బ్యాంకు ఉద్యోగి రాసలీలలు.. 40 మందితో సంబంధం.. 15 సెల్‌ఫోన్లలో నగ్న వీడియోలు

తమిళనాడులోని తిరుచ్చిరాపల్లి జిల్లా మనప్పారైకి చెందిన ఎడ్విన్ జయకుమార్(36) అనే బ్యాంకు ఉద్యోగి రాసలీలలు బయటపడ్డాయి. ఇండియన్ బ్యాంకులో క్యాషియర్‌గా పనిచేస్తున్న జయకుమార్.. దాదాపు 40 మంది మహిళలను లోబర్చుకున్నాడు. వీరిలో బ్యాంకుకు వచ్చే మహిళా ఖాతాదారులు, అతని ఇంటి చుట్టుపక్కల ఉండేవారు ఉన్నారు. ఈ విషయాలన్నీ తెలిసి అతని భార్య షాక్‌కు గురైంది. స్థానిక పోలీస్ స్టేషన్‌లో భర్తపై ఫిర్యాదు చయడంతో జయకుమార్ నిర్వాకం బయటపడింది.

 ఎవరీ జయకుమార్..

ఎవరీ జయకుమార్..

పుదుక్కొట్టై జిల్లా వీరాలిమలైలోని ఇండియన్‌ బ్యాంక్‌లో ఎడ్విన్‌ జయకుమార్‌ (36) క్యాషియర్‌గా పనిచేస్తున్నాడు. గతేడాది తంజావూరుకు చెందిన ఓ మహిళ(32)తో అతనికి వివాహం జరిగింది. అయితే పెళ్లయిన మొదటి రోజు నుంచి జయకుమార్ భార్యతో ఎక్కువ సమయం గడిపేవాడు కాదు. ఇంట్లో ఉన్నప్పుడు కూడా పక్క గదిలోకి వెళ్లి సెల్‌ఫోన్‌తో కాలక్షేపం చేసేవాడు. మొదట్లో అతని భార్యకేమీ అనుమానం రాలేదు.

 కనిపెట్టిన భార్య..

కనిపెట్టిన భార్య..

ఇటీవల ఉన్నట్టుండి అదనపు కట్నం కోసం ఆమెను వేధించడం మొదలుపెట్టాడు. ఇదే క్రమంలో ఓరోజు భర్త బ్యాంకుకు వెళ్లిన సమయంలో అతని గదిలోకి వెళ్లి పరిశీలించింది. అక్కడ 15 స్మార్ట్ ఫోన్స్ ఉండటం చూసి ఆశ్చర్యపోయింది. అందులో ఏముందా అని చూడగా.. దాదాపు 40 మంది మహిళలకు చెందిన 200 పైచిలుకు నగ్న వీడియోలు కనిపించాయి. వారందరితో భర్త నగ్నంగా,అసభ్యంగా ఉన్న వీడియోలు కనిపించాయి.

 భార్యకు జయకుమార్ బెదిరింపులు..

భార్యకు జయకుమార్ బెదిరింపులు..

భర్త వ్యవహారంతో షాక్ తిన్న భార్య అత్తింటివారికి విషయం చెప్పింది. అయితే వారు పెద్దగా పట్టించుకోలేదు. దీంతో భర్తనే నిలదీసింది. అప్పటినుంచి ఆమెపై కక్ష పెంచుకున్న జయకుమార్.. రెండుసార్లు ఆమెపై హత్యాయత్నం చేశాడు. అంతేకాదు, స్నానం చేస్తున్నప్పుడు నీ నగ్న వీడియోలు చిత్రీకరించానని.. తన విషయం బయటపెడితే ఆ వీడియో లీక్ చేస్తానని బెదిరించాడు. బ్యాంకులో పనిచేసే తన సహోద్యోగిని దేవీ బిలోమినాతోనూ బెదిరింపులకు గురిచేశాడు.

Recommended Video

    మరో వ్యక్తితో భార్య సాగిస్తున్న రాసలీలలు చూసిన భర్త | Oneindia Telugu
    నాన్ బెయిలబుల్ కేసులు పెట్టాలన్న కోర్టు..

    నాన్ బెయిలబుల్ కేసులు పెట్టాలన్న కోర్టు..

    ఇటీవల ఆమె తన తల్లిదండ్రుల సహాయంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. జయకుమార్‌తో పాటు అతనికి సహకరించిన సహోద్యోగిని,అత్త,అతని సోదరిపై పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే జయకుమారే ముందుగానే అప్రమత్తమై హైకోర్టులో ముందస్తు బెయిల్ పొందినట్టు సమాచారం. అయితే కేసు తీవ్రత గురించి అతని భార్య మధురై కోర్టుకు వివరించడంతో.. అతనిపై నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేయాల్సిందిగా న్యాయస్థానం ఆదేశించింది. ప్రస్తుతం పరారీలో ఉన్న అతని కోసం పోలీసులు గాలిస్తున్నారు.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+