‘రాహుల్! మధ్యవయస్కుడైనా పరిణితి కనిపించడం లేదు’
న్యూఢిల్లీ: పార్లమెంట్‌లో కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రసంగంపై కేంద్రమంత్రి అరుణ్ జైట్లీ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. రాహుల్ గాంధీలో తనకు ఇప్పటికీ పరిణితి కనిపించడం లేదని అన్నారు.
.@arunjaitley When he woke up in Morning, in middle of night. U know how much he know - what he know pic.twitter.com/oJ9O0EYYMZ
— #GauravPradhan (@DrGPradhan) 2 March 2016
'యువకుడి నుంచి మధ్యవయస్కుడిగా మారుతున్న సమయంలో వ్యక్తుల నుంచి కొంతపరిణతిని ఆశిస్తాం. కానీ, రాహుల్ మాట్లాడుతుండగా విన్న ప్రతీసారీ ఆయన మానసిక పరిణితిపై నాకు అనుమానం వస్తుంటుంది' అని ఫేస్‌బుక్‌లో వ్యాఖ్యానించారు.

కాగా, నాగా శాంతి ఒప్పందం గురించి తనకు తెలియదంటూ పార్లమెంట్లో రాహుల్ చేసిన వ్యాఖ్యలను హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ తోసిపుచ్చారు. నాగా ఒప్పందం సమయంలో తాను ఆ సంప్రదింపుల్లో క్రియాశీలంగా వ్యవహరించానని ట్విట్టర్లో తెలిపారు.
నల్లధనంపై జైట్లీ
నల్లధనాన్ని స్వచ్ఛందంగా వెల్లడి చేసి, చట్టబద్ధ ఆదాయం/ఆస్తులుగా మార్చుకునే అవకాశం కల్పించడమంటే నల్లధనం దాచుకున్నవారిపై కరుణ చూపడం కాదని కేంద్ర మంత్రి జైట్లీ వ్యాఖ్యానించారు. 45శాతం వసూలు చేయనున్నామని, ఈ అవకాశం కూడా కొంతకాలమేనన్నారు.












Click it and Unblock the Notifications