మధ్యప్రదేశ్‌లోని డీఈఎంయూ ట్రైన్‌లో చెలరేగిన మంటలు.. భయాందోళనలో ప్రయాణికులు..
మధ్యప్రదేశ్‌లోని డీఈఎంయూ ట్రైన్ ఇంజిన్‌లో ఉన్నట్లుండి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో ట్రైన్‌లో ప్రయాణిస్తున్నవారు భయాందోళనలకు గురయ్యారు. ఈ ఘటన రాష్ట్రంలోని రత్లామ్ జిల్లాలో నిన్న (ఆదివారం) చోటుచేసుకుంది. అయితే, సమాచారం అందుకున్న వెంటనే అప్రమత్తమయిన అధికారులు మంటలను అదుపులోకి తీసుకువచ్చారని, ఈ సంఘటనలో ఎవరీకి ఎలాంటి కాలేదని రైల్వేశాఖ అధికారులు పేర్కొన్నారు.
డాక్టర్ అంబేద్కర్ నగర్ నుంచి రత్లాంకు బయలుదేరిన డీఎంయూ ట్రైన్ ఇంజిన్‌లో సాయంత్రం 5.30 గంటల సమయంలో రుణిజా - నౌగావ్ మధ్య ఒక్కసారిగా మంటలు చెలరేగినట్లు పశ్చిమ రైల్వే శాఖ అధికారులు వివరించారు. కదులుతున్న ట్రైన్‌లో మంటలు చెలరేగడంతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనలకు గురయినట్లు తెలుస్తోంది. అయితే, డైలీ ప్యాసింజర్ ట్రైన్‌లో ఇలా మండలు రావడం ప్రయాణికులను భయాందోళనలకు గురిచేసిందని అధికారులు చెబుతున్నారు.

అరగంటపాటు శ్రమించి...
ఈ అగ్నిప్రమాదంలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదని, ఎవరూ గాయపడలేదని రైల్వేశాఖ అధికారులు వివరించారు. మంటలు చెలరేగడంతో వెంటనే రైల్వేశాఖ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ ట్రైన్ ప్రీతమ్ నగర్‌కు సుమారు మూడు కిలోమీటర్ల ముందు ఉండగానే, ట్రైన్ ఇంజిన్‌లో నుండి ఒక్కసారిగా పొగలు వచ్చాయని, దీంతో ట్రైన్‌ను అక్కడే అడవిలోనే ఆపివేశారని అధికారులు చెబుతున్నారు.
రైలు ఆగిన తర్వాత ప్రయాణికులంతా ట్రైన్ నుంచి బయటకు వచ్చారు. అయితే, సమీప గ్రామస్థులు కూడా ట్రైన్ పరిసరాలకు వచ్చారు. అనంతరం సమీపంలోని గొట్టపు బావి నుండి పైపును కనెక్ట్ చేసి మంటలను ఆర్పే ప్రయత్నం చేశారు. సుమారు అరగంట పాటు శ్రమించి మంటలను పూర్తిగా ఆర్పివేశారు. మంటలు పూర్తిగా ఆరిపోయిన తర్వాత ట్రైన్‌ను ప్రీతమ్ నగర్‌కు తీసుకొచ్చారు. రత్లాం నుంచి వచ్చిన డైలీ ప్యాసింజర్ ట్రైన్‌ను రైల్వే అధికారులు పరిశీలించారు. విచారణ అనంతరం ఈ ట్రైన్‌ను రత్లాంకు తీసుకువస్తున్నట్లు అధికారులు తెలిపారు.












Click it and Unblock the Notifications