ఎస్ఐ కుటుంబ సభ్యుల సామూహిక ఆత్మహత్య

న్యూఢిల్లీ: జీవితంపై విరక్తి చెందిన ఓ పోలీసు అధికారి కుటుంబ సభ్యులు సామూహిక ఆత్మహత్య చేసుకున్న సంఘటన దేశ రాజధాని ఢిల్లీ నగరంలో జరిగింది. కాశ్మీరీ గేట్ పోలీస్ స్టేషన్ లో ఎస్ఐగా ఉద్యోగం చేస్తున్న క్రిష్ణపాల్ కు భార్య మునేష్ (45), కుమారుడు ధీరజ్ కుమార్ (23), కుమార్తె లూనా (19) ఉన్నారు.

క్రిష్ణపాల్ కుటుంబ సభ్యులతో కలిసి సంతోషంగానే ఉంటున్నాడని తెలిసింది. అయితే తన భార్య, కుమారుడు, కుమార్తె శనివారం నుంచి కనపడటం లేదని క్రిష్ణపాల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి అనేక కోణాల్లో దర్యాప్తు చేశారు. అయినా ఫలితం లేకపోయింది.

Family members of Delhi police SI commit suicide

పోలీసులు ముగ్గరి కోసం గాలించారు. అయితే మంగళవారం షామ్లీ ప్రాంతంలోని రైలు పట్టాల మీద ముగ్గురి శవాలు పడి ఉన్నాయని పోలీసులకు సమచారం వెళ్లింది. పోలీసులు సంఘటనా స్థానికి చేరుకుని పరిశీలించారు. క్రిష్ణపాల్ కుటుంబ సభ్యులే ఆత్మహత్య చేుసుకున్నారని గుర్తించి కేసు నమోదు చేశారు.

మంగళవారం వేగంగా వెలుతున్న రైలు కింద ముగ్గురు పడటంతో అక్కడికక్కడే దుర్మరణం చెందారని పోలీసుల విచారణలో వెలుగు చూసింది. వీరి ఆత్మహత్యలకు కచ్చితమైన కారణాలు తెలియడం లేదని కేసు దర్యాప్తులో ఉందని పోలీసు అధికారి నిషాంక్ శర్మ తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+