అంతర్జాతీయ ఎయిర్ పోర్టులో యువతి మాయం, నైట్ డ్యూటీకి వెళ్లి ఉదయం ? !

ఐటీ హబ్ బెంగళూరులో మరో యువతి మాయం అయ్యింది. కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం (బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయం)లోని టెర్మినల్ 1లోని క్యాబ్ కంపెనీలో బుకింగ్ ఏజెంట్‌గా పనిచేస్తున్న 27 ఏళ్ల యువతి గత నాలుగు రోజులుగా కనిపించకుండా పోయింది. ఈ విషయమై ఆమె సోదరుడు బుధవారం కెంపెగౌడ ఎయిర్‌పోర్ట్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు.

కర్ణాటకలోని తుమకూరుకు చెందిన నేత్రా అనే యువతి విట్ క్యాబ్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నది. కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలోని హునసామరనహళ్లిలోని యమునా పీజీ వసతి గృహంలో నేత్రా నివసిస్తోంది. నేత్రా ప్రతి రోజూ ఏదో ఒకటైమ్ లో ఫోన్ చేసి కుటుంబ సభ్యులతో మాట్లాడేది. డిసెంబర్ 29వ తేదీన మధ్యాహ్నం కుటుంబ సభ్యులకు ఫోన్ చేసిన నేత్రా తాను రాత్రి డ్యూటీలో ఉంటానని చెప్పింది.

Family members filed a case of missing young woman working at Bengaluru International Airport

డిసెంబర్ 30వ తేదీ నుంచి ఆమె కుటుంబానికి ఎలాంటి కాల్స్ రాలేదు. కుటుంబ సభ్యులు ఫోన్ చేయగా నేత్రా ఫోన్ స్విచ్ఛాఫ్ అయింది. మొబైల్ ఛార్జ్ అయిపోయి ఉంటుందని నేత్రా కుటుంబ సభ్యులు అనుకున్నారు. డిసెంబర్ 31వ తేదీన మరోసారి నేత్రాకు ఆమె కుటుంబ సభ్యులు ఫోన్ చేయగా ఆమె ఫోన్ స్విచ్ఛాఫ్‌ అని రావడంతో ఆమె కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నట్లు ఓ పోలీసు అధికారి తెలిపారు.

నేత్రా సోదరుడు మహేష్ కుమార్ జనవరి 2వ తేదీన విట్‌ కంపెనీకి వెళ్లి తన సోదరి నేత్రా కనిపించడం లేదని, ఏమి జరిగిందో చెప్పాలని ప్రశ్నించాడు. డిసెంబర్ 29వ తేదీన నైట్ షిఫ్ట్ ముగించుకుని ఉదయం 6 గంటలకు నేత్రా ఆమె నివాసం ఉంటున్న పీజీలోని రూమ్ దగ్గరకు బయల్దేరి వెళ్లిందని కంపెనీ ఉద్యోగులు ఆమె సోదరుడు మహేష్ కుమార్ కు చెప్పారు. నేత్రా స్నేహితులు, తెలిసిన వారితో మాట్లాడి ఆమె గురించి విచారించగా ఆమె ఎక్కడ ఉందో ఇంతవరకు ఎవరికీ తెలియలేదు.

Family members filed a case of missing young woman working at Bengaluru International Airport

తన సోదరి నేత్రా కనినింయడం లేదని ఆమె సోదరుడు మహేష్ కుమార్ మిస్సింగ్ కేసు పెట్టాడు. నెల రోజుల వ్యవధిలో మరో మహిళ అదృశ్యం కావడం ఇది రెండో కేసు నమోదు అయ్యింది. గత నాలుగు నెలల్లో ఎయిర్‌పోర్ట్ పోలీస్ స్టేషన్‌లో రెండో మిస్సింగ్ ఎఫ్‌ఐఆర్ నమోదైంది. డిసెంబర్ 3వ తేదీ ఇండిగో కార్గో డిపార్ట్‌మెంట్‌లో ఉద్యోగం చేస్తున్న 22 ఏళ్ల యువతి కనిపించడం లేదని ఆమె తల్లి కేసు పెట్టింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+