వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పార్లమెంటులో అగ్నిప్రమాదం... మంటలను అదుపులోకి తెచ్చిన ఫైర్ సిబ్బంది

|
Google Oneindia TeluguNews

ఢిల్లీ: ఢిల్లీలో తరుచూ అగ్ని ప్రమాదాలు సంభవిస్తున్నాయి. తాజాగా పార్లమెంటు భవనంలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఈ అగ్ని ప్రమాదం పార్లమెంటు భవనంలోని 6వ అంతస్తులో సంభవించింది. సమాచారం అందుకున్న అగ్నిమాపకశాఖ వెంటనే అక్కడకు చేరుకుని ఏడు ఫైరింజన్లతో మంటలను అదుపు చేసింది. అయితే అగ్ని ప్రమాదంకు కారణం షార్ట్‌సర్క్యూట్‌ అని ప్రాథమిక అంచనాకు వచ్చారు. ఉదయం 7:30 గంటల సమయంలో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది.

ఘటనా స్థలంకు చేరుకున్న ఫైర్ ఇంజిన్లు మంటలను అదుపులోకి తీసుకొచ్చాయి. అయితే ఉదయం ప్రమాదం చోటుచేసుకోవడంతో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. అదే సమయంలో ఎవరికీ గాయాలు కాలేదు. దీంతో అంతా ఊపరి పీల్చుకున్నారు. ప్రజల దేవాలయంగా పిలువబడే పార్లమెంటులో దేశ చట్టాలను రూపొందిస్తారు. అలాంటి భవనంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకోవడం పలువురిని ఆందోళనకు గురిచేసింది.

Fire broke out in the sixth floor of Parliament building,no casualities reported

ఇదిలా ఉంటే రాజ్యసభ లోక్‌సభ సమావేశాలు కరోనావైరస్ కారణంగా ఈ ఏడాది మార్చి నుంచి రద్దయ్యాయి. ప్రధాని నరేంద్ర మోడీ దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ విధిస్తున్నట్లు ప్రకటించడానికి కొద్ది రోజుల ముందు పార్లమెంటు సమావేశాలు రద్దయ్యాయి. మార్చి 23న బడ్జెట్ సమావేశాలు వాయిదాపడ్డాయి. ఇదిలా ఉంటే వర్షాకాల సమావేశాలు నిర్వహించేందుకు ప్రభుత్వం అన్ని జాగ్రత్త చర్యలు తీసుకుంటోందని అధికారులు ఆదివారం వివరించారు.చాంబర్ల దగ్గర నుంచి గ్యాలరీల వరకు అన్ని జాగ్రత్త చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు. అయితే సెప్టెంబర్ 23 నుంచి వర్షాకాల సమావేశాలు ప్రారంభం కావాల్సి ఉంది. ఎందుకంటే ఒక సమావేశానికి మరో సమావేశానికి ఆరునెలల కంటే ఎక్కువ సమయం గ్యాప్ ఉండరాదు. ఇదిలా ఉంటే ప్రమాదంపై ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

English summary
Fire broke out in the sixth floor of Parliament building early on Monday
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X