Daughter: కూతుర్ని చంపేసి హైవేలో శవాన్ని విసిరేసిన తండ్రి, లవ్ ఎఫెక్ట్ ?, 20 వేల ఫోన్ కాల్స్ ట్రాక్ !
లక్నో/న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్ లోని యమునా ఎక్స్ ప్రెస్ హైవేలో నిత్యం వేల సంఖ్యలో వాహనాలు సంచరిస్తుంటాయి. యమునా ఎక్స్ ప్రెస్ హైవేలోని మధురా సమీపంలో ఎర్రటి పెద్ద ట్రాలీ బ్యాగ్ వదిలేసి వెళ్లిపోయారు. ఉదయం నుంచి ఆ బ్యాగ్ రోడ్డు పక్కనే ఉంది. ఎంతసేపు అయినా ట్రాలీ బ్యాగ్ ఎవ్వరూ తీసుకోకపోవడంతో స్థానికులకు అనుమానం వచ్చింది. పోలీస్ కంట్రోల్ రూమ్ కు ఫోన్ చేశారు. పోలీసులు ట్రాలీ బ్యాగ్ ఓపెన్ చేసి చూడగా అందులో యువతి శవం ఉంది. 20 వేల ఫోన్ కాల్స్ ట్రాక్ చేసిన పోలీసులు హత్యకు గురైన యువతి ఆచూకి తెలుసుకున్నారు. యువతి హత్య కేసులో ఆమె తండ్రినే పోలీసులు అరెస్టు చెయ్యడం హాట్ టాపిక్ అయ్యింది.

హైవేలో నిత్యం రద్దీ
ఉత్తరప్రదేశ్ లోని యమునా ఎక్స్ ప్రెస్ హైవేలో నిత్యం వాహనాలు సంచారంతో ఆ రోడ్డు రద్దీగా ఉంటుంది. యమునా ఎక్స్ ప్రెస్ హైవేలోని మధురా సమీపంలో ఈనెల 18వ తేదీన గుర్తు తెలియనివాళ్లు ట్రాలీ బ్యాగ్ వదిలేసి వెళ్లిపోయారు. స్థానికులు ఫిర్యాదు చెయ్యడంతో ఉత్తరప్రదేశ్ పోలీసులు రంగంలోకి దిగారు.

20 వేల ఫోన్ కాల్స్ తో యువతి అడ్రస్ చిక్కింది
యువతిని హత్య చేసి తరువాత ఆమె శవాన్ని ట్రాలీ బ్యాగ్ లో తీసుకు వచ్చి వదిలేశారని పోలీసులు గుర్తించారు. ఈనెల 17వ తేదీ నుంచి 18వ తేదీ వరకు ఆ ప్రాంతంలో సంచరించిన వారికి చెందిన 20 వేల ఫోన్ కాల్స్ ను పోలీసు అధికారులు ట్రాక్ చేశారు. దర్యాప్తు వేగవంతం చేసిన పోలీసులు హత్యకు గురైన యువతి ఢిల్లీకి చెందిన ఆయుషి యాదవ్ అలియాస్ ఆయుషి (21) అని గుర్తించారు.

మిస్సింగ్ కేసు పెట్టకుండా సైలెంట్
ఉత్తరప్రదేశ్ పోలీసులు ఢిల్లీలోని బదర్ పూర్ లో నివాసం ఉంటున్న నితీష్ యాదవ్ కుమార్తె అని తెలుసుకోవడానికి పోలీసులు నానా తంటాలుపడ్డారు. చివరికి అడ్రస్ తెలుసుకున్న పోలీసులు ఢిల్లీ వెళ్లి మీ అమ్మాయి ఆయుషి యాదవ్ హత్యకు గురైయ్యిందని అని చెబితే ఆమె కుటుంబ సభ్యులు ఎలాంటి ఫీలింగ్ లేకుండా సైలెంట్ గా ఉండటంతో పోలీసులకు అనుమానం పెరిగిపోయింది.

యువతిని చంపిన తండ్రి...... రోడ్డు పక్కన శవం విసిరేశాడు
పోలీసులకు అనుమానం వచ్చి నితీష్ యాదవ్ ను అదుపులోకి తీసుకున్నారు. తన కూతురు ఆయుషి యాదవ్ ఈనెల 17వ తేదీన ఇంటి నుంచి బయటకు వెళ్లిందని, అదే రోజు రాత్రి తాను ఆమెను చంపేశానని నితీష్ యాదవ్ పోలీసులకు చెప్పాడు. తరువాత తన కారులోనే ఆయుషీ యాదవ్ శవాన్ని ట్రాలీ బ్యాగ్ లో తీసుకు వచ్చి యమునా ఎక్సెప్రెస్ హైవే మీద విసిరేశానని నితీష్ యాదవ్ అంగీకరించాడు.

పరువు హత్యా ?, లేక ఏం జరిగింది
ఆయుషీ యాదవ్ తక్కువ కులం వాడి ప్రేమలో పడిందని, కూతురు అతన్ని పెళ్లి చేసుకుంటే పరువు పోతుందని నితీష్ యాదవ్ ఆమెను హత్య చేసి ఉంటాడని ఉత్తరప్రదేశ్ పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఆయుషీ యాదవ్ హత్యకు కచ్చితమైన కారణాలు తెలియడం లేదని, ఆమె తండ్రి నితీష్ యాదవ్ ను విచారణ చేస్తున్నామని పోలీసులు తెలిపారు.
-
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
భారీగా బీర్ల ధరలు పెంపు, ఏ బ్రాండ్ ఎంత.!! -
పద్మవ్యూహంలోకి ట్రంప్ ? ఇరాన్ లో భూతల దాడి నరకమేనా ? -
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపు - కేంద్రం అనూహ్య నిర్ణయం, వంట గ్యాస్ రేట్లూ ఇక..!! -
బంగారం ధరల్లో అనూహ్యం- భారీగా రీబౌండ్ -
రామ్‌చరణ్ ‘పెద్ది’ గ్లింప్స్ పై రివ్యూ -
రామ్ చరణ్ బర్త్‌డే గిఫ్ట్ మామూలుగా లేదుగా! -
సమ్మర్ స్పెషల్ 'పెసరపప్పు చారు'.. ఇదొక్కటి యాడ్ చేస్తే టేస్ట్ అద్దిరిపోద్ది..! -
అమెరికన్ కరెన్సీ ఇకపై.. !! -
100 ఏళ్ల రికార్డును తుడిచేస్తున్న గోల్డ్ క్రాష్.. బిట్‌కాయిన్ జేత్రయాత్ర!












Click it and Unblock the Notifications