PM Kisan: రైతులకు శుభవార్త.. ఆ రోజే పీఎం కిసాన్ నిధుల విడుదల..

అన్నదాతలకు కేంద్రం శుభవార్త చెప్పింది. పీఎం కిసాన్ నిధులను విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. ఫిబ్రవరి 28న పీఎం కిసాన్ సమ్మాన్ నిధి 16వ విడత డబ్బులను రైతుల బ్యాంక్ ఖాతాల్లో జమ చేయనున్నారు. మహారాష్ట్రలోని యావత్మాల్ జిల్లా నుంచి ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ నిధులు విడుదల చేయనున్నారు. ఇందుకు సంబంధించి పీఎం కిసాన్ అధికారికంగా ట్వీట్ చేసింది.

2023 నవంబర్ లో పీఎం కిసాన్ 15 విడత నిధులు విడుదల చేసిన సంగతి తెలిసిందే. అప్పుడు 8 కోట్ల మంది రైతుల ఖాతాల్లో రూ. 18 వేల కోట్లు జమ చేశారు. కేంద్ర ప్రభుత్వం రైతులకు సాయం అందించడానికి 2019లో పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకాన్ని ప్రవేశ పెట్టింది. ఈ పథకం కింద రైతులకు నాలుగు నెలలకు రూ.2 వేలు చొప్పున సంవత్సరానికి రూ.6 వేలు అందిస్తోంది. ఇప్పటికే 15 విడతలుగా అన్నదాతలో ఖాతాల్లో రూ.30 వేలు జమ చేసింది.

February 28 PM Kisan 16th installment money will be released

పీఎం కిసాన్ సమ్మాన్ కింద్ డబ్బులు రావాలంటే రైతులు తప్పని సరిగా ఈ కేవైసీ చేసుకోవాలి. ఈ కేవైసీ చేసుకుంటేనే డబ్బులు ఖాతాలా జమ అవుతాయి. ఇప్పటికీ ఈ కేవైసీ చేసుకోనివారు వెంటనే చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. ఈ కేవైసీ కోసం https://pmkisan.gov.in/ వెబ్ సైట్ కు వెళ్లాలి. వెబ్ సైట్ లో ఈ కేవైసీ అనే ఆప్షన్ ఉంటుంది. దానిపై క్లిక్ చేయాలి.

అప్పుడు మీ ఆధార్ నంబర్ అడుగుతుంది. ఆధార్ నంబర్ ఎంటర్ చేయాలి. తర్వాత ఫోన్ నంబర్ అడుగుతుంది. ఫోన్ నంబర్ ఎంటర్ చేయాలి. మీ ఫోన్ కు ఓటీపీ వస్తుంది. ఓటీపీని ఎంటర్ చేయాలి. ఆ తర్వాత ఆధార్ అథంటికేషన్ ఓటీపీ వస్తుంది. దాన్ని కూడా ఎంటర్ చేస్తే మీ ఈ కేవైసీ పూర్తి అయినట్లు . అయితే మీ ఆధార్ నంబర్ తో ఫోన్ లింక్ అయి ఉండాలి. కాగా ఈ బడ్జెట్ పీఎం కిసాన్ యోజన కింద ఇచ్చే రూ. 6 వేలను రూ.8 వేలకు పెంచుతారని భావించారు. కానీ కేంద్రం ఎలాంటి ప్రకటన చేయలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+