పార్టీలోను ఇలాగే ఉందన్నారు. అఖిలేష్ యాదవ్, స్టాలిన్‌లతో పాటు బాలీవుడ్‌లో అభిషేక్ బచ్చన్, పారిశ్రామికవేత్తలు అంబానీ సోదరులు అంతే అన్నారు. జిఎస్టీ, పెద్ద నోట్ల రద్దు, ఎన్టీయే ప్రభుత్వంపై మండిపడ్డారు.

స్మృతి ఇరానీ కౌంటర్

విఫలమైన వారసుడు తన విఫలమైన రాజకీయ ప్రయాణం గురించి చెప్పుకునేందుకు కాలిఫోర్నియా యూనివర్సిటీని ఎంచుకున్నారని కేంద్రమంత్రి స్మృతి ఇరానీ ఎద్దేవా చేశారు. ఇక్కడ ప్రజలతో మమేకం కావడంలో రాహుల్ విఫలమయ్యారని, దీంతో విమర్శలు చేసేందుకు అమెరికాను ఎంచుకున్నారన్నారు.

చారిత్రాత్మక విజయం

నిజానికి ప్రధాని, రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి గౌరవప్రదమైన చరిత్ర కలిగిన వారని స్మృతి చెప్పారు. గత ఎన్నికల్లో బిజెపి, ప్రధాని మోడీ చారిత్రాత్మక విజయాన్ని సొంతం చేసుకున్నారని, కాంగ్రెస్‌ పార్టీ అతిపెద్ద ఓటమిని ఎదుర్కొందని, భారత్‌లో వారసత్వం సంప్రదాయం లేదు అనటానికి ఇదే నిదర్శనమని తెలిపారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Union Minister Smriti Irani, fielded by the BJP to take on Rahul Gandhi over his speech in the US today, ripped into the Congress vice-president saying his attacking and belittling Prime Minister Narendra Modi in a foreign country was "deplorable."

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి