Family: ఫుడ్ లో మత్తుమందు, భార్య, కూతుర్లను కాల్చి చంపిన వ్యాపారి, ఇంట్లో ఏం చేశాడంటే !
న్యూఢిల్లీ/దుబాయ్: దుబాయ్ లో వ్యాపారం చేస్తున్న వ్యక్తి అతని భార్య, పిల్లలతో కలిసి అక్కడే కొన్ని సంవత్సరాలు సంతోషంగా కాపురం చేశాడు. దుబాయ్ లో వ్యాపారం దెబ్బ తినడంతో సొంత ఊరికి చేరుకున్న అతను జీన్స్ వ్యాపారం చేస్తున్నాడు. దేశ రాజధాని నుంచి దేశంలోని అనేక నగరాలకు అతను జీన్స్ ప్యాంట్ లు సరఫరా చేస్తున్నాడు. వ్యాపారి నివాసం ఉంటున్న భవనంలోనే రెండు అంతస్తుల్లోని ఒక అంతస్తులో అతని తల్లిదండ్రులు, మరో అంతస్తులో సోదరుడు నివాసం ఉంటున్నారు. రాత్రి వ్యాపారి అతని భార్య, పిల్లలకు ఆహారంలో మత్తు మందుకలిపి ఇచ్చాడు. అర్దరాత్రి దాటిన తరువాత వ్యాపారి అతని భార్య, ఇద్దరు కూతుర్లను కాల్చి చంపి తరువాత రివాల్వర్ అతను కాల్చుకుని ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది.

దుబాయ్ లో వ్యాపారం
ఢిల్లీకి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త మోహమ్మద్ ఇస్రార్ అలియాస్ మోహమ్మద్ (40) కొన్ని సంవత్సరాల క్రితం ఫర్హీన్ (38) అనే మహిళను వివాహం చేసుకున్నాడు. మోహమ్మద్ ఇస్రార్, ఫర్హీన్ దంపతులకు యాష్పిక్ (11), ఇనయా (9) అనే ఇద్దరు కూతుర్లతో పాటు మరో కుమారుడు ఉన్నాడు. మోహమ్మద్ ఇస్రార్ గతంలో దుబాయ్ లో వాచ్ లు, ఎలక్ట్రానిక్ వస్తువుల వ్యాపారం చేసేవాడు.

దుబాయ్ టూ ఢిల్లీ
దుబాయ్ లో వ్యాపారం చేస్తున్న మోహమ్మద్ అతని భార్య, పిల్లలతో కలిసి దుబాయ్ లోనే కొన్ని సంవత్సరాలు సంతోషంగా కాపురం చేశాడు. దుబాయ్ లో ఎలక్ట్రానిక్ వస్తువుల వ్యాపారం దెబ్బ తినడంతో మోహమ్మద్ సొంత ఊరు ఢిల్లీ చేరుకున్నాడు. ఢిల్లీలోని జాఫ్రాబాద్ లో భార్య, ముగ్గురు పిల్లలతో కలిసి నివాసం ఉంటున్న మోహమ్మద్ జీన్స్ వ్యాపారం చేస్తున్నాడు.

జీన్స్ వ్యాపారంలో విపరీతంగా నష్టాలు
వ్యాపారి మోహమ్మద్ నివాసం ఉంటున్న భవనంలోనే మూడు అంతస్తుల్లోని ఒక అంతస్తులో అతని తల్లిదండ్రులు, మరో అంతస్తులో సోదరుడు నివాసం ఉంటున్నారు. రాత్రి వ్యాపారి మోహమ్మద్ అతని భార్య, పిల్లలకు ఆహారంలో మత్తు మందుకలిపి ఇచ్చాడు. అర్దరాత్రి దాటిన తరువాత వ్యాపారి అతని భార్య, ఇద్దరు కూతుర్లను కాల్చి చంపి తరువాత రివాల్వర్ అతను కాల్చుకుని ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది.

నిద్రపోయి బతికిపోయిన కొడుకు.... వ్యాపారంలో ?
కింద చిన్నాన ఇంటిలో నిద్రపోతున్న మోహమ్మద్ కొడుకు ఉదయం నిద్రలేచి మేడ మీదకు వెళ్లిన తరువాత మోహమ్మద్ అతని భార్య, కూతుర్లను హత్య చేసి ఆత్మహత్య చేసుకున్న విషయం వెలుగు చూసింది. తాను ఏ వ్యాపారం చేసినా నష్టం వస్తోందని, .జీన్స్ వ్యాపారంలో విపరీతంగా నష్టాలు వచ్చాయని, అందుకే ఆత్మహత్య చేసుకుంటున్నానని మోహమ్మద్ ఓ వీడియో తీసి రివాల్వర్ తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు అన్నారు. అయితే మోహమ్మద్ ఎలాంటి డెత్ నోట్ రాసి పెట్టలేదని పోలీసులు అంటున్నారు.
-
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్ -
Red Alert: వడగళ్ల వాన, రాబోయే రెండు గంటల్లో భారీ వర్షం












Click it and Unblock the Notifications