చంద్రుడిపై లక్షల టన్నుల గుప్తనిధులు! కోట్ల ఏళ్లుగా దాచిన ఇంధనం

భూమిపై అంతరించిపోతున్న ఇంధన వనరులకు ప్రత్యామ్నాయంగా.. ఇప్పుడు శాస్త్రవేత్తల చూపు కోట్లాది మైళ్ల దూరంలో ఉన్న చంద్రుడిపై పడింది. జాబిల్లిపై లభించే అత్యంత అరుదైన, స్థిరమైన ఐసోటోప్ 'హీలియం-3’ (Helium-3) ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా సరికొత్త చర్చకు తెరలేపింది. భూమిపై అత్యంత అరుదుగా దొరికే ఈ వాయువు, చంద్రుడిపై మాత్రం టన్నుల కొద్దీ నిక్షిప్తమై ఉంది.

బిలియన్ల సంవత్సరాలుగా సూర్యుడి నుండి వీస్తున్న సౌర గాలుల (Solar Wind) కారణంగా చంద్రుడి ఉపరితలంపై ఉండే రేగోలిత్ (చాంద్రధూళి) పొరల్లో ఈ హీలియం-3 భారీగా పేరుకుపోయింది. రాబోయే రోజుల్లో భూమిపై క్వాంటం ఇన్ఫర్మేషన్ సైన్స్, క్రయోజెనిక్స్, ఫ్యూజన్ (అణు సంలీనం) పరిశోధనలకు ఇది ఒక సంజీవనిలా మారుతుందని ఇంధన నిపుణులు భావిస్తున్నారు.

Moon Helium 3 Mining Race How This Rare Isotope Could Power Earth Future Fusion And Quantum Technology

లక్షల టన్నుల నిధులు.. రంగంలోకి రోవర్లు!

ప్రముఖ అంతర్జాతీయ వార్తా సంస్థ 'రాయిటర్స్' నివేదిక ప్రకారం.. చంద్రుడిపై దాదాపు 10 లక్షల టన్నుల హీలియం-3 నిల్వలు ఉండే అవకాశం ఉందని నాసా ప్రాథమికంగా అంచనా వేసింది. దీని వెలికితీత ఇంకా ప్రయోగాత్మక దశలోనే ఉన్నప్పటికీ, ప్రైవేట్ సంస్థలు ఇప్పుడు ఈ కలను నిజం చేసే పనిలో పడ్డాయి.

'మాగ్నా పెట్రా' ఒక సెలక్టివ్ కమర్షియల్ రోవర్ ద్వారా చంద్రుడి ఉపరితలంపై ఉన్న వాయువులను పరీక్షించేందుకు నాసా ఒక ప్రత్యేక పరికరాన్ని పంపింది. చంద్రుడి ధూళిలో హీలియం-3 ఏ స్థాయిలో దాగి ఉందో తెలుసుకోవడానికి ఈ ప్రయోగం ఎంతో కీలకం కానుంది.

స్వర్ణ నిధితో బయటపడిన 500 ఏళ్ల నాటి 'బోమ్ జీసస్’ నౌక..
స్వర్ణ నిధితో బయటపడిన 500 ఏళ్ల నాటి 'బోమ్ జీసస్’ నౌక..

గంటకు 100 టన్నుల ప్రాసెసింగ్.. ప్రైవేట్ కంపెనీల స్పీడ్

చంద్రుడి నుంచి హీలియం-3ని భూమికి తీసుకురావడం అనేది భారీ ప్రాజెక్టుతో కూడుకున్న పని. ఇందుకోసం 'ఇంటర్‌లూన్' (Interlune) అనే ప్రైవేట్ సంస్థ ఒక అడుగు ముందుకు వేసి, గంటకు 100 మెట్రిక్ టన్నుల చాంద్రధూళిని ప్రాసెస్ చేయగల భారీ ప్రోటోటైప్ ఎక్స్‌కవేటర్‌ను విజయవంతంగా పరీక్షించింది.

అలాగే క్వాంటం కంప్యూటింగ్‌లో వాడే రిఫ్రిజరేటర్లను తయారు చేసే ఫిన్నిష్ సంస్థ 'బ్లూఫోర్స్' (Bluefors), చంద్రుడి నుండి హీలియం-3 ని సేకరించడానికి ఇంటర్‌లూన్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ పరిణామాలు చూస్తుంటే, హీలియం-3 వేట కేవలం కాగితాలకే పరిమితం కాకుండా ఇంజనీరింగ్ ట్రయల్స్ వైపు వేగంగా దూసుకుపోతోందని అర్థమవుతోంది.

భూగర్భంలో దాగున్న నిగూఢ జలనిధి!
భూగర్భంలో దాగున్న నిగూఢ జలనిధి!

తక్షణ పరిష్కారం కాదు.. కానీ భవిష్యత్తు పందెం!

అయితే, ఈ హీలియం-3 అనేది తక్షణమే భూమి ఇంధన సమస్యలను తీర్చేసే సాధనం కాదని అమెరికా ఎనర్జీ డిపార్ట్‌మెంట్ స్పష్టం చేస్తోంది. డ్యూటీరియం-హీలియం-3 ఫ్యూజన్ విధానాల ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేయడానికి ఇంకా శాస్త్రీయంగా, ఇంజనీరింగ్‌ పరంగా ఎన్నో సవాళ్లు దాటాల్సి ఉంది. మరోవైపు ఈ లూనార్ రేస్ వెనుక అంతర్జాతీయ భౌగోళిక రాజకీయాలు (Geopolitics) కూడా బలంగా నడుస్తున్నాయి.

చైనా, రష్యాలు ఉమ్మడిగా 'ఇంటర్నేషనల్ లూనార్ రీసెర్చ్ స్టేషన్' కోసం చంద్రుడిపై అణు విద్యుత్ ప్లాంట్‌ను నిర్మించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాయి. ప్రస్తుతానికి హీలియం-3 అనేది తక్షణ వనరు కాకపోయినా, భవిష్యత్తు ప్రపంచాన్ని శాసించే ఒక అద్భుతమైన దీర్ఘకాలిక పెట్టుబడి అని శాస్త్రవేత్తలు నమ్ముతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+