AOB encounter: విశాఖలో భారీ ఎన్‌కౌంటర్, ఐదుగురు మావోయిస్టుల మృతి?

విశాఖపట్నం: ఏవోబీలో భారీ ఎన్‌కౌంటర్ చోటు చేసుకుంది. విశాఖలోని ధారకొండ ఏజెన్సీలోని మాదిగమల్లులో ఈ సంఘటన చోటు చేసుకుంది. ఇక్కడ పోలీసులు, నక్సలైట్ల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. మధ్యాహ్నం వార్తలు అందే సమయానికి ఐదుగురు మావోయిస్టులు మృతి చెందినట్లుగా తెలుస్తోంది. మరిన్ని పోలీసులు బలగాలు సంఘటనా స్థలానికి చేరుకోవడానికి ఇబ్బందులు పడ్డాయి. ఏవోబీలో అధికారులు హైఅలర్ట్ ప్రకటించారు. ఈ ఎన్‌కౌంటర్‌లో ఇటీవలే ఈస్ట్ జోన్ నుంచి వచ్చిన అరుణ మృతి చెందినట్లుగా తెలుస్తోందని వార్తలు వస్తున్నాయి.

ఈ నెల 21వ తేదీ నుంచి 28వ తేదీ వరకు మావోయిస్టు వారోత్సవాలు జరుగుతున్నాయి. దీంతో మావోయిస్టుల కదలికలు ఎక్కువగా ఉంటాయి. ఎస్పీఎఫ్, గ్రేహౌండ్స్ దళాలు కూంబింగ్ నిర్వహించాయి. ఈ క్రమంలో గుమ్మిరేులలో మావోయిస్టుల సంచారం ఉందని కూంబింగ్ దళాలకు సమాచారం అందింది. ఈ క్రమంలో ఇరువర్గాలు ఎదురుపడటంతో కాల్పులు చోటు చేసుకున్నాయి.

Five maoists killed in encounter in AOB area

గత ఏడాది సెప్టెంబర్ 23వ తేదీన మావోయిస్టుల కాల్పుల్లో ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వర రావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమ మృతి చెందిన విషయం తెలిసిందే. ఆ తర్వాత ఏడాదికి ఇక్కడ ఎన్‌కౌంటర్ జరిగింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+