తండ్రే కదా అని తైతక్కలాడాడు, కాలేజ్ లో చదివే కొడుకును కాటికి పంపించిన తండ్రి

బెంగళూరు నగరంలో ఇటీవల ఓ విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్నాడని నమోదు అయిన కేసు కొత్త మలుపు తిరిగింది. తండ్రే అతని కొడుకును హత్య చేసి ఆత్మహత్య కథ అల్లినట్లు బెంగళూరు పోలీసు అధికారుల విచారణలో తేలింది. ఈ కేసుకు సంబంధించి బెంగళూరు నగరంలోని మంజునాథ్‌నగర్‌కు చెందిన ప్రకాష్‌(48) అనే వ్యక్తిని అరెస్టు చేశామని పోలీసు అధికారులు తెలిపారు.

నిందితుడు ప్రకాష్ అతని కుమారుడు యోగేష్ (21)ని మార్చి 6వ తేదీన మెడకు వేల్ బిగించి ఊపిరాడకుండా చేసి హత్య చేశాడని, తరువాత కేసు నుంచి తప్పించుకోవడానికి తన కొడుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడని అందరిని నమ్మించడానికి ప్రయత్నించాడని పోలీసులు తెలిపారు. తన కొడుకు యోగేష్ ఆత్మహత్య చేసుకున్నాడని అతని తండ్రి ప్రకాష్ కట్టుకథ చెప్పడంతో దానిని అందరూ నమ్మేశారు.

Father arrested in Bengaluru for murdering son studying BBA

అయితే పోస్టుమార్టం నివేదికలో యోగేష్ ను ఊపిరాడకుండా చేసి హత్య చేసి ఉండే అవకాశం ఉందని వచ్చింది. దీని ఆధారంగా బెంగళూరులోని బసవేశ్వర్ నగర్ పోలీసులు యోగేష్ తండ్రి ప్రకాష్‌ను అదుపులోకి తీసుకుని విచారించగా అతనే కొడుకును హత్య చేసినట్లు అంగీకరించాడని పోలీసు అధికారులు తెలిపారు. నిందితుడు ప్రకాష్ మంజునాథనగర్‌లో పానీపూరీ వ్యాపారం చేస్తున్నాడు. ప్రకాష్ కొడుకు యోగేష్ బెంగళూరులోని ఓ ప్రైవేట్ కాలేజీలో బీబీఏ చివరి సంవత్సరం చదువుతున్నాడు.

ఈ మధ్య కాలంలో విపరీతమైన మద్యానికి అలవాటు పడిన యోగేష్ రోజూ లిక్కర్ తాగి ఇంటికి వచ్చేవాడు. అనంతరం తల్లిదండ్రులతో గొడవ పడేవాడని పోలీసులు తెలిపారు. తాగుడు మానేయాలని తల్లిదండ్రులు ఎన్నిసార్లు సలహా ఇచ్చినా యోగేష్ మాత్రం మారలేదని తెలిసింది.

మార్చి 5వ తేదీన ఇంటి నుంచి వెళ్లిన యోగేష్ మరుసటి రోజు అంటే మార్చి 6వ తేదీ ఉదయం ఇంటికి వచ్చి పరీక్ష హాల్ టికెట్ కోసం వెతకడం ప్రారంభించాడు.

అయితే అతనికి హాల్ టికెట్ మాత్రమే చిక్కలేదు. ఆ సమయంలో ఇంట్లో ఉన్న తండ్రి ప్రకాష్‌కి హాల్‌టికెట్‌ వెతికి ఇవ్వాలని కోరాడు. అప్పుడు ప్రకాష్ ఎగ్జామ్ ఉన్నా రాత్రి ఇంటికి రాలేదంటూ అతని కొడుకు మీద కేకలు వేశాడు. రాత్రి నువ్వు ఎక్కడికి వెళ్లావు, మేము కష్టపడి చదివిస్తుంటే నువ్వు మద్యం సేవించి తాగి తందనాలు ఆడుతున్నావా అంటూ ప్రకాష్ అతని కొడుకు మీద చెయ్యి చేసుకోవడానికి ప్రయత్నించాడని తెలిసింది.

దీంతో ఆగ్రహించిన యోగేష్ ఒక్కసారిగా అతని తండ్రి ప్రకాష్ పై దాడి చేశాడు. గొడవ పెద్దది కావడంతో సహనం కోల్పోయిన ప్రకాష్ ఇంట్లో ఉన్న వేల్ తీసుకుని అతని కొడుకు యోగేష్ మెడకు బిగించి ఊపిరాడకుండా చేసి హత్య చేశాడని పోలీసులు తెలిపారు. కొడుకును హత్య చేసిన తరువాత ప్రకాష్ చుట్టుపక్కల వారి సహాయంతో అతన్ని బసవేశ్వరనగరలోని ఓ ఆసుపత్రికి తరలించాడని పోలీసులు తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+