Vande Bharat: వందే భారత్ ను మించిన రైళ్లు-220కి.మీ వేగం-కేంద్రం ఆర్డర్..!
దశాబ్దాల చరిత్ర ఉన్న భారతీయ రైల్వే రూపురేఖల్ని మార్చడంలో వందేభారత్ ఎక్స్ ప్రెస్ (vande bharat express) రైళ్ల పాత్ర ఎంతో కీలకం. ముఖ్యంగా 160 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించేలా తయారు చేస్తున్న వందే భారత్ ఎక్స్ ప్రెస్ కోచ్ లు ప్రయాణికులకు ప్రీమియం ట్రావెల్ అనుభవాన్ని అందిస్తున్నాయి. అయితే ఇప్పుడు వాటి కంటే వేగంగా పట్టాలపై పరుగులు తీసే రైళ్లను ప్రయాణికులకు అందుబాటులో తీసుకురావడానికి రైల్వే శాఖ ప్రయత్నాలు ప్రారంభించింది. ఇందులో భాగంగా తొలి అడుగు వేసింది.
వందే భారత్ ఎక్స్‌ప్రెస్ కంటే వేగవంతమైన, గంటకు 220 కిలోమీటర్ల డిజైన్ వేగంతో కూడిన తదుపరి తరం రైలు సెట్‌ల తయారీకి భారతీయ రైల్వే ఆమోదం తెలిపింది. 2027-28 సంవత్సరానికి, స్టీల్ బాడీ కోచ్‌లతో, గంటకు 200 కిలోమీటర్ల కార్యాచరణ వేగంతో 2x16-కార్ల బ్రాడ్ గేజ్ రైళ్లను తయారు చేయనున్నారు. ఈ రైళ్లను ప్రస్తుతం ఉన్న రైళ్ల కంటే అధునాతన ఫీచర్లతో తయారు చేయిస్తున్నారు.

ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ BEMLకు అప్పగించిన కాంట్రాక్టు కింద ఈ రైళ్లను తయారు చేస్తారు. అధిక వేగంతో కూడిన రాకపోకలకు అనువుగా ఉండేలా,, అలాగే భద్రతను మెరుగుపరచడానికి కాంపోజిట్ స్లీపర్లు, ఏఐ-ఆధారిత ట్రాక్ పర్యవేక్షణ, అధునాతన వెల్డ్ టెస్టింగ్‌కు కూడా రైల్వే ఆమోదం తెలిపింది. దీంతో వచ్చే ఆర్దిక సంవత్సరంలో ఈ రైళ్లు అందుబాటులోకి రానున్నాయి. వీటిని ఏయే మార్గాల్లో ప్రవేశపెడతారన్న దానిపై ఇంకా క్లారిటీ లేదు. ఇప్పటికే బుల్లెట్ రైల్ కారిడార్లు కూడా అందుబాటులోకి వస్తున్న నేపథ్యంలో 220 కిలోమీటర్ల వేగంతో ఈ రైళ్లు వాటిపై దూసుకుపోయేందుకు అవకాశం లభిస్తుంది.












Click it and Unblock the Notifications