విమానంలో స్పహ కోల్పోయిన చిన్నారికి ప్రాణం పోసిన ఢిల్లీ ఎయిమ్స్ వైద్యులు
న్యూఢిల్లీ: ఐదుగురు ఢిల్లీ ఎయిమ్స్(Delhi AIIMS) వైద్యులు విమానంలో ప్రాణాపాయ స్థితిలో ఉన్న రెండేళ్ల చిన్నారిని కాపాడారు. విమానంలో ప్రయాణిస్తున్న చిన్నారికి అత్యవసర పరిస్తితి తలెత్తినప్పుడు వేవుళ్లలా అతడికి ప్రాణం పోశారు. అందుబాటులో ఉన్న పరికరాలతోనే చిన్నారికి జీవం పోశారు. ఈ ఘటన బెంగళూరు నుంచి ఢిల్లీకి వెళ్తున్న విస్తారా ఎయిర్‌లైన్స్ విమానంలో సోమవారం చోట చేసుకుంది.
సంఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. ఢిల్లీకి చెందిన రెండేళ్ల చిన్నారికి హృదయ సంబంధమైన సమస్య ఏర్పడింది. బెంగళూరులోని ఆస్పత్రిలో ఆమెకు ఓపెన్ హార్ట్ సర్జరీ నిర్వహించారు. డిశ్చార్జ్ అనంతరం తిరిగి విస్తారా విమానంలో ఆమెను ఢిల్లీకి తీసుకెళ్తున్నారు. బెంగళూరులో విమానం టేకాఫ్ అయిన దాదాపు అరగంట తర్వాత ఒక్కసారిగా ఆ చిన్నారి స్పృహ కోల్పోయింది. దీంతో అప్రమత్తమైన సిబ్బంది.. విమానంలో ఎవరైనా వైద్యులు ఉన్నారేమోనని ఆరా తీశారు. ఐదుగురు వైద్యులు ఉన్నట్లు గుర్తించి చిన్నారి పరిస్థితి వివరించారు.

మొదట వైద్యులు ఎంత ప్రయత్నించినప్పటికీ ఫలితం కనిపించలేదు. అందుబాటులో ఉన్న ఆక్సిజన్ సిలిండర్, ఏఈడీ పరికరంతో చిన్నారికి వైద్యం అందించారు. దాదాపు 45 నిమిషాలపాటు తీవ్రంగా శ్రమించిన తర్వాత చిన్నారిలో కదలిక వచ్చింది. దీంతో వైద్యుల సూచన మేరకు విమానాన్ని పైలట్ మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో అత్యవసరంగా ల్యాండ్ చేశారు.
ముందస్తుగా సమాచారం ఇవ్వడంతో సిద్ధంగా ఉన్న విమానాశ్రయ సిబ్బంది ఆ చిన్నారికి మెరుగైన వైద్యం కోసం ఆస్పత్రికి తరలించారు. దీంతో సిబ్బంది, విమానంలోని ప్రయాణికులు ఊపిరిపీల్చుకున్నారు. సకాలంలో స్పందించి చిన్నారి ప్రాణాలను కాపాడిన వైద్యులను అందరూ ప్రశంసించారు.
#Always available #AIIMSParivar
— AIIMS, New Delhi (@aiims_newdelhi) August 27, 2023
While returning from ISVIR- on board Bangalore to Delhi flight today evening, in Vistara Airline flight UK-814- A distress call was announced
It was a 2 year old cyanotic female child who was operated outside for intracardiac repair , was… pic.twitter.com/crDwb1MsFM
ఇందుకు సంబంధించిన వివరాలను ఢిల్లీ ఎయిమ్స్ ట్విట్టర్ వేదికగా వైద్యుల పేర్లను వెల్లడించింది. చిన్నారికి వైద్యం అందించిన ఎయిమ్స్ వైద్యుల్లో డాక్టర్ నవదీప్ కౌర్-సీనియిర్ అనెస్థీషియా, డాక్టర్ దమన్ దీప్ సింగ్-సీనియర్ కార్డియాక్ రేడియాలజీ, డాక్టర్ రిషబ్ జైన్- సీనియర్ ఎయిమ్స్ రేడియాలజీ, డాక్టర్ ఓశికా-సీనియర్ ఓబీజీ, డాక్టర్ అవిచల తక్షక్-సీనియర్ కార్డియాక్ రేడియాలజీ ఉన్నారు.












Click it and Unblock the Notifications