Wife: భర్ద వద్దని పోలీసులకు చెప్పి కజిన్ తో వెళ్లిపోయిన భార్య, ఉరి వేసుకున్న భర్త, భార్య, కజిన్ ఎస్కేప్ !

లూధియానా/ పంజాబ్: కొన్ని సంవత్సరాల క్రితం వివాహం చేసుకున్న మహిళ ఆమె భర్తతో సంతోషంగానే కాపురం చేసింది. ఇద్దరు పిల్లలు పుట్టిన తరువాత భార్య ప్రవర్తనలో మార్పు వచ్చింది. పదేపదే పుట్టింటికి వెళ్లి వస్తున్న భార్యను ఆమె భర్త మందలించాడు. నేను ఎప్పుడైనా బయటకు వెళ్లి వస్తాను, అడగడానికి నువ్వు ఎవరు ? అంటూ భార్య ఎదురుతిరగడం మొదలుపెట్టింది. దంపతుల మద్య పంచాయితీలు చేసిన పెద్దలు చివరికి వారిని వదిలేశారు. పిల్లలను భర్త ఇంట్లో వదిలేసిన భార్య కొన్ని నెలల క్రితం బయటకు వెళ్లిపోయింది. మళ్లీ భర్త ఇంటికి వెళ్లి అతని గొడవ పెట్టుంది. భర్త మీద వేధింపుల కేసు పెట్టి పోలీస్ స్టేషన్ వరకు లాగింది. పోలీసులు పంచాయితీలు చేస్తుంటే నాకు నా మొగుడు అక్కరలేదు అంటూ ఆమె కజిన్ బ్రదర్ తో వెళ్లిపోయింది. ఇంటికి వెళ్లిన భర్త ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. భార్య, ఆమె కజిన్ మీద కేసు నమోదు కావడంతో ఇద్దరూ ఇప్పుడు మాయం అయ్యారు.

11 ఏళ్లక్రితం పెళ్లి

11 ఏళ్లక్రితం పెళ్లి

పంజాబ్ లోని లూధియానా సమీపంలోని టిబ్బా సమీపంలోని అటల్ నగర్ లో బల్ దేవ్ (35) అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. 11 సంవత్సరాల క్రితం బల్ దేవ్ అనితా అనే మహిళను వివాహం చేసుకున్నాడు. బల్ దేవ్, అనితా దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. బల్ దేవ్ కుటుంబ సభ్యులతో అనితా కలిసి ఒకే ఇంటిలో ఉంటున్నది.

పదేపదే పుట్టింటికి వెలుతున్న భార్య

పదేపదే పుట్టింటికి వెలుతున్న భార్య

వివాహం చేసుకున్న తరువాత అనిత ఆమె భర్త బల్ దేవ్ తో సంతోషంగానే కాపురం చేసింది. ఇద్దరు పిల్లలు పుట్టిన తరువాత అనితా ప్రవర్తనలో మార్పు వచ్చింది. పదేపదే పుట్టింటికి వెళ్లి వస్తున్న అనితాను ఆమె భర్త బల్ దేవ్ మందలించాడు. నేను ఎప్పుడైనా బయటకు వెళ్లి వస్తాను, అడగడానికి నువ్వు ఎవరు ? అంటూ అనితా ఆమె భర్త బల్ దేవ్ కు ఎదురుతిరగడం మొదలుపెట్టింది.

కజిన్ తో క్లోజ్ గా ఉంటున్న భార్య ?

కజిన్ తో క్లోజ్ గా ఉంటున్న భార్య ?

పుట్టింటి సమీపంలో నివాసం ఉంటున్న కజిన్ బ్రదర్ తో అనితా చాలా క్లోజ్ గా ఉంటుందని ఆమె భర్త బల్ దేవ్ కు తెలిసింది. ఇదే విషయంలో అనితా, బల్ దేవ్ దంపతుల మద్య గొడవలు మొదలైనాయి. భర్త బల్ దేవ్ ఎంత మొత్తుకున్నా అనితా మాత్రం నెలకు ఒకసారి పుట్టింటికి వెళ్లి కొన్ని రోజులు అక్కడే ఉండి వస్తోందని తెలిసింది.

పిల్లలను వదిలేసి వెళ్లిపోయిన భార్య

పిల్లలను వదిలేసి వెళ్లిపోయిన భార్య

బల్ దేవ్, అనితా దంపతుల మద్య పంచాయితీలు చేసిన పెద్దలు చివరికి వారిని వదిలేశారు. పిల్లలను భర్త బల్ దేవ్ ఇంట్లో వదిలేసిన అనితా నాలుగు నెలల క్రితం ఆమె మాత్రమే ఇంటి నుంచి బయటకు వెళ్లిపోయింది. నాలుగు నెలల తరువాత సెప్టెంబర్ 27వ తేదీన మళ్లీ భర్త బల్ దేవ్ఇంటికి వెళ్లిన అనితా అతనితో గొడవ పెట్టకుంది.

భర్త మీద కేసు పెట్టి కజిన్ తో వెళ్లిపోయిన భార్య

భర్త మీద కేసు పెట్టి కజిన్ తో వెళ్లిపోయిన భార్య

అనితా ఆమె భర్త బల్ దేవ్ మీద వేధింపుల కేసు పెట్టి పోలీస్ స్టేషన్ వరకు లాగింది. పోలీసులు బల్ దేవ్ ను పోలీస్ స్టేషన్ కు పిలిపించి విచారణ చేశారు. పోలీసులు పంచాయితీలు చేస్తుంటే నాకు నా మొగుడు బల్ దేవ్ అక్కరలేదు, అతని ఇంటికి నేను వెళ్లను అంటూ అనితా ఆమె తల్లి, కజిన్ బ్రదర్ తో కలిసి ఆమె పుట్టింటికి వెళ్లిపోయింది.

ఆత్మహత్య చేసుకున్న భర్త.... భార్య, కజిన్ ఎస్కేప్

ఆత్మహత్య చేసుకున్న భర్త.... భార్య, కజిన్ ఎస్కేప్

పోలీస్ స్టేషన్ నుంచి నేరుగా ఇంటికి వెళ్లిన బల్ దేవ్ అవమానంతో ఇంటిలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. బల్ దేవ్ ఆత్మహత్యకు భార్య అనితా, ఆమె కజిన్ కారణం అని బల్ దేవ్ తల్లి బీమ్లాదేవి కేసు పెట్టింది. అనితా తన కొడుకు బల్ దేవ్ కు నరకం చూపించిందని, ఆమె, ఆమె కజిన్ కారణంగానే నా కొడుకు ఆత్మహత్య చేసుకున్నాడని బీమ్లాదేవి పోలీసులకు చెప్పింది. బల్ దేవ్ ఆత్మహత్యకు కారణం అయిన అతని భార్య అనితా, ఆమె కజిన్ బ్రదర్, మరో బంధువు మీద కేసు నమోదు చేశామని అసిస్టెంట్ కమీషనర్ డేవిందర్ చౌదరీ చెప్పారని స్థానిక మీడియా తెలిపింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+