ఈ ఏడాది తొలి సూర్యగ్రహణం.. భారత్‌లో కనిపిస్తుందా?
Solar Eclipse 2025: భూమికి సూర్యుడికి మధ్య చంద్రుడు వస్తే.. భూమి మీద కొంత భాగానికి సూర్యుడు పూర్తిగా గానీ, పాక్షికంగా గానీ కనపడకుండా పోవడం వల్ల సూర్యగ్రహణం ఏర్పడుతుంది. ఈ గ్రహణాలు ఖగోళంలో జరిగే అద్భుతమైన దృశ్యాలు. ఈ ఏడాదిలో తొలి సూర్యగ్రహణం ఈ నెల 29న ఏర్పడనుందని నాసా సైంటిస్టులు వెల్లడించారు. ఈ సూర్యగ్రహణం మార్చి 29న మధ్యాహ్నం 2.20 కి ఏర్పడి సాయంత్రం 6.13 గంటల వరకు కొనసాగుతుంది. ఇది సంపూర్ణ సూర్యగ్రహణం అయినప్పటికీ పాక్షికంగానే కనిపిస్తుందని శాస్త్రవేత్తలు వివరించారు. దాదాపు వందేళ్ల తర్వాత మార్చి 29న అరుదైన సూర్యగ్రహణం ఏర్పడనుందని తెలిపారు. ఈ సంవత్సరంలో రెండో సూర్యగ్రహణం సెప్టెంబర్ 21, 2025న జరగనుంది. రెండో సూర్యగ్రహణం ఆస్ట్రేలియా, అంటార్కిటికా పసిఫిక్ మహాసముద్రంలోని కొన్ని ప్రాంతాలలో కనిపిస్తుంది.
సూర్యగ్రహణం అమావాస్య రోజున మాత్రమే సంభవిస్తుంది. ఆ సమయంలో సూర్యడు, చంద్రుడు, భూమి ఒకే సరళరేఖలో ఉంటాయి. పాక్షిక సూర్యగ్రహణం సాధారణంగా సంవత్సరానికి రెండు సార్ల సంభవిస్తుంది. మార్చి 29న ఏర్పడే సూర్యగ్రహణం ప్రపంచంలోని కొన్ని దేశాలలో మాత్రమే కనిపిస్తుందని సైంటిస్టులు తెలిపారు. భారతీయులు ఈ గ్రహణాన్ని చూసే అవకాశం లేదని వెల్లడించారు. ఉత్తర అమెరికా, యూరప్, ఆఫ్రికా, ఉత్తర ఆసియా, దక్షిణ అమెరికాలోని కొన్ని ప్రాంతాలు, గ్రీన్ లాండ్ వాసులు ఈ పాక్షిక గ్రహనాన్ని చూడవచ్చు. పశ్చిమ ఐరోపాలో మధ్యాహ్నం, ఆఫ్రికాలో ఉదయం పూట, తూర్పులో యూరప్ లో సాయంత్రం వేళ ఈ గ్రహణం కనిపించనుంది.

అమెరికాలో స్థానిక కాలమానం ప్రకారం తెల్లవారుజామున 4.50 గంటలకు పాక్షిక గ్రహణం ప్రారంభమవుతుందని నాసా తెలిపింది. ఇది ఉదయం 6:47 గంటలకు గరిష్ట స్థాయికి చేరుకుంటుంది. ఉదయం 8:43 గంటలకు ముగుస్తుంది. ఇది భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 2:20 గంటలకు ప్రారంభమై సాయంత్రం 4:17 గంటలకు గరిష్ట స్థాయికి చేరుకుంటుంది. కొన్ని ప్రదేశాలలో, గ్రహణం సమయంలో సూర్యునిలో 93 శాతం వరకు కప్పబడి ఉంటుందని అంచనా. అయితే నాసా ప్రతిసారీ గ్రహణాన్ని ప్రత్యక్షప్రసారం చేస్తుంది. దీనిని ఆన్ లైన్ మాధ్యమాల ద్వారా చూడవచ్చు.












Click it and Unblock the Notifications