జార్ఖండ్‌లో ముగిసిన తొలి విడత పోలింగ్: ఓటేసిన ధోనీ, పోలింగ్ శాతం ఎంతంటే?

రాంచీ: జార్ఖండ్ రాష్ట్ర అసెంబ్లీ తొలి విడత ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. జార్ఖండ్‌లో మొత్తం 81 స్థానాలకు గానూ బుధవారం 43 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరిగింది. జార్ఖండ్‌లో పలువురు ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ తన సతీమణి కల్పనతో కలిసి రాంచీలో ఓటు వేశారు. టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ తన సతీమణి సాక్షితో కలిసి రాంచీ పోలింగ్ బూత్‌లో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.

ధోనీ రాకతో పోలింగ్ కేంద్రం వద్ద సందడి నెలకొంది. భారీ ఎత్తున అభిమానులు ధోనీ చుట్టూ చేరి ఫొటోలు, సెల్ఫీలు తీసుకున్నారు. కాగా, ఓటర్ టర్నవుట్ ప్రకారం.. బుధవారం సాయంత్రం 5 గంటల వరకు జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో 64.86 శాతం పోలింగ్ నమోదైంది. క్యూలైన్లలో ఉన్న ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు అవకాశం ఇవ్వడంతో ఓటింగ్ శాతం పెరిగే అవకాశం ఉంది.

First phase of polling in Jharkhand ends peacefully 64 percent voter turnout till 5pm

జార్ఖండ్‌లో తొలి విడత ఎన్నికల్లో జేఎంఎం నుంచి 23 మంది పోటీ చేయగా.. మిత్రపక్షాలైన కాంగ్రెస్ నుంచి 17 మంది, అర్జేడీ నుంచి ఐదుగురు బరిలో ఉన్నారు. ఇక, బీజేపీ నుంచి 36 మంది అభ్యర్థులు బరిలో దిగారు. జేడీయూ నుంచి ఇద్దరు పోటీ చేశారు. బీఎస్పీ నుంచి ఐదుగురు అభ్యర్థులు పోటీలో ఉన్నారు.

జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో మాజీ సీఎం చంపై సోరెన్, ఆయన తనయుడు బాబూలాల్ సోరెన్, మాజీ సీఎం అర్జున్ ముండా సతీమణి మీరా మొండా, మధు కోడా సతీమణి గీత కోడా, రఘుబర్ దాస్ కోడలు పూర్ణిమ సాహు వంటి ప్రముఖులు బరిలో ఉన్నారు.

కాగా, జార్ఖండ్ రాష్ట్రంలో అధికారం నిలబెట్టుకునేందుకు జేఎంఎం, కాంగ్రెస్ ఇండి కూటమి శాయశక్తులా ప్రయత్నిస్తుండగా.. ఈసారి రాష్ట్రంలో అధికారాన్ని దక్కించుకోవాలని బీజేపీ నాయకత్వంలోని ఎన్డీఏ సర్వశక్తులూ ఒడ్డుతోంది. జార్ఖండ్‌ రాష్ట్రంలో రెండో విడత ఎన్నికల పోలింగ్ నవంబర్ 20న జరగనుంది. నవంబర్ 23న ఓట్ల లెక్కింపు, ఫలితాలు వెలువడనున్నాయి.

మరోవైపు, కేరళలోని వయనాడ్ లోక్‌సభ స్థానంతోపాటు దేశంలోని 10 రాష్ట్రాల్లో 31 అసెంబ్లీ స్థానాలకు నిర్వహించిన ఉప ఎన్నికల్లో ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. బుధవారం సాయంత్రం 5 గంటల వరకు వయనాడ్‌లో 60.79 శాతం పోలింగ్ నమోదైంది. క్యూలైన్లలో ఉన్నవారికి ఓటు హక్కు కల్పించడంతో పోలింగ్ శాతం పెరిగే అవకాశం ఉంది. కాగా, వయనాడ్ నుంచి కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక గాంధీ వాద్రా బరిలోకి దిగిన విషయం తెలిసిందే.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+