పశ్చిమబెంగాల్‌లో మంకీపాక్స్ కలకలం: దద్దుర్లు, లక్షణాలతో ఆస్పత్రిలో చేరిన కోల్‌కతా విద్యార్థి
న్యూఢిల్లీ: ప్రపంచ దేశాలను వణికిస్తున్న మంకీపాక్స్ మహమ్మారి ఇప్పుడు మనదేశంలోకి ప్రవేశించినట్లు తెలుస్తోంది. పశ్చిమబెంగాల్ రాష్ట్రం కోల్‌కతాలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేరిన విద్యార్థికి మంకీపాక్స్ వ్యాధి సోకిందని వైద్యులు అనుమానిస్తున్నారు. అతను కొన్ని రోజుల క్రితం యూరోపియన్ దేశం నుంచి తిరిగి వచ్చాడు.
వెస్ట్ మిడ్నాపూర్‌కు చెందిన యువకుడి శరీరంపై 'దద్దుర్లు', ఇతర లక్షణాలతో కోల్‌కతాలోని ఆసుపత్రిలో చేరాడు. మంకీ పాక్స్‌గా అనుమానించడంతో శాంపిల్‌ను పరీక్షల నిమిత్తం పూణెలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ (ఎన్‌ఐవీ)కి పంపారు. పరీక్ష నివేదిక ఇంకా రాలేదు. రోగిని ఐసోలేషన్‌లో ఉంచారు. అతని ఇంట్లోని ప్రజలను కూడా పశ్చిమ బెంగాల్ ఆరోగ్య శాఖ అప్రమత్తం చేస్తుంది.

విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. ఒక వ్యక్తి నమూనాను పరీక్ష కోసం పంపారు. ఎందుకంటే ఆ విద్యార్థి విదేశాల నుంచి తిరిగొచ్చాడు. మంకీపాక్స్ వ్యాధి అనుమానం ఉన్న వ్యక్తి నమూనాను పరీక్షలకు పంపడం రాష్ట్రంలో ఇదే తొలిసారి. విద్యార్థి రక్త నమూనాను పంపించారు. దద్దుర్లు నుంచి తీసిన ద్రవం నమూనాలు కూడా పంపబడ్డాయి. అయితే, అతనికి ప్రాణాపాయం ఏమి లేదని వైద్యులు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications