Family: ఇంట్లో రోజూ గొడవలు, కూతుర్లతో కలిసి బావిలో దూకిన భార్య, ఆమె బంధువులు వస్తున్నారని !
చెన్నై/ సేలం: వివాహం చేసుకున్న దంపతులు సంతోషంగా కాపురం చేస్తున్నారు. దంపతులకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. గ్యాస్ సిలిండర్లు డెలవరీ చేస్తున్న భర్త బాగానే డబ్బులు సంపాధిస్తున్నాడు. భార్య ఆమె ఇద్దరు కుమార్తెలను చూసుకుంటూ ఇంట్లోనే ఉంటున్నది. దంపతుల ఇంటికి ఈ మధ్య కాలంలో భార్య బంధువులు ఎక్కువగా వచ్చి వెలుతున్నారని తెలిసింది. రానురాను దంపతుల మధ్య గొడవలు ఎక్కువ అయ్యాయి. పెద్లలు పంచాయితీలు చేసినా దంపతుల మద్య గొడవలు మాత్రం సర్దుమనగలేదు. రానురాను భర్త ఇంటికి వెళ్లి అతని భార్యను చితకబాదడం మొదలుపెట్టాడు. ఉదయం నిద్రలేచిన భర్త ఇంట్లో టిఫిన్ కూడా చెయ్యకుండా బయటకు వెళ్లిపోయాడు, మద్యాహ్నం ఇద్దరు పిల్లలను పిలుచుకుని భార్య ఇంటి నుంచి బయటకు వెళ్లిపోయింది. తరువాత ఊరి సమీపంలోని పొలం దగ్గరకు వెళ్లిన భార్య ఆమె ఇద్దరు కుమార్తెలను పొలంలోని బావిలోకి తోసేసింది, కూతుర్లు ఇద్దరు బావిలో పడిపోయిన తరువాత ఆమె కూడా అదే బావిలో దూకేసింది.

ఇద్దరు కుమార్తెలు
తమిళనాడులోని సేలం జిల్లాలోని ఇలంపిళ్లై సమీపంలోని పెరుమగౌండపట్టిలో ఆనందన్ (34) అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. 7 సంవత్సరాల క్రితం ఆనందన్ ధనలక్ష్మి (270 అనే యువతిని వివాహం చేసుకున్నాడు. వివాహం చేసుకున్న ఆనందన్, ధనలక్ష్మి దంపతులు సంతోషంగా కాపురం చేస్తున్నారు. ఆనందన్, ధనలక్ష్మి దంపతులకు మోనీషా (5), మోనిక (3) అనే ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.

భార్య బంధువులు వచ్చి వెలుతున్నారని ?
గ్యాస్ సిలిండర్లు డెలవరీ చేస్తున్న ఆనందన్ ప్రతిరోజూ రెండు వేల రూపాయల దాకా డబ్బులు సంపాధిస్తున్నాడు. ఆనందన్ భార్య ధనలక్ష్మి ఆమె ఇద్దరు కుమార్తెలను చూసుకుంటూ ఇంట్లోనే ఉంటున్నది. ఆనందన్, ధనక్ష్మి దంపతుల ఇంటికి ఈ మధ్య కాలంలో భార్య ధనలక్ష్మి బంధువులు ఎక్కువగా వచ్చి వెలుతున్నారని తెలిసింది.

ఇంట్లో పంచాయితీలు
రానురాను ఆనందన్, ధనలక్ష్మి దంపతుల మధ్య గొడవలు ఎక్కువ అయ్యాయి. పెద్లలు పంచాయితీలు చేసినా ఆనందన్, ధనలక్ష్మి దంపతుల మద్య గొడవలు మాత్రం సర్దుమనగలేదు. రానురాను ఆనందన్ ఇంటికి వెళ్లి అతని భార్య ధనలక్ష్మిని చితకబాదడం మొదలుపెట్టాడు. ఉదయం నిద్రలేచిన ఆనందన్ ఇంట్లో టిఫిన్ కూడా చెయ్యకుండా, అతని భార్యతో మాట్లాడకుండా బయటకు వెళ్లిపోయాడు,
Recommended Video

కూతుర్లతో కలిసి బావిలో దూకేసిన భార్య
అదే రోజు మద్యాహ్నం ఇద్దరు పిల్లలను పిలుచుకుని ధనలక్ష్మి ఇంటి నుంచి బయటకు వెళ్లిపోయింది. తరువాత ఊరి సమీపంలోని పొలం దగ్గరకు వెళ్లిన ధనలక్ష్మి ఆమె ఇద్దరు కుమార్తెలను పొలంలోని బావిలోకి తోసేసింది, కూతుర్లు ఇద్దరు బావిలో పడిపోయిన తరువాత ధనలక్ష్మి కూడా అదే బావిలో దూకేసింది. పిల్లలు కేకలు వేసిన విషయం గుర్తించిన పక్క పొలంలో పని చేస్తున్న వారు బావిలో దూకి ధనలక్ష్మి, మోనీషాను ప్రాణాలతో కాపాడారు. అయితే అప్పటికే మోనికా ప్రాణాలు గాలిలో కలిసిపోయాకని పోలీసులు అన్నారు. ధనలక్ష్మి, ఆమె పెద్ద కుమార్తె మోనీషా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని, కేసు విచారణలో ఉందని పోలీసు అధికారులు తెలిపారు.












Click it and Unblock the Notifications