మరో ప్రైవేట్ బస్సు దగ్ధం.. ముగ్గురు సజీవ దహనం !!
భారతదేశంలో ప్రైవేట్ బస్సుల్లో అగ్ని ప్రమాద వరుసగా చోటు చేసుకోవడం ప్రయాణికులలో తీవ్ర ఆందోళన కలిగిస్తుంది. ఇటీవల కర్నూలు, జైసల్మేర్‌లలో జరిగిన ఘోర ప్రమాదాలను మరువక ముందే, రాజస్థాన్‌లో మరో ప్రైవేట్ బస్సు ప్రమాదానికి గురైంది. రాజస్థాన్‌లోని జైపూర్-ఢిల్లీ రహదారిపై ప్రైవేట్ బస్సులో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగి ప్రమాదం జరిగింది. ఈ అనూహ్య ఘటన దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.
జైపూర్‌లోని మనోహర్‌పూర్ ప్రాంతంలో తోడి గ్రామంలోకి వస్తుండగా హైటెన్షన్ వైర్ తాకడం వల్ల బస్సులో మంటలు అంటుకున్నాయి. క్షణాల్లో మంటలు వ్యాపించి బస్సు దగ్ధమైంది. ఈ దుర్ఘటనలో ముగ్గురు ప్రయాణికులు సజీవ దహనమయ్యారు. మరో 12 మంది తీవ్రంగా గాయపడ్డారు. బస్సు రన్నింగ్‌లో ఉండగా షార్ట్ సర్క్యూట్ వల్ల మంటలు చెలరేగినట్లు తెలుస్తోంది. ఈ బస్సు ఇటుక బట్టీకి చెందిన కార్మికులను తీసుకెళ్తున్నట్టు చెబుతున్నారు. ఈ అనూహ్యఅ ఘటనతో వారి కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.

క్షతగాత్రులను స్థానికులు సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. ఐదుగురు పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన చికిత్స కోసం జైపూర్‌కు తరలించారు. మనోహర్‌పూర్ పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
కాగా గత వారం హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న ప్రైవేటు ట్రావెల్స్‌కు చెందిన బస్సు ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు దగ్గర మంటలు అంటుకుని దగ్ధమైంది. ఈ ఘటనలో 19 మంది ప్రయాణికులు సజీవ దహనం అయ్యారు. ఈ ఘటన యావత్తు దేశాన్ని కలవరపాటుకు గురి చేసింది, డ్రైవర్ నిర్లక్ష్యంగానే ఈ ప్రమాదం జరిగినట్లుగా తెలుస్తోంది. అలానే జైసల్మేర్‌లో కూడా ప్రైవేట్ బస్సు ప్రమాదంలో 26 మంది మరణించిన విషయం తెలిసిందే.
వరుసగా జరుగుతున్న ఈ ఘోర ప్రమాదాలు ప్రైవేట్ బస్సుల భద్రతా ప్రమాణాలు, వాహన నిర్వహణ.. డ్రైవర్ల శిక్షణపై తీవ్రమైన ప్రశ్నలు రేకెత్తిస్తున్నాయి. ప్రభుత్వం, రవాణా శాఖలు ఈ తరహా ప్రమాదాల నివారణకు తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని భావిస్తున్నారు.
-
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా












Click it and Unblock the Notifications