Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Farm Bills: ఇండియా గేట్ సాక్షిగా 3D సినిమా, ట్రాక్టర్ కు నిప్పు, భగత్ సింగ్ కే అవమానం, మోదీ బొమ్మ !

న్యూఢిల్లీ/ బెంగళూరు: అన్నదాతలకు కడుపు మండుతోంది. కేంద్ర ప్రభుత్వం ఇటీవల అమోదించిన వ్యవసాయ బిల్లులను వ్యతిరేకిస్తూ దేశ వ్యాప్తంగా రైతులు ఆందోళనలు చేస్తున్నారు. సోమవారం కర్ణాటకలో బంద్ జరుగుతోంది. పంజాబ్, హర్యానా, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్ తదితర రాష్ట్రాల్లో అన్నదాతలు ఆందోళనలు చేస్తున్నారు. రైతులు చేస్తున్న ఆందోళనలు దేశ రాజధాని ఢిల్లీకి చేరాయి. వ్యవసాయ బిల్లులను రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ఆమోదించడంతో అన్నదాతలు నిరసన వ్యక్తం చేస్తున్నారు. దేశ రాజధాని ఢిల్లీ నడిబొడ్డున ఉన్న ఇండియా గేట్ దగ్గర ట్యాక్టర్ కు నిప్పంటించి, ప్రధాని నరేంద్ర మెదీ దిష్టి బోమ్మలు దహనం చేసి కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చెయ్యడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇండియా గేట్ సాక్షిగా రైతులు కేంద్ర ప్రభుత్వానికి 3D సినిమా చూపించారు.

 భగత్ సింగ్ జయంతి రోజే అన్నదాతల కడుపు మండింది

భగత్ సింగ్ జయంతి రోజే అన్నదాతల కడుపు మండింది

కేంద్ర ప్రభుత్వం అమోదం తెలిపిన వ్యవసాయ బిల్లులను దేశవ్యాప్తంగా అన్నదాతలు వ్యతిరేకిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం తీరును వ్యతిరేకిస్తూ కొన్ని రోజుల నుంచి దేశవ్యాప్తంగా రైతులు ఆందోళనలు చేస్తున్నారు. పంజాబ్ ముద్దుబిడ్డ, స్వాతంత్ర సమరయోధుడు భగత్ సింగ్ జయంతి రోజే మేము రోడ్ల మీదకు వచ్చి ఆందోళన చెయ్యాల్సిన పరిస్థితి వచ్చిందని, మా కడుపు మండుతోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

 ఇండియా గేట్ ముందే ట్రాక్టర్ కు నిప్పు

ఇండియా గేట్ ముందే ట్రాక్టర్ కు నిప్పు

పంజాబ్ యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో దేశ రాజధాని ఢిల్లీలోని నిరసన కార్యక్రమాలు జరిగాయి. సోమవారం న్యూఢిల్లీలోని ఇండియా గేట్ సమీపంలో కుర్చున్న రైతులు. యూత్ కాంగ్రెస్ నాయకులు నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్బంగా ఒక్కసారిగా ఆవేశంతో రగిలిపోయిన అన్నదాతలు, యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు ట్రాక్టర్ ను ఇండియా గేట్ సమీపంలోకి తీసుకువచ్చి నిప్పంటించి నిరసన వ్యక్తం చేశారు.

ప్రధానికి సెగ.... మోదీ దిష్టిబొమ్మలు దహనం

న్యూఢిల్లీలోని ఇండియా గేట్ దగ్గర అన్నదాతలు ఎంతో పవిత్రంగా చూసుకునే ట్రాక్టర్, దేశం మొత్తం రైతులు ఉపయోగించే ట్రాక్టర్ కు నిప్పంటించి నిరసన వ్యక్తం చేసిన రైతులు, కాంగ్రెస్ కార్యకర్తలు ప్రధాని నరేంద్ర మోదీ దిష్టి బొమ్మలు దహనం చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా రైతులు నినాదాలు చెయ్యడంతో ఆ ప్రాంతం దద్దరిల్లింది.

 చేతులు ఎత్తేసిన పోలీసులు

చేతులు ఎత్తేసిన పోలీసులు

ఇండియా గేట్ దగ్గర శాంతియుతంగా ధర్నా చేస్తున్న రైతులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎవ్వరూ ఊహించిన విధంగా నడిరోడ్డులో ట్రాక్టర్ కు నిప్పంటించి, ప్రధాని నరేంద్ర మోదీ దిష్టిబొమ్మలు దహనం చెయ్యడంతో అక్కడ బందోబస్తులో ఉన్న పోలీసుల దిమ్మతిరిగిపోయింది. రైతులు, కాంగ్రెస్ కార్యకర్తలను నిలువరించడానికి ప్రయత్నించిన పోలీసులు చివరికి చేతులు ఎత్తేశారు.

 దేశ రాజధానిలో ఉద్రిక్త పరిస్థితులు

దేశ రాజధానిలో ఉద్రిక్త పరిస్థితులు

ఇండియా గేట్ ముందు ట్రాక్టర్ కు రైతులు నిప్పు అంటించడంతో ఉద్రిక్తపరిస్థితులు నెలకొన్నాయి. వెంటనే కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిసిన వ్యవసాయ బిల్లులను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ కర్ణాటకలో బంద్ కొనసాగుతోంది. రైతులకు మద్దతుగా దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా ఆందోళనలు చేస్తున్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+