ఎర్రకోటపై సిక్కు జెండా జాతికి అవమానం -సీజేఐ సుమోటోగా -రైతుల ర్యాలిలో టెర్రర్ చర్యలంటూ

వివాదాస్పద వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా దేశరాజధాని ఢిల్లీలో నిరసనలు కొనసాగిస్తోన్న రైతులు.. మంగళవారం రిపబ్లిక్ డే సందర్భంగా నిర్వహించిన ట్రాక్టర్ ర్యాలీ హింసాయుతంగా ముగిసింది. పోలీసులు నిర్ధేశించిన రూట్లలో కాకుండా, ఇతర మార్గాల్లో ట్రాక్టర్లు దూసుకురావడం, వాటిని బలగాలు అడ్డుకునే క్రమంలో తీవ్ర ఘర్షణ చెలరేగడం, ప్రమాదవశాత్తూ ఒక రైతు ప్రాణాలు కోల్పోయిన తర్వాత.. కొందరు ఎర్రకోటలోకి ప్రవేశించి సిక్కు మతానికి చెందిన జెండాలు ఎగరేయడం లాంటివి కలకలం రేపాయి. కాగా,

రైతుల ట్రాక్టర్ ర్యాలీ సందర్భంగా ఢిల్లీ హింసాకాండ చోటుచేసుకుందని, దేశప్రతిష్ట దిగజారేలా కొనసాగిన అరాచకశక్తులు పేట్రేగిపోయాయని, వీటికి సంబంధించిన అన్ని అంశాలను సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎస్ఏ బోబ్డే సుమోటోగా విచారణకు స్వీకరించాలని కోరుతూ డిమాండ్ వ్యక్తమైంది. ముంబై యూనివర్సిటీ న్యాయ విధ్యార్థిని అశిష్ రాయ్ మంగళవారం ఈ మేరకు సీజేఐ బోబ్డేకు లేఖ రాశారు.

farmers tractor rally: CJI urged to take cognisance of Delhi violence

జాతీయ చిహ్నామైన ఎర్రకోటపై జాతీయ జెండా స్థానంలో సిక్కు మతానికి చెందిన జెండాను ఎగరేయడం దేశాన్ని అవమానించడమేనని, అది కూడా రిపబ్లిక్ డే నాడు జరగడం రాజ్యాంగాన్ని కూడా ఉల్లంఘించినట్లయిందని, పోలీసులపై దాడులు కూడా గర్హనీయమని, మొత్తం హింసాకాండపై సీజేఐ సుమోటోగా పరిశీలన జరపాలని రాయ్ లేఖలో కోరారు. ఇదిలా ఉంటే..

రైతులు నిర్వహించిన ట్రాక్టర్ ర్యాలీలో పలు చోట్ల ఘర్షణలు జరగ్గా, 18 మంది పోలీసులు గాయపడ్డారు. వీరంతా ప్రస్తుతం ఢిల్లీలోని ఎల్‌ఎన్‌జేపీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఢిల్లీలో పరిస్థితులు తీవ్రంగా ఉండడంతో నగరంలో కేంద్ర హోంమంత్రిత్వ శాఖ అదనపు బలగాలను దింపుతోంది. సుమారు 15 కంపెనీల పారామిలిటరీ దళాలను దిల్లీలో మోహరించాలని నిర్ణయించినట్లు సమాచారం. దీంతో దాదాపు 1500 మంది జవాన్లు ఉండనున్నట్లు తెలుస్తోంది. 10 కంపెనీల సీఆర్‌పీఎఫ్‌, 5 కంపెనీల రెండవ తరహా.. పారామిలిటరీ బలగాలు మోహరించనున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. కాగా,

farmers tractor rally: CJI urged to take cognisance of Delhi violence

ట్రాక్టర్‌ ర్యాలీ హింసాత్మకంగా మారడంపై రైతు సంఘాలు విచారం వ్యక్తంచేశాయి. సంఘ విద్రోహ శక్తులు తమ ర్యాలీలోకి ప్రవేశించాయని సంయుక్త కిసాన్‌ మోర్చా పేర్కొంది. ఎలాంటి హింసాత్మక చర్యలకు, జాతీయ చిహ్నాలు, గౌరవాన్ని కించపరిచేలా వ్యవహరించకూడదని ముందుగానే హెచ్చరించినట్టు రైతు నేతలు ప్రకటనలో తెలిపారు. హింస జరిగిన ప్రాంతాల్లో, ఎర్రకోటపై జెండా వ్యవహారంలో రైతులెవరూ పాలుపంచుకోలేదని వారు స్పష్టం చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+