గొంతు పట్టి..: ఏడుస్తోందని ఆర్నెళ్ల బిడ్డను చంపేశాడు

బెంగళూరు: ఆపకుండా ఏడుస్తోందని తీవ్ర అసహనానికి లోనైన ఓ తండ్రి తన ఆరు నెలల కూతురు గొంతు పిసికి చంపేసిన దారుణ సంఘటన కర్నాటకలో చోటు చేసుకుంది. అతను తాగిన మత్తులో ఈ దారుణానికి ఒడిగట్టాడు. దేవరజీవనగర్‌కు చెందిన ఇరవై అయిదేళ్ల ఖలీల్ మద్యానికి బానిసయ్యాడు.

బుధవారం రాత్రి తొమ్మిదిన్నర గంటలకు ఇంట్లోకి ప్రవేశించాడు. భార్య బేగం ఆరు నెలల పాపను పక్కన పడుకోబెట్టుకొని నిద్రకు ఉపక్రమించింది. తాగిన మైకంలో ఖలీల్ కేకలు వేస్తూ ఇంట్లోకి ప్రవేశించాడు. ఆ సమయంలో పాప ఉలిక్కిపడి నిద్ర నుండి లేచి, ఏడుపు ప్రారంభించింది.

ఏడుపు ఆపాలంటూ బలంగా పాప గొంతు పట్టుకున్నాడు. ఆ అరుపులకు చుట్టుపక్కల వారు వచ్చి చూసేసరికి ఖీల్ చేతుల్లో పాప అప్పటికే నలికిపోతూ ఉంది. అతనిని అడ్డుకున్న స్థానికులు చిన్నారిని ఆసుపత్రికి తరలించారు. అయితే, అప్పటికే ఆమె మృతి చెందింది.

 Father kills 6 months old daughter in Bangalore

ఆడపిల్ల పుట్టిందని భర్త ఆదరించని భర్త

చిత్తూరు జిల్లా తిరుమలలో ఆడపిల్ల పుట్టిందనే కారణంతో వివాహిత నిరాదరణకు గురైంది. పాప పుట్టి 11 నెలలు అవుతున్నా భర్త పట్టించుకోకపోవడంతో ఆమె తిరుపతి పోలీసులను ఆశ్రయించింది.

దీంతో ఏసీపీ వారికి కౌన్సిలింగ్ కూడా ఇచ్చారు. కౌన్సిలింగ్ ఇచ్చి పోలీసులు దంపతులిద్దర్నీ ఇంటికి పంపడంతో, తాను భార్యను, కుమార్తెను సక్రమంగా చూసుకుంటానని చెప్పిన భర్త ఆమెను ఇంటి బయట వదిలేసి వెళ్లిపోయాడు. అతని వెంటపడలేని ఆమె తాళం వేసిన అత్తింటి ముందు ఆందోళన చేపట్టింది. అత్తింటికి తాళం వేసి ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+