భారీ అగ్నిప్రమాదం.. కదులుతున్న రైలులో మంటల కలకలం!
పంజాబ్ నుంచి బీహార్ వెళ్తున్న కర్మభూమి ఎక్స్ప్రెస్ రైలులో శుక్రవారం మధ్యాహ్నం భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. పంజాబ్లోని పటియాలా జిల్లా రాజ్ పురా సమీపంలో గల సరాయ్ బంజారా గ్రామం వద్ద రైలు వెళ్తుండగానే ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దాంతో రైలు బోగీలలో దట్టమైన పొగలు అలుముకోవడంతో ప్రయాణీకులు తీవ్ర భయాందోళనకు గురై ప్రాణాలు దక్కించుకోవడానికి బయటకు పరుగులు తీశారు.
ప్యాంట్రీ కార్ నుంచి మొదలైన మంటలు
సరాయ్ బంజారా రైల్వే స్టేషన్ సమీపంలో రైలు వెళ్తున్న సమయంలో ప్యాంట్రీ కార్ నుంచి మొదలైన మంటలు క్రమంగా ఇతర బోగీలకు వ్యాపించినట్లు సమాచారం. మంటలు చెలరేగిన వెంటనే ఫైర్ అలారం మోగడంతో ప్రయాణీకులు సమయస్ఫూర్తితో అప్రమత్తమైన రైలు ఆగిన వెంటే కిందకు దిగిపోయారు. ఘటనాస్థలికి సంబంధించిన వీడియోల్లో చాలా వరకు పొగలు కమ్ముకోవడమే కాకుండా భోగీల నుంచి పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడటం కనిపించింది.

తప్పిన పెద్ద ప్రమాదం.. సురక్షితంగా ప్రయాణీకులు
పండగల సీజన్ కావడంతో రైలు ప్రయాణీకులతో తీవ్ర రద్దీగా ఉంది. ప్రమాదం జరిగిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది, రైల్వే అధికారులు హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. పటియాలా డిప్యూటీ కమిషనర్ హిమాంశు అగర్వాల్ అందించిన వివరాల ప్రకారం.. ఫైర్ అలారం మోగడం వల్ల ప్రయాణీకులు త్వరగా బయటకు రాగలిగారని, ఇప్పటివరకు ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం కానీ, ఎవరికీ తీవ్ర గాయాలు కానీ కాకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.
ఉన్నత స్థాయి విచారణకు రైల్వే ఆదేశం
అగ్నిప్రమాదానికి గల ఖచ్చితమైన కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఈ ఘటనపై రైల్వే శాఖ తీవ్రంగా స్పందించి ప్రమాదానికి దారితీసిన పరిస్థితులపై ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించింది. అన్ని కోణాల్లో పరిశీలించి నివేదిక సమర్పించాలని అధికారులను సూచించింది. పండగపూట ప్రయాణిస్తున్న వేళ జరిగిన ఈ ప్రమాదం ప్రయాణీకులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది.
पटियाला राजपुरा के पास कर्मभूमि एक्सप्रेस ट्रेन के चार डिब्बों में भयंकर आग लग गई... 😱#KarmabhoomiExpress https://t.co/mHGb26LfYc
— Adesh_26 (@SonOfBharat_88) November 6, 2026














Click it and Unblock the Notifications
