ఇది సార్ "అల్లు అర్జున్" బ్రాండ్.. ప్రధాని మోడీ పోస్టుకు #AA23 సాంగ్ !!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం పాన్ ఇండియా స్థాయిని దాటిపోయి గ్లోబల్ స్థాయిలో గుర్తింపు తెచ్చుకొని దూసుకుపోతున్నారు. 'పుష్ప' ఫ్రాంచైజీతో దేశవ్యాప్తంగా భారీ ఫ్యాన్ బేస్‌ను సంపాదించుకున్న ఆయన క్రేజ్ ఇప్పుడు రాజకీయ, సామాజిక వేదికలపై కూడా కనిపించడం ఆసక్తికరంగా మారింది. తాజాగా భారత ప్రధాని నరేంద్ర మోడీ ఇన్‌స్టాగ్రామ్‌లో చేసిన ఒక పోస్ట్.. అల్లు అర్జున్ అభిమానులను ఉత్సాహంలో ముంచెత్తింది. కారణం ఆ పోస్ట్‌లోని ఫొటో కాదు.. బ్యాక్‌గ్రౌండ్‌లో వినిపించిన 'AA23' థీమ్ మ్యూజిక్.

ప్రధాని మోదీ తన అధికారిక ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌కు అల్లు అర్జున్-లోకేష్ కనగరాజ్ కాంబినేషన్‌లో రూపొందనున్న 'AA23' చిత్రానికి సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్ కంపోజ్ చేసిన '23 థీమ్'ను ఉపయోగించడం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. దీంతో 'AA23' విడుదలకు ముందే దేశవ్యాప్తంగా మరోసారి చర్చల్లో నిలిచింది.దీంతో 'AA23', 'Allu Arjun', హ్యాష్‌ట్యాగ్‌లు సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లోకి వచ్చాయి.

allu-arjun-upcoming-film-song-posted-by-pm-narendra-mod-for-his-instagram-photo-and-got-full-viral-o

ప్రధాని మోదీ ఇటీవల స్లోవేకియా రాజధాని బ్రాటిస్లావాలో ప్రతిష్టాత్మక 'ది ఆర్డర్ ఆఫ్ ది వైట్ డబుల్ క్రాస్' అవార్డును స్వీకరించారు. ఈ సందర్భంగా భారత్-స్లోవేకియా స్నేహానికి ఈ గౌరవాన్ని అంకితం చేస్తున్నట్లు పేర్కొంటూ ఆయన సోషల్ మీడియాలో ప్రత్యేక ఫొటోను షేర్ చేశారు. అయితే ఆ పోస్ట్‌లో బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్‌గా 'AA23' థీమ్ వినిపించడంతో సినీ అభిమానులు వెంటనే దానిని గుర్తించారు.

అల్లు అర్జున్, అనిరుధ్ రియాక్షన్..

ఈ పోస్ట్‌ను అల్లు అర్జున్ లైక్ చేయడం అభిమానుల్లో మరింత ఆసక్తిని పెంచింది. అలాగే సంగీత దర్శకుడు Anirudh Ravichander కూడా ప్రధాని పోస్ట్‌కు స్పందించారు. పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు కూడా ఆ పోస్ట్‌ను లైక్ చేయడంతో 'AA23' ప్రాజెక్ట్ మరోసారి వార్తల్లో నిలిచింది. సాధారణంగా సినిమాల ప్రమోషన్ కోసం మేకర్స్ ప్రత్యేక వ్యూహాలు రూపొందిస్తుంటారు. అయితే ఈసారి ఎలాంటి ప్రమోషన్ లేకుండానే ప్రధాని పోస్ట్ ద్వారా 'AA23' దేశవ్యాప్తంగా డిజిటల్ బజ్‌ను సొంతం చేసుకోవడం విశేషంగా మారింది.

భారీ అంచనాల మధ్య 'AA23' ప్రాజెక్ట్..

దర్శకుడు Lokesh Kanagaraj, అల్లు అర్జున్ కాంబినేషన్‌లో తెరకెక్కనున్న 'AA23' ఇప్పటికే భారతీయ సినీ పరిశ్రమలో అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న ప్రాజెక్ట్‌లలో ఒకటిగా నిలిచింది. Mythri Movie Makers నిర్మిస్తున్న ఈ చిత్రంపై అధికారిక ప్రకటన వచ్చినప్పటి నుంచే అంచనాలు అమాంతం పెరిగిపోయాయి. 'ఖైదీ', 'విక్రమ్', 'లియో' వంటి బ్లాక్‌బస్టర్ చిత్రాలతో తనదైన సినిమాటిక్ యూనివర్స్‌ను నిర్మించిన లోకేష్ కనగరాజ్.. 'పుష్ప'తో జాతీయ స్థాయిలో సంచలనం సృష్టించిన అల్లు అర్జున్‌తో జతకట్టడం సినీ అభిమానుల్లో ప్రత్యేక ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఇప్పటికే విడుదలైన '23 థీమ్' మ్యూజిక్ సోషల్ మీడియాలో కోట్లాది వ్యూస్ సాధిస్తూ వైరల్ అయింది.

ప్రస్తుతం అల్లు అర్జున్ చేతిలో దర్శకుడు Atlee తెరకెక్కిస్తున్న భారీ సైన్స్ ఫిక్షన్ చిత్రం 'రాకా' కూడా ఉంది. Sun Pictures నిర్మిస్తున్న ఈ సినిమాలో Deepika Padukone కీలక పాత్రలో నటిస్తున్నారు. ఒకవైపు 'రాకా', మరోవైపు 'AA23' వంటి భారీ ప్రాజెక్ట్‌లతో అల్లు అర్జున్ తన కెరీర్‌లో అత్యంత కీలక దశలో ఉన్నారు. ఇలాంటి సమయంలో ప్రధాని మోదీ పోస్ట్‌లో 'AA23' థీమ్ వినిపించడం అభిమానులకు అదనపు ఉత్సాహాన్ని ఇచ్చింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+