ప్రముఖ కొరియోగ్రాఫర్ శివశంకర్ మాస్టర్ కరోనాతో కన్నుమూత: విషాదంలో సినీ పరిశ్రమ
చెన్నై: కరోనావైరస్ మహమ్మారి బారినపడి ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ప్రముఖ కొరియోగ్రాఫర్ శివశంకర్ మాస్టర్ ఆదివారం రాత్రి తుది శ్వాస విడిచారు. ఇటీవల శివశంకర్ మాస్టర్ తోపాటు ఆయన కుటుంబం కూడా కరోనా బారినపడింది. ప్రస్తుతం శివశంకర్ పెద్ద కుమారుడు విజయ్ శివశంకర్ ఆస్పత్రిలోనే చికిత్స పొందుతున్నాడు.
తమిళనాడు రాజధాని చెన్నలై డిసెంబర్ 7, 1948లో జన్మించారు శివశంకర్ మాస్టర్. శివశంకర్ తండ్రి కళ్యాణ సుందరం పండ్ల వ్యాపారి. 1974లో మాస్టర్ సలీమ్ వద్ద సహాయ నృత్యదర్శకుడిగా పనిచేశారు శివశంకర్ మాస్టర్.

భారతీయ చిత్ర పరిశ్రమలోని 10 భాషలలో చిత్రాలకు నృత్యరీతులు సమకూర్చారు శివశంకర్ మాస్టర్, 800 చిత్రాలకుపైగా డ్యాన్స్ మాస్టర్‌గా పనిచేసిన శివశంకర్ మాస్టర్.. దాదాపు 30 చిత్రాల్లో నటించి మెప్పించారు.
2011లో మగధీర చిత్రంలోని ఓ పాటకు నతృరీతులు సమకూర్చినందుకు జాతీయ పురస్కారాన్ని అందుకున్నారు శివశంకర్ మాస్టర్. శివశంకర్ మాస్టర్ కొరియోగ్రఫీ చేసిన చిత్రాలలో కొన్ని.. అమ్మోరు, సూర్యవంశం, అల్లరి పిడుగు, మగధీర, అరుంధతి, మహాత్మా, బాహుబలి ది బిగినింగ్ మొదలైనవి ఉన్నాయి.
Recommended Video
శివశంకర్ మాస్టర్ మృతితో సినీ పరిశ్రమలు విషాదంలో మునిగిపోయాయి. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని పలువురు సినీ ప్రముఖులు ప్రార్థించారు. మాస్టర్ మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రముఖ సినీనటులు చిరంజీవి, సోనూ సూద్ లాంటివారు శివశంకర్ మాస్టర్ వైద్య చికిత్సకు సాయమందించిన విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications