అమృత్ భారత్ 3.0 వచ్చేసింది, వందేభారత్ ను మించి - తొలిగా ఈ రూట్ లోనే..!! (వీడియో)
రైల్వే శాఖ ప్రయాణీకులకు గుడ్ న్యూస్ చెప్పింది. వందేభారత్ నుంచి వరుసగా పలు రకాలైన అధునాతన సదుపాయాలతో కొత్త రైళ్లను ప్రవేశ పెడుతోంది. ఇప్పటికే దేశ వ్యాప్తంగా అమృత్ భారత్ కు మంచి ఆదరణ కనిపిస్తోంది. కాగా, ఇప్పుడు అమృత్ భారత్ 3.0 వర్షన్ ను రైల్వే మంత్రి ఆవిష్కరించారు. వందేభారత్ ను మించిన సదుపాయాలతో తీర్చి దిద్దిన ఈ రైళ్లు పట్టాలెక్కేందు కు సిద్ధమయ్యాయి. తొలి రైలు రూటు ఖరారు చేసారు.
రైల్వే శాఖ కొత్త సాంకేతికతను వినియోగిస్తూ.. ప్రయాణీకులకు సౌకర్యాల పెంపు పైన ప్రధానంగా ఫోకస్ చేస్తోంది. వందేభారత్.. వందేభారత్ స్లీపర్.. అమృత్ భారత్ తీసుకొచ్చిన రైల్వే శాఖ ఇప్పుడు మరో కొత్త వెర్షన్ ను ఆవిష్కరించింది. ప్రస్తుతం ఉన్న అమృత్ భారత్ రైళ్లు కేవలం నాన్ ఏసీ బోగీలతో నడుస్తున్నాయి. ఈ నేపథ్యంలో అమృత్ భారత్ 3.0 రైళ్లలో ఏసీ బోగీలను ఏర్పాటు చేస్తున్నారు. ఈ కొత్త రైలు నమూనాలను రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ పరిశీలించారు. ప్రయాణీకు లకు త్వరలోనే అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ 3 .0 ప్రజలకు అందుబాటులోకి తెచ్చేందుకు రైల్వే శాఖ చర్యలు చేపడుతోంది. ఇందులో ఏసీ కోచ్‌లు, కొత్త ఇంటీరియర్ డిజైన్ తో తీర్చి దిద్దారు.

వందే భారత్ తరహా సదుపాయాలతో అందుబాటులోకి
ప్రయాణీకులకు మెరుగైన సదుపాయాలు.. అప్‌గ్రేడ్ చేసిన ఫీచర్లతో రూపకల్పన చేసారు. ఇందు లో నాన్-ఏసీ కోచ్‌లతో పాటు ఏసీ కోచ్‌లను కూడా ప్రవేశపెట్టనున్నారు. ప్రస్తుతం ఉన్న అమృత్ భారత్ రైలు సర్వీసుల కంటే అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ 3.0 రూపకల్పనలో భిన్నంగా ఉంటుంది. ప్రస్తుతం అమృత్ భారత్ రైళ్లల్లో కేవలం జనరల్, స్లీపర్ క్లాస్ మాత్రమే ఉన్నాయి. అయితే అమృత్ భారత్ 3.0 వెర్షన్‌లో ఏసీ కోచ్‌లను సైతం ఏర్పాటు చేస్తున్నారు. అమృత్ భారత్ 1.0, 2.0 రైళ్ల నిర్వహణ అనుభవంతో వీటిని రూపొందిస్తున్నారు. వీటిల్లో దూరపు ప్రయాణాలు చేసే వారు.. ఏసీ ప్రయాణం కోరుకునే వారి కోసం వీటిని రూపొందించారు. తొలి అమృత్ భారత్ 3.0 ను అయోధ్య నుంచి పాట్నా వరకు నడిపే అవకాశం ఉంది. అదే విధంగా సికింద్రాబాద్ - తిరుపతి- విశాఖ అమృత్ భారత్ దాదాపు ఖరారైనట్లు తెలుస్తోంది. దీని పైన రైల్వే శాఖ అధికారికంగా నిర్ణయం వెల్లడించాల్సి ఉంది.












Click it and Unblock the Notifications