"తమన్నా" కొత్త ఫ్లాట్ రేటు తెలిస్తే కళ్లు తిరగాల్సిందే..!
మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా గురించి ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. తెలుగు చిత్ర పరిశ్రమలో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న ఈ అందాల భామ, కెరీర్ ఆరంభం నుంచే స్టార్ హీరోల సరసన నటిస్తూ ప్రేక్షకులను మెప్పించింది. తెలుగుతో పాటు తమిళం, హిందీ సహా పలు భాషల్లో సినిమాలు చేసి పాన్ ఇండియా రేంజ్ క్రేజ్‌ను సొంతం చేసుకుంది. లవ్ స్టోరీస్, యాక్షన్ ఎంటర్టైనర్స్, కమర్షియల్ సినిమాలు, లేడీ ఓరియెంటెడ్ చిత్రాలు... జానర్ ఏదైనా సరే తమన్నా తన నటనతో ప్రత్యేక ముద్ర వేసింది.
ఒకప్పుడు టాలీవుడ్‌లో వరుస సినిమాలతో దూసుకెళ్లిన ఈ ముద్దుగుమ్మ, ప్రస్తుతం తెలుగులో సినిమాలు కాస్త తగ్గించినప్పటికీ బాలీవుడ్, కోలీవుడ్, ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ల్లో సినిమాలు, సిరీస్ లలో నటిస్తూ ఫుల్ ఫామ్‌లో దూసుకుపోతుంది. గతేడాది 'ఓదెల 2' తో విజయాన్ని అందుకున్న తమన్నా.. కమర్షియల్ సినిమాలతో పాటు డిఫరెంట్ కాన్సెప్ట్ ఉన్న పాత్రలను ఎంచుకుంటూ ముందుకెళ్తోంది. కోలీవుడ్‌లో విశాల్ నటిస్తున్న "పురుషన్" (తెలుగులో 'మొగుడు'గా డబ్బింగ్) సినిమాలో కీలక పాత్ర పోషిస్తోంది. అలాగే బాలీవుడ్‌లో కూడా పలు చిత్రాలు, ఐటం సాంగ్ లలో చేస్తూ బిజీగా ఉంది. కానీ ఇప్పుడు లేటెస్ట్ గా కొత్త ఫ్లాట్ కొనుగోలు చేసి వార్తల్లో నిలిచింది.

లగ్జరీ ఇళ్లు కొన్న మిల్కీ బ్యూటీ..
తమన్నా ఇటీవలే ముంబైలోని ఒక లగ్జరీ అపార్ట్మెంట్‌లో ఫ్లాట్ కొనుగోలు చేసింది. ఇది 5-స్టార్ హోటల్‌కు ఏ మాత్రం తక్కువ కాదని.. అన్ని లగ్జరీ సౌకర్యాలు ఉన్నాయని అంటున్నారు. తమన్నా ఇల్లు సుమారు 6065 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉండగా.. అన్ని వైపుల నుంచి సముద్రం కనిపిస్తుందని చెబుతున్నారు. ఈ ఫ్లాట్ వెర్సోవా-జుహు లింక్ రోడ్‌లోని 'బే వ్యూ' అనే 22 అంతస్తుల భవనంలో 14వ అంతస్తులో ఉందని సమాచారం. ఈ ఫ్లాట్ ను రూ.16.60 కోట్లకు కొనుగోలు చేయగా.. ఇంటీరియర్ డిజైన్ కోసమే ఏకంగా దాదాపు రూ. 2-3 కోట్ల కంటే ఎక్కువ ఖర్చు చేసినట్లు ఆమె సన్నిహితులు స్పష్టం చేస్తున్నారు.
రెమ్యునరేషన్‌లో రికార్డు
తమన్నా ప్రస్తుతం ఒక సినిమా కోసం రూ.5 కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకుంటుందని ఫిల్మ్ సర్కిల్స్ చెబుతున్నాయి. రీసెంట్‌గా "ఒదెల్ 2" సినిమా కోసం కూడా భారీ పారితోషికం అందుకుంది. అలాగే రైడ్ 2లో "నషా" ఐటమ్ సాంగ్ కోసం రూ.5 కోట్లు వసూలు చేసినట్లు సమాచారం. గతంలో జైలర్ సినిమాలో ఆమె చేసిన స్పెషల్ సాంగ్‌కి రూ.3 కోట్లు తీసుకున్నట్లు కోలీవుడ్‌లో టాక్. అయితే ఇవన్నీ బ్రేక్ చేస్తూ, "ది బ్యాడ్స్ ఆఫ్ బాలీవుడ్" సిరీస్‌లో కేవలం ఒక పాటకే రూ.6 కోట్లు తీసుకోవడం అప్పట్లో సోషల్ మీడియాలో జోరుగా చర్చ నడిచింది.












Click it and Unblock the Notifications