ఢిల్లీ సరిహద్దుల్లో రైతుల ఆందోళన: మూడో దఫా చర్చలు విఫలం; మళ్ళీ 18న చర్చలు!!
రాజధాని ఢిల్లీ సరిహద్దులలో రైతుల ఆందోళన కొనసాగుతుంది. తమ డిమాండ్ల సాధనకు రైతులు చేస్తున్న నిరవధిక ఆందోళనలో భాగంగా నేడు భారత్ బంద్ కు పిలుపునిచ్చిన క్రమంలో భారత్ బంద్ కొనసాగుతుంది. ఇదిలా ఉంటే రైతు సంఘాల నేతలతో చండీగఢ్లో కేంద్ర మంత్రులు జరిపిన చర్చలు అసంపూర్తిగా ముగిశాయి. రైతు సంఘాలు పెట్టిన డిమాండ్ల పరిష్కారం దొరకని కారణంగా ఇప్పటివరకు మూడు దఫాలుగా జరిగిన చర్చలు విఫలమయ్యాయి.
ఈరోజు సమావేశంలో హర్యానా ప్రభుత్వం, పోలీసులు చర్యలపై రైతు సంఘాల నాయకులు అసహనం వ్యక్తం చేశారు. ఇక ఇదే విషయాన్ని కేంద్రమంత్రుల దృష్టికి కూడా తీసుకువెళ్లారు. ప్రధానంగా రైతుసంఘాల నాయకులు చేస్తున్న డిమాండ్లలో మద్దతు ధరకు చట్టపరమైన హామీ, 2013 భూసేకరణచట్టం జాతీయస్థాయి అమలు, భూసేకరణలో రైతు లిఖితపూర్వక సమ్మతితో పాటు కలెక్టర్ నిర్ణయించిన ధరకు నాలుగు రెట్లు చెల్లింపు డిమాండ్ తదితర అంశాల పైన చర్చలు జరిపారు.

అయితే ఎంఎస్పికి చట్టబద్ధమైన హామీ అమలులో తలెత్తే సమస్యలపై కేంద్ర మంత్రులు రైతు సంఘాలకు వివరించి ఈ విషయం పైన ప్రభుత్వాన్ని ఒత్తిడి చేయొద్దని రిక్వెస్ట్ చేశారు. ఈ చర్చలలో అనేక అంశాలపై ప్రభుత్వానికి రైతు సంఘాల నాయకులకు ఏకాభిప్రాయం కుదిరింది. అయినప్పటికీ రైతు సంఘాల నాయకులు మద్దతు ధర విషయంలో వెనక్కి తగ్గేది లేదని తేల్చి చెప్పారు.
అయితే రైతు సంఘాల నాయకుల డిమాండ్లపై ఆదివారం సాయంత్రం 6 గంటలకు చర్చలు జరపనున్నట్టు కేంద్ర మంత్రులు చెప్తున్నారు. ఈ చర్చల ద్వారా శాంతియుత పరిష్కార మార్గాన్ని అన్వేషిస్తామని కేంద్ర మంత్రి అర్జున్ ముండా తెలిపారు. ఈరోజు రైతు సంఘాలకు ప్రభుత్వానికి మధ్య జరిగిన చర్చలు సానుకూలంగా ముగిశాయని, అనేక అంశాలపై నిర్ణయాలను తీసుకున్నామని ఆయన పేర్కొన్నారు.
తమ సమస్యలు పరిష్కారమయ్యే వరకు శాంతియుత నిరసన కొనసాగుతుందని నాయకుడు జగ్జీత్ సింగ్ దల్లేవాల్ స్పష్టం చేశారు. ఆదివారం సానుకూల ఫలితం రాకపోతే తదుపరి కార్యాచరణ ప్రకటిస్తామని, నిరసనలు కొనసాగిస్తామని స్పష్టం చేశారు. తమపై హింసాత్మక చర్యలు తీసుకున్నా వెనక్కి తగ్గేది లేదని రైతు సంఘాల నాయకులు తేల్చి చెబుతున్నారు. తాము పాకిస్తాన్ వాళ్ళం కాదని, భారతీయులమని, తమపై బల ప్రయోగం చేయడం సరైన పద్ధతి కాదని వారు మండిపడుతున్నారు.
-
హైదరాబాద్ జూపార్క్ లో వింత జంతువు.. భారీగా తరలివస్తున్న పర్యటకులు -
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
సప్తగిరి ఎక్స్ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై -
ఉత్తర తెలంగాణా అభివృద్ధిలో గేమ్ ఛేంజర్ ఆ ఎయిర్పోర్ట్.. కేంద్రం మరో కీలక అడుగు! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్తో ఛాన్స్ కొట్టేసింది! -
తండ్రి, తనయుడి స్థానాలు ఇవే- డీఎంకే తొలి జాబితా -
జన్మ నక్షత్రం పునర్వసు, పుష్యమి, ఆశ్లేష ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
H-1B Visa: హెచ్1బీ లాటరీ నోటీసుల విడుదల-స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి..! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
ఏప్రిల్ లో బ్యాంకులకు వరుస హాలిడేస్ - స్కూళ్లకు వేసవి సెలవులపై తాజా ఉత్తర్వులు..!!












Click it and Unblock the Notifications