lovers: మీరు ఏమనుకున్నా సరే, ఇదే మా నిర్ణయం, నేరుగా రైలు ఎక్కిన ప్రేమికులు ఏం చేశారంటే ?

ప్రియుడు అతని ప్రియురాలిని పెళ్లి చేసుకుని జీవితాంతం సుఖంగా ఉండాలని అనుకున్నాడు. ప్రేమికులు పెళ్లి చేసుకుంటామని వారి కుటుంబ సభ్యులకు చెప్పారు. రెండు ఫ్యామిలీలు ప్రేమికుల పెళ్లిని వ్యతిరేకించారు.

చెన్నై: యువతి, యువకుడు ప్రేమించుకున్నారు. మైనర్ గా ఉన్న సమయంలోనే ప్రేమలో పడిన యువతి ఆమె ప్రియుడి వెంట తిరుగుతూ సంతోషంగా ఉండేది. ప్రియుడిని పెళ్లి చేసుకోవాలని ప్రియురాలు అనుకుంది. ప్రియుడు సైతం అతని ప్రియురాలిని పెళ్లి చేసుకుని జీవితాంతం సుఖంగా ఉండాలని అనుకున్నాడు. ప్రేమికులు పెళ్లి చేసుకుంటామని వారి కుటుంబ సభ్యులకు చెప్పారు. అయితే రెండు ఫ్యామిలీలు ప్రేమికుల పెళ్లిని వ్యతిరేకించారు. కుటుంబ సభ్యుల తీరుతో విసిగిపోయిన ప్రేమికులు రైలు ఎక్కారు.

రైలులో నుంచి దూకిన ప్రేమికులు

రైలులో నుంచి దూకిన ప్రేమికులు

చెన్నైలోని పరంగిమలై రైల్వే స్టేషన్ సమీపంలో రైలు కిందకు దూకిన యువతి, యువకుడు ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించారు. చెన్నైలోని పరంగిమలై రైల్వే స్టేషన్ సమీపంలో పట్టాలపై తాంబరం వైపు వెళ్తున్న ఎలక్ట్రిక్ రైలు ముందు జంట దూకడంతో అందరూ హడలిపోయారు. 19 ఏళ్ల యువతి తలకు బలమైన గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందింది. తలకు బలమైన గాయాలైనాయి. సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ప్రాణాలతో పోరాడుతున్న యువకుడిని వెంటనే చెన్నైలోని రాయపేట ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

ప్రేమికులు ఎవరు ?

ప్రేమికులు ఎవరు ?

ప్రేమికుడికి ఇంటెన్సివ్ కేర్ యూనిట్‌లో చేర్చించి చికిత్స అందిస్తున్నారు. బాధితురాలి మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం చెన్నైలోని రాజీవ్ గాంధీ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మాంబలం రైల్వే పోలీస్ ఇన్‌స్పెక్టర్ వైరవన్, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని బాధిత మహిళ, ప్రాణాలతో పోరాడుతున్న యువకుడు ఎవరు ?, ఎందుకు రైలు కింద దూకేశారు అని ఆరా తీశారు.

ఫ్యామిలీ వ్యతిరేకం

ఫ్యామిలీ వ్యతిరేకం

చెన్నైలోని మడిపాక్కంలోని ఊనగరం ప్రాంతానికి చెందిన యువకుడి పేరు ఇళంగోవన్ (20) అని వెలుగు చూసింది. ఇళంగోవన్ జైన్ కళాశాలలో డిగ్రీ మూడో సంవత్సరం చదువుతున్నట్లు రైల్వే పోలీసు అధికారుల విచారణలో వెలుగు చూసింది. రైలు కిందపడది ఆత్మహత్య చేసుకున్న యువతి పేరు ఐశ్వర్య అతని పోలీసులు గుర్తించారు. ఐశ్వర్య, ఇళంగోవన్ ప్రేమించుకున్నారని, వీరు పెళ్లి చేసుకోవడానికి ఇరు వైపుల కుటుంబ సభ్యులు వ్యతిరేకత వ్యక్తం చేశారని పోలీసుల ప్రాథమిక విచారణలో వెలుగు చూసింది.

ప్రియుడు మాత్రం ?

ప్రియుడు మాత్రం ?

పెద్దలు పెళ్లిని వ్యతిరేకించడంతో ప్రేమికులు ఐశ్వర్య, ఇళంగోవన్ రైలు కిందదూకి ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించారని పోలీసులు అన్నారు. ఇళంగోవన్ తలకు భలమైన గాయాలు కావడంతో అతని పరిస్థతి విషమంగానే ఉందని, ఇరు వైపుల కుటుంబ సభ్యులను పిలిపించి విచారణ చేస్తున్నామని పోలీసు అధికారులు తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+