వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రూ.70వేల ఆసుపత్రి బిల్లు: బిక్షాటన చేసిన పదేళ్ళ కొడుకు

తన తల్లికి చికిత్స చేసిన ఆసుపత్రి ఫీజు చెల్లించేందుకు ఓ పదేళ్ళ బాలుడు బిక్షాటన చేశారు. కడు పేదరికంలో ఉన్న ఆ కుటుంబం రూ.70వేలను చెల్లించాలని ఆసుపత్రి యాజమాన్యం ఆదేశించింది.

By Narsimha
|
Google Oneindia TeluguNews

పాట్నా: తన తల్లికి చికిత్స చేసిన ఆసుపత్రి ఫీజు చెల్లించేందుకు ఓ పదేళ్ళ బాలుడు బిక్షాటన చేశారు. కడు పేదరికంలో ఉన్న ఆ కుటుంబం రూ.70వేలను చెల్లించాలని ఆసుపత్రి యాజమాన్యం ఆదేశించింది. దీంతో ఆ బాలుడు బిక్షాటన చేయాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి.ఈ ఘటన బీహర్ రాష్ట్రంలో చోటు చేసుకొంది.

షాక్: యువకుడి కడుపులో నుండి కిలో ఇనుప ముక్కలు, రూ. 790 నాణెలుషాక్: యువకుడి కడుపులో నుండి కిలో ఇనుప ముక్కలు, రూ. 790 నాణెలు

ప్రైవేట్ ఆసుపత్రులు రోగుల పట్ల మానవత్వం లేకుండా వ్యవహరించే ఘటనలను మనం చూస్తూనే ఉంటాం. వింటాం. కానీ, ఇదే తరహ ఘటన ఒకటి బీహర్ రాష్ట్రంలో తాజాగా వెలుగు చూసింది.

ప్రభుత్వాసుపత్రుల్లో అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తే ప్రైవేట్ ఆసుపత్రుల వైపుకు పేదలు వెళ్ళే పరిస్థితులు తగ్గే అవకాశం లేకపోలేదు. ఈ తరుణంలో పాలకులు ప్రభుత్వాసుపత్రుల్లో సౌకర్యాలను మెరుగుపర్చాలని పలువురు కోరుతున్నారు.

 రూ. 70వేల ఆసుపత్రి ఫీజు కట్టేందుకు బిక్షాటన

రూ. 70వేల ఆసుపత్రి ఫీజు కట్టేందుకు బిక్షాటన

బీహర్‌ రాష్ట్రంలోని మధేపురా జిల్లాలోని ఓ ప్రైవేట్ నర్సింగ్ హోమ్‌లో ఓ మహిళ చికిత్స కోసం చేరింది. అనారోగ్య కారణాలతో ఆమె ప్రైవేట్ ఆసుపత్రిలో చేరాల్సిన అనివార్య పరిస్థితులు నెలకొన్నాయి.దీంతో ఆసుపత్రిలో ఆమె చేరింది. ఆమెకు చికిత్స చేశారు. చికిత్స పూర్తయ్యాక రూ. 70వేలు బిల్లు చేతికిచ్చారు. ఈ డబ్బులు చెల్లించడం కోసం ఆమె కొడుకు బిక్షాటన చేశారు.

 స్వగ్రామంలో బిక్షాటన చేసిన కుందన్

స్వగ్రామంలో బిక్షాటన చేసిన కుందన్

ఆసుపత్రి యాజమాన్యం మహిళకు శస్త్రచికిత్స చేసింది. అయితే రూ. 70వేల బిల్లును ఆమె పదేళ్ళ కొడుకు కుందన్ చేతిలో పెట్టారు. అయితే ఈ బిల్లు చూసిన కుందన్‌కు ఏం చేయాలో తోచలేదు. స్వగ్రామానికి వెళ్ళాడు. అక్కడే తన తల్లిని ఆసుపత్రి నుండి డిశ్చార్చి చేసేందుకు బిక్షాటన చేశారు.

కుట్లు విప్పని ఆసుపత్రి సిబ్బంది

కుట్లు విప్పని ఆసుపత్రి సిబ్బంది

ఆసుపత్రి బిల్లు రూ.70 వేలు చెల్లిస్తేనే ఆ మహిళకు కుట్లు విప్పాలని ఆసుపత్రి సిబ్బంది భావించారు. కుట్లు విప్పితే ఆమె ఆసుపత్రి నుండి వెళ్ళిపోయే అవకాశం ఉందని అనుమానించారు. అయితే ఈ కారణంతోనే ఆమె కుట్లు విప్పలేదని బాధితులు ఆరోపిస్తున్నారు.

 ఎంపీ చొరవతో ఆసుపత్రి నుండి మహిళ డిశ్చార్జి

ఎంపీ చొరవతో ఆసుపత్రి నుండి మహిళ డిశ్చార్జి

ఈ విషయం స్థానిక ప్రసార సాధనాల్లో ప్రముఖంగా వచ్చింది. దీంతో మధేపురా ఎంపీ రంగంలోకి దిగారు. బాధిత మహిళ చికిత్స పొందుతున్న ప్రైవేట్ నర్సింగ్‌హోమ్‌కు వెళ్ళి ఆసుపత్రి యాజమాన్యంతో చర్చించారు. బాధితురాలిని ఆసుపత్రి నుండి డిశ్చార్జీ చేయించారు.

English summary
A 10-year-old boy in Patna was forced to beg as his family could not pay the bills for treating his mother in a hospital bill. According to a report, Member of Parliament Pappu Yadav came to the family’s rescue as he paid the required amount and urged the police to probe the matter.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X