మరి కొన్నాళ్లపాటు ఇబ్బందులు తప్పవు: ప్రధాని మోదీ సంచలన ప్రకటన

ఫ్రాన్స్ లోని ఎవియాన్ వేదికగా జరిగిన అంతర్జాతీయ 52వ జీ7 శిఖరాగ్ర సదస్సులో ప్రధాని మోదీ.. అందరికీ సమానమైన, సుస్థిరమైన ఆర్థిక అభివృద్ధి అనే అంశంపై ప్రసంగించారు. ఈ విషయాల్ని తన అధికారిక ఎక్స్ ఖాతా వేదికగా పోస్టు చేశారు. ఈ రోజు ఉన్న వాస్తవం ఏంటంటే..? వృద్ధి అంటే జీడీపీ లేదా వాణిజ్య అంకెలు కాదు.. నిజమైన ప్రశ్న ఏంటంటే..? వృద్ధి ఎవరి కోసం.. ఎవరికి.. ఏ దశలో అనేది ప్రధానం.. అని ప్రధాని మోదీ ప్రస్తావించారు.

భారత వృద్ధి.. సబ్ కా సాత్, సబ్ కా వికాస్, సబ్ కా విశ్వాస్, సబ్ కా ప్రయాస్ అనే సూత్రంపై ఆధారపడి ఉంటుంది. అందువల్లనే భారత్ జీ 20 దేశాల సమావేశానికి అధ్యక్షత వహించింది.. ఇండియా- మిడిల్ ఈస్ట్- యూరోప్ ఎకనామిక్ కారిడార్ లో కీలక పాత్ర పోషించింది.. అని తెలిపారు.

అలాగే పశ్చిమాసియాలో సంక్షోభం కారణంగా ప్రస్తుతం అంతర్జాతీయంగా ఇంధనం, ఎరువులు, ఫుడ్ సరఫరా చెయిన్ లో అంతరాయాలు మరికొంత కాలంపాటు ఉంటాయి. మరికొంత కాలం ఇబ్బందులు తప్పవు.. ఈ క్లిష్ట సమయంలో మనం ప్రపంచానికి సానుభూతి ప్రకటించాలంటే.. ఈ సంక్షోభంలో అధికంగా ఇబ్బంది పడుతున్న పేద దేశాలకు చేయూతనివ్వాలి.. వారిని ఒంటరిగా వదిలేయొద్దు అని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. అలాగే అభివృద్ధి చెందుతున్న దేశాల కోసం అంతర్జాతీయ ఫైనాన్షియల్ సంస్థలు పలు నిర్ణయాలతో రావాలని తెలిపారు.

PMModi Alerts Disruptions in International Fuel Fertilizer Food Chains from West Asia to Persist

ఇండియా- మిడిల్ ఈస్ట్- యూరోప్ ఎకనామిక్ కారిడార్.. కేవలం ఒక ప్రాంతానికే పరిమితం కాదు.. దాని విజయవంతమైన నమూనాను ప్రపంచవ్యాప్తంగా అందించాలనేది దాని విజన్.. జీ 7 దేశాల సమ్మిట్ లో ప్రతిపాదించిన IMPACT(ఇంటర్నేషనల్ మొబిలైజేషన్ పార్ట్ నర్ షిప్ ఫర్ యాక్జిలరేటింగ్ కనెక్టివిటీ అండ్ ట్రేడ్) అనే కూటమి.. గ్లోబల్ గవర్నెన్స్ లో లోపాలను సరిచేయగలదని ప్రధాని మోదీ ఎక్స్ వేదికగా అభిప్రాయపడ్డారు. జీ 7 దేశాల పెట్టుబడి, భారత్ ప్రతిభ, అలాగే గ్లోబల్ సౌత్ దేశాల యాజమాన్యం ప్రపంచ వాణిజ్యంలో గేమ్ ఛేంజర్ అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

అలాగే ప్రస్తుతం అభివృద్ధి చెందుతున్న దేశాలు మానవ వనరుల కొరతను ఎందర్కొంటున్నాయని.. కానీ భారత్, అలాగే గ్లోబల్ సౌత్ దేశాల్లో యువత, టాలెంట్ అధికం అని ప్రధాని మోదీ తెలిపారు. ఆ దేశాలలో ఉన్న యువత కొరతను.. గ్లోబల్ సౌత్ దేశాలలో ఉన్న యువ శక్తితో గ్లోబల్ స్కిల్స్ పార్ట్ నర్ షిప్ ఒక బలమైన వారధిగా మారుతుందని ప్రధాని మోదీ పేర్కొన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+