వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అయోధ్య మందిరంపై మరో ముందడుగు.. 19న ట్రస్టు తొలి సమావేశం.. కీలక నిర్ణయాలివే..

|
Google Oneindia TeluguNews

Recommended Video

Good Morning India: 3 Minutes 10 Headlines | Asaduddin Owaisi Warns BJP

రామజన్మభూమిలో ఆలయ నిర్మాణం ప్రక్రియకు సంబంధించి మరో అడుగు ముందుకుపడింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు అయోధ్యలో మందిర నిర్మాణం కోసం కేంద్రం ఏర్పాటుచేసిన ''శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర'' ట్రస్టు ఈనెల 19 నుంచి కార్యకలాపాలు ప్రారంభించనుంది. ఈ మేరకు తొలి సమావేశం తేదీని ట్రస్టు సభ్యుడైన బీజేపీ నేత కామేశ్వర్ చౌపాల్ ఆదివారం వెల్లడించారు.

కీలక నిర్ణయాలు..

కీలక నిర్ణయాలు..

కేంద్రం ఇదివరకే జారీ చేసిన నోటిఫికేషన్ లోని అంశాల మేరకు.. ఈనెల 19న తొలిసారి భేటీ కానున్న అయోధ్య టెంపుల్ ట్రస్టు.. ఆ సమావేశంలోనే కీలక నిర్ణయాలు తీసుకోనుంది. ట్రస్టుకు శాశ్వత కార్యాలయంగా ఢిల్లీలోని గ్రేటర్‌ కైలాష్‌ ప్రాంతం, ఆర్-20 భవంతిని నిర్ధారించనున్నారు. ఆ బిల్డింగ్ బిల్డింగ్ మరెవరిదోకాదు.. ట్రస్ట్‌ చైర్మన్‌, అయోధ్య కేసులో రామ్‌లలా, హిందూ పక్షాల తరఫున వాదించిన పరాశరన్‌ ఇల్లే. దీంతోపాటు నామినెటెడ్ సభ్యుల ఎంపిక కూడా 19నే జరుగనుంది.

ఆరుగురి ఎంపికా అదే రోజు..

ఆరుగురి ఎంపికా అదే రోజు..

అయోధ్య టెంపుల్ ట్రస్టులో మొత్తం 15 మంది సభ్యులు ఉంటారని ప్రకటించిన కేంద్రం... వారిలో తొమ్మిది మంది శాశ్వత, ఆరుగురు తాత్కాలిక సభ్యులుంటారని తెలిపింది. చైర్మన్ పరాశరన్‌ తోపాటు వాసుదేవానంత్, మాధవాచార్య స్వామి,యుగపురుష్‌ పరమానంద్‌, స్వామీ గోవిందదేవ్‌, విమలేందు మోహన్‌ ప్రతా ప్‌ మిశ్రా, డాక్టర్ అనిల్‌మిశ్రా, పట్నాకు చెందిన కమలేశ్వర్‌ చౌపాల్‌, నిర్మోహీ అఖాడా చీఫ్‌ మహంత్‌ ధీరేంద్ర దాస్‌ శాశ్వత సభ్యులుగా ఉన్నారు. మిగతా ఆరుగురు తాత్కాలిక సభ్యుల ఎన్నిక 19న జరిగే తొలి భేటీలో నిర్వహిస్తారు.

అన్ని నిర్ణయాలు ట్రస్టువే

అన్ని నిర్ణయాలు ట్రస్టువే


అయోధ్యలో రామ మందిరం నిర్మాణానికి సంబందించిన ఎలాంటి నిర్ణయాన్నైనా తీసుకునే పూర్తి స్వేచ్ఛ శ్రీరామ జన్మభూమి ట్రస్టుకు ఉంటుందని, విరాళాల సేకరణ, పెట్టుబడులు లాంటి వ్యవహారాలూ అదే చూసుకుంటుందని కేంద్రం ఇదివరకే ప్రకటించింది. అయోధ్య టెంపుల్ ట్రస్టు ఎప్పటికప్పుడు లెక్కలు పక్కాగా రాయాలని, నిర్ణీత కాల వ్యవధిలో ట్రస్టు ఖాతాలను ఆడిట్ చేస్తామనీ ప్రభుత్వం తెలిపింది.

English summary
The first meeting of 'Shri Ram Janmbhoomi Teerth Kshetra' Trust, set up for the construction of Ram Temple in Ayodhya -- will be held on February 19, BJP leader Kameshwar Choupal said on Sunday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X