వామ్మో ఏం తెలివిరా బాబూ..! ఐపీఎస్‌నంటూ ఫోజు కొట్టి అడ్డంగా బుక్కయ్యాడు..

జైపూర్ : అభయ్ మీనా ఐపీఎస్. ఐఐటీ, యూపీఎస్సీ ఎగ్జామ్స్‌ను ఫస్ట్ అటెంప్ట్‌లోనే క్రాక్ చేసిన మేథావి. అతి చిన్న వయసులోనే ఐపీఎస్‌గా ఎన్నికైన అభయ్.. యూత్‌కు ఓ ఐకాన్. ఎంతో మందికి ఇన్‌స్పిరేషన్. సోషల్ మీడియాలో ఓ సెన్సేషన్. అభయ్ ఇచ్చే స్పీచులు వింటే ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే. ఆయన చెప్పే సలహాలు, సూచనలు, సవాళ్లను ఎలా స్వీకరించాలి, జీవితంలో ఎలా నెగ్గుకురావాలో వివరించే లెక్చర్లు అభయ్‌ను సెలబ్రిటీని చేశాయి. ఆయన సేవలకు గుర్తింపుగా పోలీస్ మెడల్స్ కూడా వచ్చాయి. ఐపీఎస్‌నని చెప్పుకుని లగ్జరీ లైఫ్ లీడ్ చేస్తున్న అభయ్ నిజంగా పోలీసేనా? ఓ పోలీసు అధికారికి వచ్చిన అనుమానం మనోడి అసలు రంగు బయటపెట్టింది. వాడు పన్నెండో తరగతి కూడా పాస్ కాని పెద్ద ఫ్రాడ్ అని ప్రపంచానికి తెలిసింది.

ఇంటర్ ఫెయిల్

ఇంటర్ ఫెయిల్

మూడు నక్షత్రాల కారు, ఒంటిపై ఖాకీ డ్రెస్సు, జేబులో సీబీ సీఐడీ కార్డు. ఇదీ అభయ్ మీనా దర్పం. రాజస్థాన్‌లోని సవైమాధోపూర్ జిల్లాకు చెందిన ఈ ప్రబుద్ధుడు చదివింది ఇంటర్. అదీ ఫెయిల్. అయితే లగ్జరీ లైఫ్ గడపాలన్న ఆశతో ఫేక్ ఐపీఎస్ అధికారి అవతారం ఎత్తాడు. ఐఐటీ ఢిల్లీ నుంచి గ్రాడ్యుయేట్‌నని, అతి చిన్న వయసులోనే ఐపీఎస్‌గా సెలక్ట్ అయ్యానని తనను తాను ప్రమోట్ చేసుకున్నాడు. ఫేస్‌బుక్ అకౌంట్‌లో సీబీ సీఐడీ అని ప్రొఫైల్ ఫొటో పెట్టుకోవడంతో అది చూసి ఓ యువతి అభయ్‌పై మనసు పారేసుకుంది. అతని కోసం ఉత్తరాఖండ్ నుంచి జైపూర్ వచ్చింది. కొన్నాళ్లుగా ఆ ఫేస్ ఐపీఎస్‌తో సహజీవనం చేస్తోంది.

 తీగలాగితే కదిలిన డొంక

తీగలాగితే కదిలిన డొంక

జైపూర్‌లోని ప్రతాప్ నగర్‌లోని ఓ అపార్ట్‌మెంట్‌లో ఉంటున్న అభయ్‌పై కొందరు పోలీసులకు అనుమానం వచ్చింది. విషయం రాజస్థాన్ స్పెషల్ ఆపరేషన్స్ గ్రూప్‌కు చేరవేయడంతో వారు రంగంలోకి దిగారు. రెండు గ్రూపులుగా ఏర్పడి అభయ్‌పై నిఘా పెట్టింది. ఓ ఇన్ఫార్మర్ ఇచ్చిన సమాచారంతో అధికారులు ఐపీఎస్‌గా చెలామణి అవుతున్న ఆ కేటుగాన్ని పట్టుకున్నారు. అభయ్ ఇంటి నుంచి ఖాకీ డ్రెస్సు, ఫేక్ సీబీ సీఐడీ కార్డుతో పాటు త్రీ స్టార్‌ నెంబర్ ప్లేట్ ఉన్న కారును స్వాధీనం చేసుకున్నారు.

 సోషల్ మీడియా సెన్సేషన్

సోషల్ మీడియా సెన్సేషన్

నకిలీ ఐపీఎస్ అవతారం ఎత్తి జనాన్ని బురిడీ కొట్టించిన అభయ్ నిజానికో సోషల్ మీడియా సెన్సేషన్. చిన్న వయసులోనే ఐపీఎస్ సాధించడం వెనుక సీక్రెట్ ఇదంటూ ఆ కేటుగాడు చెప్పిన కథలు విని చాలా మందిలో స్పూర్తి పొందారు. మనోడి ఫాలోయింగ్ ఏ రేంజ్‌లో ఉందో తెలియాలంటే వేల సంఖ్యలో ఉన్న ఫేస్‌బుక్‌ పేజీ ఫాలోవర్లను చూస్తే అర్థమవుతుంది. అభయ్ నటనను నిజమని నమ్మి చాలా మంది న్యాయం చేయమంటూ అతని వద్దకు క్యూ కట్టేవారు. కొందరు కిందిస్థాయి పోలీసు సిబ్బంది సైతం సమస్య పరిష్కారం కోసం అభయ్‌ను సంప్రదించడం కొసమెరుపు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+