ఢిల్లీలో బళ్లారి బీజేపీ ఎంపీ శ్రీరాములు ఇంటిలో అగ్నిప్రమాదం, పిల్లలకు!
న్యూఢిల్లీ: కర్ణాటక మాజీ మంత్రి, బళ్లారి బీజేపీ ఎంపీ శ్రీరాములు ఇంటిలో మంగళవారం ఉదయం అగ్నిప్రమాదం జరిగింది. న్యూఢిల్లీలోని ఫిరోజా షా రోడ్డులో బీజేపీ ఎంపీ శ్రీరాములకు చెందిన నివాసం ఉంది. మంగళవారం ఒక్కసారిగా ఎంపీ శ్రీరాములు ఇంటిలో మంటలు వ్యాపించాయి.
Recommended Video

అదృష్టవశాత్తు అందరూ బయటపడ్డారు. ఈ విషయంపై ఢిల్లీలో బీజేపీ ఎంపీ శ్రీరాములు మీడియాతో మాట్లాడుతూ ఆకస్మికంగా మంటలు వ్యాపించడంతో వెంటనే తాము గుర్తించి కుటుంబ సభ్యులు అందరూ బయటకు వచ్చేశామని అన్నారు.
#Delhi: Fire broke out at the residence of BJP MP B Sriramulu on Feroz Shah Road, in the early morning hours, says "narrowly escaped"; children suffered minor injuries. Situation now under control pic.twitter.com/50snUjXndv
— ANI (@ANI) December 19, 2017
ఈ ప్రమాదంలో పిల్లలకు చిన్నచిన్న గాయాలైనాయని, వెంటనే బయటకు రావడంతో పెద్దప్రమాదం తప్పిందని బీజేపీ ఎంపీ శ్రీరాములు మీడియాకు చెప్పారు. అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలు అదుపు చేశారు.
అగ్నిప్రమాదం ఎలా జరిగింది అంటూ స్థానిక పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది దర్యాప్తు చేస్తున్నారు. విషయం తెలుసుకున్న బీజేపీ నాయకులు, గాలి జనార్దన్ రెడ్డి అనుచరులు, శ్రీరాములు అనుచరులు, మద్దతుదారులు ఆయనకు ఫోన్లు చేసి వివరాలు సేకరిస్తున్నారు.












Click it and Unblock the Notifications