ప్రియుడితో లేచిపోయిన తల్లి.. పసిబిడ్డలతో నదిలో దూకిన తండ్రి! (వీడియో)

Viral Video: భార్య తనను, తన ఇంటిని వదిలిపెట్టి వెళ్లడంతో తీవ్ర మనస్తాపానికి గురైన భర్త.. తాను, తన నలుగురు పిల్లలతో కలిసి యమునా నదిలో దూకేశాడు. ఈ విషాద ఘటన ఉత్తరప్రదేశ్‌లోని షామ్లీ జిల్లాలో చోటుచేసుకుంది. ఆత్మహత్యకు ముందు తన ఆవేదనను ఓ వీడియోలో రికార్డు చేశాడు. ఆ వీడియోలో ఆ వ్యక్తి మాట్లాడుతూ.. "బేటీ (కూతురు), మన చావుకు కారణం ఎవరు? నీ అమ్మే. ఆమెతో పాటు సాబిర్, అరుణ్, ఇంతేజార్, ఇఫ్తేకార్, అంజూమ్... వీరంతా కలిసి గత 7 నెలలుగా మా జీవితాన్ని నరకం చేశారు." అంటూ ఆవేదన వ్యక్తం చేశాడు.

ఇవి ఉత్తర్‌ప్రదేశ్‌లోని షామ్లీ జిల్లాకు చెందిన 35 ఏళ్ల సల్మాన్ పలికిన చివరి మాటలు. తీవ్ర వేదన, నిరాశతో రోదిస్తూ తన నలుగురు పసిబిడ్డలతో కలిసి సల్మాన్ రికార్డ్ చేసిన వీడియో ఇది. ఈ వీడియోను రికార్డ్ చేసిన తర్వాత, సల్మాన్ తన నలుగురు పసిపిల్లలతో కలిసి యమునా నదిలో దూకేశాడు.

Father Jumps into Yamuna with 4 Kids After Wife Elopes Tragic Viral Video from UP

భార్య వదిలి వెళ్లడమే కారణం
సల్మాన్ కుటుంబంలో 12 ఏళ్ల మెహక్, 3 ఏళ్ల అమన్, 2 ఏళ్ల షిఫా, 8 నెలల ఇనాయాషా అనే నలుగురు పిల్లలు ఉన్నారు. సల్మాన్ భార్య ఖుష్‌నుమా కారణంగా కుటుంబంలో నిరంతరం గొడవలు, మానసిక ఒత్తిడి ఉండేదని తెలుస్తోంది. ఆమె గతంలో ఐదుసార్లు ఇంటి నుంచి వెళ్లిపోయిందని.. రెండ్రోజుల క్రితం తన ప్రియుడితో కలిసి ఇంటిని వదిలి వెళ్లిపోయిందని పోలీసులు వెల్లడించారు. భార్య చర్యల వల్లే తీవ్ర మనస్తాపానికి గురై, సల్మాన్ ఈ దారుణ నిర్ణయం తీసుకున్నాడు.

చివరి వీడియోలో తండ్రి ఆవేదన
యమునా నదిలో దూకే ముందు సల్మాన్ తన చివరి సందేశాన్ని వీడియోలో రికార్డ్ చేశాడు. "ఇది నా చివరి వీడియో. నాన్నా, నన్ను క్షమించండి. నేను అందరినీ క్షమాపణ కోరుతున్నాను. నా మనసులో చాలా ప్రేమ ఉంది, కానీ... నేను పిల్లల కోసం ఇక బతకలేకపోయాను" అని ఆవేదన వ్యక్తం చేశాడు. మరో వీడియోలో పిల్లలను గట్టిగా కౌగిలించుకుని, వారి బాధను పంచుకుంటూ మాట్లాడాడు. ఈ వీడియోను తన సోదరికి కూడా పంపాడు.సల్మాన్ సోదరి పోలీసులకు వెల్లడించిన వివరాల ప్రకారం.. సల్మాన్ భార్య అతడితో ఉండటానికి ఇష్టపడలేదని, "నువ్వు చేయగలిగింది చేసుకో" అని చెప్పి వెళ్లిపోయిందని వెల్లడించారు.

గాలింపు చర్యలు... రెండు మృతదేహాలు లభ్యం
సల్మాన్ నలుగురు పిల్లలతో సహా యమునా నదిలో దూకేశాడని పోలీసులు నిర్ధారించారు. అక్టోబర్ 4న ప్రారంభించిన గాలింపు చర్యల్లో, రెండు రోజుల తర్వాత కైరానా పట్టణం నుంచి సుమారు 12 కిలోమీటర్ల దూరంలో సల్మాన్, అతని 12 ఏళ్ల కుమార్తె మెహక్ మృతదేహాలను పోలీసులు, డ్రైవర్ల బృందం కనుగొంది. పోస్ట్‌మార్టం కోసం ఆ మృతదేహాలను పంపారు. మిగిలిన ముగ్గురు పసిబిడ్డలు - అమన్, షిఫా, ఇనాయాషా కోసం గాలింపు చర్యలు ఇంకా కొనసాగుతున్నాయని సర్కిల్ ఆఫీసర్ (CO) శ్యామ్ సింగ్ తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+