అయ్యా కొడుకులు కామ పిశాచాలు.. స్వామి ముసుగులో అరాచకాలు.. మహిళను అలా మభ్యపెట్టి..!
కర్ణాటక : అయ్యా కొడుకులు కామ పిశాచాలుగా మారారు. స్వామి ముసుగులో అరాచకాలకు పాల్పడుతున్నారు. ఆ క్రమంలో ఓ మహిళను మభ్య పెట్టిన తీరు వారిద్దరినీ కటకటాలు లెక్కించేలా చేసింది. సర్పదోషం పేరిట సదరు మహిళను బురిడీ కొట్టించి ఆమెపై లైంగిక దాడికి ప్రయత్నించారు. చివరకు ప్లాన్ బెడిసి కొట్టడంతో పోలీసులకు అడ్డంగా దొరికి పోయారు. కర్ణాటకలో జరిగిన ఈ ఘటన దేశ వ్యాప్తంగా చర్చానీయాంశమైంది. సోషల్ మీడియాలో వైరల్ కావడంతో సదరు కామ స్వామి గుట్టు రట్టైంది.

తండ్రీ కొడుకులు కామ పిశాచాలు.. మహిళను బురిడీ కొట్టించి..!
కర్ణాటక రాష్ట్రంలోని బాణస వాడి ప్రాంతంలో ఓ మహిళా ప్రైవేట్ ఉద్యోగినిని ఛీట్ చేశారు తండ్రీకొడుకులు. స్వామి ముసుగులో తండ్రి గణేశ్ అరాచకాలకు పాల్పడుతుంటే అతడి కొడుకు మణికంఠ చేదోడు వాదోడుగా ఉంటున్నాడు. ఆ క్రమంలో భర్తతో విడిపోయి ఒంటరిగా ఉంటున్న ఓ మహిళ తనకు అశాంతిగా ఉంటోందని స్వామిని ఆశ్రయించారు. దాంతో పూజలు గట్రా చేస్తామని సదరు మహిళను బురిడీ కొట్టించారు.
ఆమెకు తెలిసిన పరిచయస్థుల ద్వారా స్వామి దగ్గరకు వచ్చారు సదరు మహిళ. ఆ సమయంలో తండ్రీకొడుకులు ఇద్దరు ఉండటంతో ఆమె తన సమస్య చెప్పుకున్నారు. అయితే తనకు సర్పదోషం ఉందని.. దాని నివారణకు చెప్పినట్లు చేయాలని ఆమెను నమ్మించారు.

ఐదు సార్లు తాళి కట్టించుకోవాలి.. ఐదు మార్లు అలా చేయాలి
సర్ప దోష నివారణ పేరిట ఈ నెల 7వ తేదీన రాత్రి 10 నుంచి 11 గంటల వరకు ఆమె ఇంటిలో పూజలు నిర్వహించారు తండ్రీ కొడుకులు. అంతే కాదు ఆమె బాధలు శాశ్వాతంగా తొలగిపోవాలంటే ఐదు సార్లు తాళి కట్టించుకుని ఆ మేరకు ఐదు మార్లు సెక్స్‌లో పాల్గొనాలని బాధితురాలికి చెప్పే విధంగా తండ్రీ కొడుకులు ప్లాన్ వేశారు. ఆ క్రమంలో ఆమె ఇంట్లో పూజ చేసిన అనంతరం ఆ వస్తు సామాగ్రినంతా కూడా కుక్కేసుబ్రమణ్య ప్రాంతంలో వదిలేయాలని సూచించారు.
అలా ఆమె అక్కడకు వస్తుందని భావించి ముందుగానే కుక్కేసుబ్రమణ్య ప్రాంతంలో రెండు గదులు అద్దెకు తీసుకున్నారు. ఆ విధంగా ఆమెతో లైంగిక వాంఛలు తీర్చుకోవడానికి ప్లాన్ వేశారు. సదరు మహిళ స్వామిని ఆశ్రయించిందని తెలియడంతో ఆమె కుటుంబ సభ్యులు అలర్టయ్యారు. ఆ మేరకు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. మహిళను మోసం చేయాలని చూసిన తండ్రీ కొడుకులను అరెస్ట్ చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.
Recommended Video

సర్ప దోషం పేరిట..!
సర్ప దోషం నెపంతో సదరు మహిళపై లైంగిక దాడి చేయాలని చూసిన అయ్యా కొడుకులు చివరకు కటకటాలు లెక్కిస్తున్నారు. అయితే ఈ స్వామి గురించి తనకు తెలియదని.. జగన్నాథ్ అనే వ్యక్తి పరిచయం చేశాడని చెబుతున్నారు బాధితురాలు. సర్ప దోష నివారణ పేరిట పూజ చేయాలంటూ 40 వేల రూపాయలు తీసుకున్నారని.. అదే క్రమంలో ఈ నెల 7వ తేదీన తమ ఇంట్లో పూజలు చేసి 8వ తేదీన కుక్కేసుబ్రమణ్యలో అత్యాచారం చేసేందుకు యత్నించారని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. మొత్తానికి కుటుంబ సభ్యులు అప్రమత్తంగా ఉండటంతో సదరు మహిళ క్షేమంగా బయటపడిందని.. లేదంటే ఎలాంటి పరిణామాలు చూడాల్సి వచ్చేదో అంటున్నారు పోలీసులు.
-
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!!












Click it and Unblock the Notifications