పాకిస్తాన్ ముర్దాబాద్: ఇంత వైల్డ్‌గా ఉన్నారేంటి- వదిలితే తగుల బెట్టేసేట్టున్నారు
Missile attack on India: జమ్మూ కాశ్మీర్‌పై పాకిస్తాన్ భారీ ఎత్తున దాడికి పాల్పడింది. తొలుత డ్రోన్లతో దాడి చేసింది. ఆ తరువాత మోర్టార్ షెల్స్‌తో విరుచుకుపడింది. అనంతరం మిస్సైళ్లనూ సంధించింది పాకిస్తాన్ సైన్యం. మొత్తంగా ఎనిమిది మిస్సైళ్లను ప్రయోగించగా.. వాటన్నింటినీ కూడా భారత ఆర్మీ మధ్యలోనే ఇంటర్‌సెప్ట్ అయింది. వాటిని కూల్చివేసింది.
ప్రత్యేకించి- జమ్మూలో పలు ప్రాంతాల్లో పాకిస్తాన్ భూభాగంపై నుంచి పదుల సంఖ్యలో డ్రోన్లు జమ్మూ వైపు దూసుకుని రావడం కనిపించింది. డ్రోన్లతో దాడికి దిగింది పాకిస్తాన్ ఆర్మీ. ఉధంపూర్, జమ్మూ, అఖ్నూర్, పఠాన్‌కోట్ వైపు దూసుకొచ్చాయి అవి. యుద్ధంలో వినియోగించే స్వార్న్ డ్రోన్లను పాకిస్తాన్ ఆర్మీ ప్రయోగించినట్లు భారత సైనిక వర్గాలు ప్రాథమికంగా నిర్ధారించాయి.

డ్రోన్లు భారత్ వైపు దూసుకుని రావడం మొదలుపెట్టిన కొన్ని క్షణాల వ్యవధిలోనే జమ్మూ కాశ్మీర్ అంతటా సైరన్ మోతలు మోగించింది భారత ఆర్మీ. సాధారణ పౌరులకు ముందస్తు హెచ్చరికలను జారీ చేసింది. బహిరంగ ప్రదేశాల్లో ఎవరూ ఉండకూడదనడానికి సూచికగా సైరన్ మోతలు మోగించింది.
వరుసబెట్టి వస్తోన్న డ్రోన్లను భారత ఆర్మీ ఎక్కడికక్కడ అడ్డుకుంటోంది. వాటితో ఇంటర్‌సెప్ట్ అయింది. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూల్చివేస్తోంది. అదే సమయంలో బ్లాక్ అవుట్‌ను కూడా నిర్వహించింది. చీకటి ఆవరించిన జమ్మూ కాశ్మీర్ గగనతలంపై డ్రోన్లు దూసుకుని వచ్చే వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
ఆ తరువాత కొద్దిసేపటికే నియంత్రణ రేఖ వెంబడి గల సరిహద్దు గ్రామాలు, భారత ఆర్మీ పోస్టులపై క్షిపణులను ప్రయోగించింది. సత్వారి, సాంబ, ఆర్ఎస్ పురా, ఆర్నియా సెక్టార్లల్లో మిస్సైళ్లను సంధించింది. మొత్తంగా ఎనిమిది మిస్సైళ్లను పాక్ ఆర్మీ ప్రయోగించినట్లు వీటిని భారత ఆర్మీ వర్గాలు ధృవీకరించాయి. వాటిని మధ్యలోనే నేల కూల్చివేసినట్లు తెలిపాయి.
దీని తీవ్రతను దృష్టిలో పెట్టుకుని హిమాచల్ ప్రదేశ్‌లోని ధర్మశాలలో జరుగుతున్న ఐపీఎల్ మ్యాచ్ అర్ధాంతరంగా రద్దయింది. ఢిల్లీ కేపిటల్స్, పంజాబ్ కింగ్స్ మధ్య జరుగుతున్న మ్యాచ్ ఇది. తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న పంజాబ్ కింగ్స్ 10.1 ఓవర్లల్లో ఒక వికెట్ నష్టానికి 122 పరుగులు చేసింది. ఆ సమయంలో మ్యాచ్ నిలిచిపోయింది.
తొలుత బ్యాడ్ లైట్ వల్ల మ్యాచ్ ఆగిపోయినట్లు సమాచారం ఇచ్చారు. ఆ తరువాత స్టేడియం మొత్తాన్ని కూడా ఖాళీ చేయాలంటూ హిమాచల్ ప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ ప్రతినిధులు గ్రౌండ్‌లోకి వచ్చి ప్రేక్షకులకు విజ్ఞప్తి చేశారు. ఆ కొద్దిసేపటికే మ్యాచ్ రద్దయినట్లు ప్రకటించారు. అప్పటికే జమ్మూ కాశ్మీర్ సరిహద్దుల్లో కాల్పులు మొదలయ్యాయి కూడా.
అర్ధాంతరంగా మ్యాచ్ రద్దు కావడం, అదే సమయంలో హిమాచల్ ప్రదేశ్ పొరుగునే ఉన్న జమ్మూ కాశ్మీర్‌లో యుద్ధ వాతావరణం నెలకొనడం.. ధర్మశాలలో ఉద్రిక్తతకు కారణమైంది. పోలీసులు, భద్రత సిబ్బంది స్టేడియం వద్దకు చేరుకున్నారు. ప్రేక్షకులకు భద్రత కల్పించారు.

మ్యాచ్ రద్దయిన తరువాత ప్రేక్షకులు పాకిస్తాన్‌కు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేయడం కనిపించింది. పాకిస్తాన్, ఆ దేశ సైన్యం తీరును నిరసించారు. భారత్‌కు జిందాబాద్ కొట్టారు. పాకిస్తాన్ ముర్దాబాద్, పాకిస్తాన్ ఆర్మీ ముర్దాబాద్ అంటూ నినాదాలు చేశారు క్రికెట్ అభిమానులు.
జిందాబాద్, జిందాబాద్.. హిందూస్తాన్ జిందాబాద్, ఇండియన్ ఆర్మీ జిందాబాద్ అంటూ నినదించారు. జొ హమ్ సే ఠకరాయేగా వో చూర్ చూర్ హో జాయెగా అని నినాదాలు చేశారు. భారత్‌తో తలపడ్డ ప్రతీసారి పాకిస్తాన్ ఓడిపోయిందని, ఇప్పుడూ అదే జరుగుతుందంటూ ధీమా వ్యక్తం చేశారు.
#WATCH | Dharamshala, Himachal Pradesh: People chant 'Pakistan murdabad' slogans as IPL match between Delhi Capitals and Kings XI Punjab called off after Pakistan launched missiles and drones into India, which were intercepted and neutralised by India's air defence system. pic.twitter.com/7Pcsk9929b
— ANI (@ANI) May 8, 2025












Click it and Unblock the Notifications