అయోధ్య రామమందిరంలో కాల్పుల కలకలం.. జవాను మృతి

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని అయోధ్య రామ మందిరం కాంప్లెక్స్ లో ఈరోజు తెల్లవారుజామున చోటు చేసుకున్న కాల్పులు అందరిని ఒక్కసారిగా షాక్ గురిచేశాయి. నేడు తెల్లవారుజామున 5:25 నిమిషాలకు భద్రతా ఏర్పాట్లలో ఉన్న ఒక ఎస్ఎస్ఎఫ్ జవాన్ అనుమానాస్పద స్థితిలో మరణించాడు. రామజన్మభూమి భద్రత కోసం మోహరించిన ఓ జవాన్ ఆకస్మికంగా జరిగిన కాల్పులతో రామజన్మభూమి వద్ద కుప్పకూలిపోయాడు.

ఒక్కసారిగా కాల్పుల శబ్దం విని ఘటనా స్థలానికి సైనికులు పరుగులు తీస్తూ వచ్చారు. అక్కడ రక్తమడుగులో ఉన్న జవాన్ ను గుర్తించారు. వెంటనే ఆసుపత్రికి తరలించినా లాభం లేకపోయింది. జవాను ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించినట్టు వైద్యులు చెబుతున్నారు. అయితే కాల్పులకు గల కారణం ఇంకా స్పష్టంగా తెలియ రాలేదు.

Firing in Ayodhya Ram Mandir A UPSSF constable died

జవాను తన సొంత రైఫిల్ తో కాల్చిన గాయంతో మృతి చెందాడు. సంఘటన స్థలాన్ని సందర్శించిన సీనియర్ పోలీసు అధికారులు ఇది ప్రమాదవశాత్తు జరిగిందా లేదా ఆత్మహత్యనా అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. అంబేద్కర్ నగర్ కు చెందిన 25 సంవత్సరాల శత్రుజ్ఞ విశ్వకర్మ గా ఆయనను గుర్తించారు. అతను ఉత్తర ప్రదేశ్ స్పెషల్ సెక్యూరిటీ ఫోర్సులో కానిస్టేబుల్ గా పనిచేస్తున్నారు.

ఇక సంఘటనా స్థలంలో ఆధారాలను ఫోరెన్సిక్ బృందం సేకరిస్తుండగా మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. అయోధ్య రామ మందిరం ప్రారంభోత్సవం తర్వాత ఇలాంటి ఘటన జరగడం ఇది రెండోసారి. అంతకుముందు మార్చిలో కూడా ఆలయ భద్రత కోసం మోహరించిన పిఏసి ప్లాటూన్ కమాండర్ అనుమానాస్పద స్థితిలో మరణించారు. ఇక ఇప్పుడు మళ్లీ ఈ జవాన్ అనుమానాస్పద స్థితిలో ప్రాణాలు కోల్పోయాడు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+