వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బిర్యానీ తినడానికి వెళ్తే.. ప్రాణాలే పోయాయి..

చెట్టు కొమ్మలన్ని బిర్యానీ షాపుపై ఒరిగాయి. ఆపై.. అప్పటికే స్వల్పంగా ధ్వంసమై ఉన్న గోడ కాస్త... బిర్యానీ తింటున్న బాలుడితో పాటు పలువురిపై కూలిపోయింది.

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ : బిర్యానీ తినడానికి వెళ్లిన ఓ బాలుడు దురదృష్టవశాత్తు ప్రాణాలే కోల్పోయాడు. కార్పోరేషన్ అధికారుల నిర్లక్ష్య వైఖరి వల్ల ఆ నిండు ప్రాణం బలైపోయింది. ఈ దుర్ఘటనలో మరో ఏడుగురు గాయపడగా.. అందులో ఇద్దరు చిన్నారులే కావడం గమనార్హం.

వివరాల్లోకి వెళ్తే.. ఢిల్లీకి చెందిన ఓ ఏడేళ్ల బాలుడు స్నేహితులతో కలిసి జందేవాలన్ సమీపంలో ఉన్న ఫైజ్ రోడ్డులోని ఎంసీడీ కాంప్లెక్స్ లో బిర్యానీ తినడానికి వెళ్లాడు. అదే సమయంలో.. బిర్యానీ షాపును ఆనుకుని ఉన్న ఎంసీడీ కాంప్లెక్స్ గోడ నిర్మాణ పనులు జరుగుతున్నాయి. ఈ నిర్మాణ పనులకు అడ్డుగా ఉన్న ఓ చెట్టును తొలగించడానికి ప్రయత్నించారు అధికారులు.

Falling wall kills boy as corporation men cut tree

దీంతో చెట్టు కొమ్మలన్ని బిర్యానీ షాపుపై ఒరిగాయి. ఆపై.. అప్పటికే స్వల్పంగా ధ్వంసమై ఉన్న గోడ కాస్త... బిర్యానీ తింటున్న బాలుడితో పాటు పలువురిపై కూలిపోయింది. ఈ దుర్ఘటనలో బాలుడు అక్కడిక్కడే చనిపోగా.. మరో ఏడుగురు గాయపడ్డారు. బాధాకరమైన విషయమేంటంటే.. చనిపోయిన బాలుడి తండ్రి కూడా ఆ గోడ నిర్మాణం కోసం వచ్చిన కూలీల్లో ఉన్నాడు. కొడుకు చావును జీర్ణించుకోలేక ఆ తండ్రి గుండెలవిసేలా రోధించాడు.

కాగా, రోడ్ల పక్కన అక్రమంగా వెలిసిన షాపుల్లో ఈ బిర్యానీ షాపు ఒకటని కార్పోరేషన్ అధికారులు చెబుతున్నారు. అనుమతులు లేకుండా ఇష్టారాజ్యంగా వ్యవహరించడం వల్లే.. ఇలాంటి దుర్ఘటనలు జరుగుతున్నాయని అభిప్రాయపడుతున్నారు. ఇకపోతే.. చెట్టును తొలగించేప్పుడు నిర్లక్ష్యంగా వ్యవహరించిన కార్పోరేషన్ సిబ్బంధిపై కూడా వేటు తప్పదని అంటున్నారు అధికారులు.

English summary
A seven-year-old boy eating biryani with friends was crushed to death as the wall of an MCD complex on Faiz Road,
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X