వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Fake News : జూమ్‌ యాప్‌కి కేంద్రం ప్రత్యామ్నాయం తీసుకొచ్చిందా..?

|
Google Oneindia TeluguNews

లాక్‌డౌన్ తర్వాత భారత్‌లో జూమ్ యాప్ వినియోగం ఒక్కసారిగా పెరిగింది. పలు కంపెనీలు,విద్యా సంస్థలు వీడియో కాన్ఫరెన్స్‌లు, ఆన్‌లైన్ క్లాసుల బోధన కోసం జూమ్ యాప్‌ను వినియోగిస్తున్నాయి. ప్రెస్ మీట్స్ సైతం జూమ్ యాప్‌ ద్వారా నిర్వహిస్తున్నారంటే దాని ఆదరణ ఎంతలా పెరిగిందో అర్థం చేసుకోవచ్చు. అయితే ఈ యాప్ వాడటం అంత సేఫ్ కాదని కేంద్ర హోం శాఖ హెచ్చరించింది.లాగిన్ తరువాత వ్యక్తిగత డేటా హ్యాకర్ల చేతికి చిక్కే ప్రమాదం ఉందని పేర్కొంది.

Recommended Video

Fake News Buster 12 : నకిలీ ఇన్సూరెన్స్ పాలసీ చేసి మోసపోకండి..!!

ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వమే దీనికి ప్రత్యామ్నాయంగా నమస్తే బీటా వెర్షన్‌ను లాంచ్ చేసినట్టుగా ఓ ఫేక్ న్యూస్ పుట్టుకొచ్చింది. ఐఓఎస్‌,ఆండ్రాయిడ్ ఫోన్లలో ఇది పనిచేస్తుందని ఆ ఫేక్ న్యూస్‌లో పేర్కొన్నారు. అయితే పూర్తిగా అవాస్తవం. కేంద్ర ప్రభుత్వం అలాంటి యాప్ లేదా అప్లికేషన్‌ను లాంచ్ చేయలేదు. అయితే జూమ్ యాప్ వినియోగదారులకు మాత్రం గతవారం కొన్ని కీలక సూచనలు చేసింది.

False: Govt has not launched beta version of ‘Namaste,’ an alternative to Zoom

1.ప్రతి మీటింగ్‌కు కొత్త యూజర్‌ ఐడీ, పాస్‌వర్డ్ సెట్ చేసుకోవాలి.
2.జూమ్ సెట్టింగ్స్‌లో వెయిటింగ్ రూమ్ ఆప్షన్‌ను ఎనేబుల్ చేయాలి. స్క్రీన్ షేరింగ్‌ను కేవలం హోస్ట్/ అడ్మిన్ చేసేలా మార్పులు చేయాలి.ఒకసారి కాన్ఫరెన్స్ నుంచి తొలగించిన వ్యక్తి మళ్లీ జాయిన్ అవ్వకుండా ఆ ఆప్షన్‌ను యాప్‌ సెట్టింగ్స్‌లో డిజేబుల్ చేయాలి.
3.ఫైల్‌ ట్రాన్స్‌పర్ ఆప్షన్‌ ఎప్పుడూ ఆన్‌లో ఉంచుకోకూడదు.
4.మీటింగ్‌/ కాన్ఫరెన్స్‌లో అందరూ జాయిన్ అయ్యాక మీటింగ్‌ను లాక్‌ చేయాలి.
5.మొత్తం కాన్ఫరెన్స్ రికార్డు చేసుకునే ఆప్షన్‌ను డిజేబుల్ చేయండి.
6. మీటింగ్ అయిపోయాక.. యాప్‌ క్లోజ్ చేయకుండా ఎండ్ మీటింగ్ బటన్‌ను క్లిక్ చేసి కన్మర్ఫ్ చేసుకొని అప్పుడు క్లోజ్ చేయాలి.

మరికొన్ని టిప్స్ :

ఈవెంట్ హెస్ట్ చేసేందుకు మీ పర్సనల్ మీటింగ్ ఐడీ(PMI)ని ఉపయోగించవద్దు. దానికి బదులు ర్యాండమ్ జనరేటెడ్ మీటింగ్ ఐడీనే ప్రతీ ఈవెంట్‌కు ఉపయోగించాలి.
పబ్లిక్ ప్లాట్‌ఫామ్స్‌పై మీ లింక్‌ను షేర్ చేయవద్దు. దానికి బదులు ప్రతీ మీటింగ్‌కు ర్యాండమ్ జనరేటెడ్ మీటింగ్ ఐడీ,పాస్‌వర్డ్‌లను మాత్రమే షేర్ చేయాలి.
ఒకవేళ మీరే అడ్మిన్ అయితే.. ఈవెంట్ ముగిశాక 'లీవ్' ఆప్షన్ కాకుండా 'ఎండ్' ఆప్షన్‌పై క్లిక్ చేయండి.
జూమ్ యాప్‌తో పనిలేనప్పుడు మీ ఖాతాను సైన్ ఔట్ మోడ్‌లోనే ఉంచండి.

English summary
news portal has claimed that the government has launched a beta version of 'Namaste,' a video conferencing alternative to Zoom.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X