Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Fact Check: రూ.21 లక్షల నెలవారీ లాభాల వాగ్దానం; రాష్ట్రపతి ప్రసంగం వీడియో

కేవలం రూ.23,000 పెట్టుబడి పెడితే.. రోజుకు రూ.70,000 లాభం, నెలకు రూ.21 లక్షల ఆదాయం వస్తుందని భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ( President Droupadi Murmu) చేసిన ప్రకటన సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీంతో ఒక్కసారిగా ప్రభుత్వం ఉలిక్కిపడింది. అసలేం జరిగింది. పెట్టుబడులపై రాష్ట్రపతి ప్రకటన చేయడం ఏంటని చర్చనీయాంశంగా మారిన వేళ.. దీనిపై అందరిలో ఉత్కంఠ నెలకొంది

సైబర్ నేరగాళ్ల కన్ను ఇప్పుడు ఏకంగా దేశ ప్రథమ పౌరురాలిపైనే పడింది. భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ముఖచిత్రాన్ని, స్వరాన్ని తలపిస్తూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సాయంతో సృష్టించిన ఒక 'డీప్‌ఫేక్' (Deepfake) వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో కలకలం రేపుతోంది. అమాయక ప్రజలను ఆర్థికంగా దోచుకోవడమే లక్ష్యంగా రూపొందించిన ఈ వీడియోపై ప్రభుత్వ వర్గాలు తీవ్రంగా స్పందించాయి.

Fake Investment Video Using President Murmu s Image Promises Rs 70 000 Daily and Rs 21 Lakh Monthly

డీప్‌ఫేక్‌ వీడియో (Fake Investment Video)..

భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చిత్రాన్ని, స్వరాన్ని ఉపయోగించి రూపొందించిన డిజిటల్‌గా మార్చిన (డీప్‌ఫేక్‌) వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ వీడియోలో కేవలం రూ.23,000 పెట్టుబడితో రోజుకు రూ.70,000 లాభం, నెలకు రూ.21 లక్షల ఆదాయం వస్తుందని హామీ ఇస్తూ ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఈ వీడియో పూర్తిగా నకిలీదని, రాష్ట్రపతికి దీనితో ఎలాంటి సంబంధం లేదని స్పష్టమైంది.

మోసపూరిత కంటెంట్‌

ప్రాథమిక పరిశీలనలో ఈ వీడియోను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డీప్‌ఫేక్ టెక్నాలజీ సహాయంతో తయారు చేసినట్లు నిపుణులు గుర్తించారు. రాష్ట్రపతి వీడియో క్లిప్‌ను ఎడిట్ చేసి, ఆమె మాట్లాడినట్లుగా చూపిస్తూ, నమ్మకాన్ని దుర్వినియోగం చేసేలా ఈ మోసపూరిత కంటెంట్‌ను రూపొందించారు. ఇలాంటి వీడియోల లక్ష్యం ప్రజల విశ్వాసాన్ని ఆసరాగా చేసుకుని ఆర్థికంగా మోసం చేయడమేనని అధికారులు చెబుతున్నారు.

మోసానికి సంకేతం..

ఈ పెట్టుబడి పథకాన్ని రాష్ట్రపతి గానీ, రాష్ట్రీయ భవనం (రాష్టపతి భవన్) గానీ ఎక్కడా సమర్థించలేదని ప్రభుత్వ వర్గాలు తేల్చి చెప్పాయి. ఖచ్చితమైన లాభాలు హామీ ఇచ్చే పెట్టుబడులు మోసానికి సంకేతమని ప్రజలు గుర్తించాలని సూచించాయి. ముఖ్యంగా ఆన్‌లైన్‌లో ప్రచారం అవుతున్న ప్రకటనలు, వీడియోలపై అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించాయి.

సైబర్ నేర నిపుణుల ప్రకారం, ఇటీవలి కాలంలో ప్రముఖ నాయకులు, సెలబ్రిటీలు, వ్యాపారవేత్తల పేర్లను ఉపయోగిస్తూ ఇలాంటి మోసాలు పెరుగుతున్నాయి. ఈ వీడియోలను నమ్మి డబ్బులు పెట్టుబడి పెట్టినవారు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. ఇలాంటి కంటెంట్ కనిపిస్తే వెంటనే సైబర్ క్రైమ్ పోర్టల్‌లో ఫిర్యాదు చేయాలని, వ్యక్తిగత లేదా బ్యాంక్ వివరాలు ఎట్టి పరిస్థితుల్లోనూ పంచుకోకూడదని సూచిస్తున్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+