Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Sadist: పేకాటపాపారావు కంటే గొప్పోడు. జూదానికి బానిస, అప్పులు, బిడ్డను అమ్మేశాడు, భార్యతో తేడా !

చెన్నై/ తిరుచ్చి: వివాహం చేసుకున్న యువకుడు పనిపాట లేకుండా జులాయిగా తిరుగుతున్నాడు. బయట జులాయిగా తిరుగుతున్నా అతను భార్యతో కాపురం చేసి నలుగురు బిడ్డలకు తండ్రి అయ్యాడు. రెండు నెలల క్రితం మరో బిడ్డకు తండ్రి అయ్యాడు. బంధువులు, స్నేహితులు, పరిచయం ఉన్న వారి దగ్గర అప్పులు చేస్తున్న భర్త జూదం ఆడుతున్నాడు. జూదం ఆడటానికి, మద్యంకు బానిస అయిన భర్త విపరీతంగా అప్పులు చేశాడు. అప్పులు ఇచ్చిన ఓ వ్యక్తి తన దగ్గర తీసుకున్న డబ్బులు వెంటనే చెల్లించాలని, లేదంటే రెండు నెలల ముందు పుట్టిన బిడ్డను మాకు అమ్మేయాలని చెప్పాడు. రెండు నెలల క్రితం పుట్టిన బిడ్డను విక్రయించడానికి అతని భార్యతో మాట్లాడిన భర్త ఆమెను ఒప్పించాడు. బిడ్డను అమ్మేయడంతో అప్పు తీరిపోవడమే కాకుండా ఇంకా డబ్బులు వచ్చాయి. డబ్బులు పంచుకునే విషయంలో దంపతుల మద్య గొడవలు జరిగాయి. ఆ సమయంలో రివర్స్ అయిన భార్య నా బిడ్డను నాకు తెచ్చివ్వాలని ఎదురుతిరిగింది. దంపతుల మద్య గొడవలు జరగడంతో పోలీసులు ఎంట్రీ ఇచ్చారు. బిడ్డను అమ్మిన తండ్రిని, బిడ్డను కొనుగోలు చేసిన వ్యక్తులను, మధ్యవర్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జూదం ఆడటానికి బానిస అయిన కసాయి తండ్రి అతని కన్నబిడ్డను విక్రయించడం కలకలం రేపింది. డబ్బులు పంచుకునే విషయంలో దంపతుల మధ్య తేడా రావడంతో ఇలాంటి అరాచకం బయటకు రావడంతో స్థానికులు హడలిపోయారు.

 నలుగురు బిడ్డలకు తండ్రి

నలుగురు బిడ్డలకు తండ్రి

తమిళనాడులోని తిరుచ్చి జిల్లాలోని ఉరైయూర్ సమీపంలోని పండమంగళంలో అబ్దుల్ సలామ్, కరుమున్నీసా దంపతులు నివాసం ఉంటున్నారు. కరుమున్సీసాను వివాహం చేసుకున్న తరువాత కూడా అబ్దుల్ సలామ్ పనిపాట లేకుండా జులాయిగా తిరుగుతున్నాడు. బయట జులాయిగా తిరుగుతున్నా అబ్దుల్ సలామ్ అతని భార్య కరుమున్నీసాతో కాపురం చేసి నలుగురు బిడ్డలకు తండ్రి అయ్యాడు.

అప్పులు చేసి జూదం అడుతున్న కేటుగాడు

అప్పులు చేసి జూదం అడుతున్న కేటుగాడు

రెండు నెలల క్రితం అబ్దుల్ సలామ్, కరుమున్నీసా దంపతులు మరో బిడ్డకు జన్మనిచ్చారు. బంధువులు, స్నేహితులు, పరిచయం ఉన్న వారి దగ్గర అప్పులు చేస్తున్న అబ్దుల్ సలామ్ పగలు, రాత్రి తేడాలేకుండా తెలిసివాళ్లతో కలిసి జూదం ఆడుతున్నాడు. జూదం ఆడటానికి, మద్యంకు బానిస అయిన అబ్దుల్ సలామ్ ఇప్పటికే విపరీతంగా అప్పులు చేశాడు.

 రూ. 80 వేల కోసం బిడ్డను అమ్మేశాడు

రూ. 80 వేల కోసం బిడ్డను అమ్మేశాడు

సేలం జిల్లాలోని తెన్నూర్ లో ఆరోగ్యరాజ్ అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. జూడం ఆడటానికి బానిస అయిన అబ్దుల్ సలామ్ అతని స్నేహితుడు ఆరోగ్యరాజ్ దగ్గర ఇప్పటికే రూ. 80 వేలు అప్పు చేశాడు. అప్పు ఇచ్చిన ఆరోగ్యరాజ్ తన దగ్గర తీసుకున్న రూ. 80 వేలు డబ్బులు వెంటనే వడ్డీతో సహ చెల్లించాలని, లేదంటే రెండు నెలల ముందు పుట్టిన బిడ్డను మాకు అమ్మేయాలని చెప్పాడు.

భార్యను ఒప్పించిన కిలాడీ మొగుడు

భార్యను ఒప్పించిన కిలాడీ మొగుడు


రెండు నెలల క్రితం పుట్టిన బిడ్డను విక్రయించడానికి అబ్దుల్ సలామ్ అతని భార్య కరీమున్నీసాతో మాట్లాడి బిడ్డను అమ్మేయడానికి ఆమెను ఒప్పించాడు. బిడ్డను ఆరోగ్యరాజ్ బంధువు చందన్ కుమార్ కు అమ్మేయడంతో రూ. 80 వేలు అప్పు తీరిపోవడమే కాకుండా ఆ దంపతులకు ఇంకా భారీ మొత్తంలో డబ్బులు వచ్చాయి.

 భార్య ఎదురు తిరగడంతో మొత్తం రివర్స్

భార్య ఎదురు తిరగడంతో మొత్తం రివర్స్

డబ్బులు పంచుకునే విషయంలో అబ్దుల్ సలామ్, కరీమున్నిసా దంపతుల మద్య గొడవలు జరిగాయి. ఆ సమయంలో రివర్స్ అయిన కరుమున్నీసా నా బిడ్డను నాకు తెచ్చివ్వాలని ఎదురుతిరిగింది. అంతే కాకుండా నా భర్త అబ్దుల్ సలామ్ నా బిడ్డను అమ్మేశాడని కరీమున్నీసా పోలీసు కేసు పెట్టింది.

దెబ్బకు మొత్తం రివర్స్

దెబ్బకు మొత్తం రివర్స్

అబ్దుల్ సలామ్, కరీమున్నిసా దంపతుల మద్య గొడవలు జరగడంతో పోలీసులు ఎంట్రీ ఇచ్చారు. బిడ్డను అమ్మిన తండ్రి అబ్బుదల్ సలామ్ , బిడ్డను కొనుగోలు చేసిన చందన్ కుమార్, మధ్యవర్తి ఆరోగ్యరాజ్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జూదం ఆడటానికి బానిస అయిన కసాయి తండ్రి అబ్దుల్ సలామ్ అతని కన్నబిడ్డను విక్రయించడం తమిళనాడులో కలకలం రేపింది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+