ప్రియుడిని కట్టిపడేసి, ప్రియురాలిపై ముగ్గురి దారుణం

వీరి ప్రేమకు ప్రియుడి పెద్దల నుండి వ్యతిరేకత వచ్చింది. దీంతో వారు ఇళ్లు వదిలి పారిపోయారు. అతను తన ప్రియురాలిని రెండు రోజులుగా తన స్నేహితుడి ఇంట్లో ఉంచాడు. గురువారం తెల్లవారుజామున ప్రియురాలిని ద్విచక్ర వాహనం ఎక్కించుకొని సాలిమంగలానికి బయలుదేరాడు.
వారిద్దరు వెళ్తండగా మధ్యలో ముగ్గురు వ్యక్తులు వచ్చి ప్రియుడి పైన దాడి చేశారు. అతడిని కట్టి పడేసి యువతిపై అత్యాచారం జరిపారు. దీంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాఫ్తు చేస్తున్నారు.
మరోవైపు సేలం జిల్లాలో పదేళ్ల బాలిక పైన ఐదుగురు యువకులు అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ తర్వాత ఆమెను ఫ్యాన్‌కు ఉరేశారు. ఆమె మృతదేహాన్ని ఐదు రోజుల క్రితం గుర్తించారు. ఈ ఘటనలో ఐదుగురిని సేలం పోలీసులు గురువారం అరెస్టు చేశారు.












Click it and Unblock the Notifications