నితీష్ పై బీజేపీ ప్రతీకారం : దెబ్బకు దెబ్బ..!!
బీహార్ తమకు షాక్ ఇచ్చిన నితీష్ కు బీజేపీ ఇప్పుడు జలక్ ఇచ్చింది. అరుణ్ చల్ ప్రదేశ్ లో జేడీయూ ముక్త రాష్ట్రంగా చేస్తామని చెప్పి.. చేసిన బీజేపీ, ఇప్పుడు మణిపూర్ లో అదే పని చేసింది. బీహార్ లో బీజేపీ తో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేసి..ప్రభుత్వాన్ని నడిపిన సీఎం నితీశ్ కుమార్.. ప్రతిపక్ష ఆర్జేడీ, కాంగ్రెస్‌లతో చేతులు కలిపారు. మహాఘట్‌బంధన్ కూటమి నేతృత్వంలో కొత్త సర్కారును ఏర్పాటు చేశారు. ఇప్పుడు తమను కాదని ప్రతిపక్షాలతో కలిసిన జేడీయూను ఉనికిలో లేకుండా చేసే ప్రయత్నాలను బీజేపీ ప్రారంభించింది.
ఈ ఏడాది మార్చిలో జరిగిన మణిపూర్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, జేడీయూ కలిసి పోటీచేశాయి. 38 ఎమ్మెల్యే సీట్లున్న మణిపూర్‌లో జేడీయూ నుంచి ఆరుగురు విజయం సాధించారు. వారిలో ఐదుగురు సొంత పార్టీ అధినాయకత్వం పైన తిరుగుబాటు బావుటా ఎగురవేసారు. ఆ అయిదుగురు బీజేపీలో చేరారు. మణిపూర్ లో జేడీయూ ను బీజేపీలో విలీనం చేస్తున్నట్లు స్పీకర్ కు తెలిపారు. దీనిని స్పీకర్ ఆమోదించారు. ఈ మేరకు మణిపూర్ అసెంబ్లీ కార్యదర్శి బులెటిన్ విడుదల చేసారు. తొమ్మిది రోజుల సమయంలో వరుసగా రెండో రాష్ట్రాలో జేడీయూను బీజేపీ దెబ్బ తీసింది.

అరుణాచల్ ప్రదేశ్ లో జేడీయూ నుంచి ఏకైక ఎమ్మెల్యేగా ఉన్న టెకీ కాసో బీజేపీ జాతీయాధ్యక్షుడు జేప నడ్డా సమక్షంలో కాషాయం కండువా కప్పుకున్నారు. ఇప్పుడు రెండు రాష్ట్రాల్లో దెబ్బ తీసిన బీజేపి పైన బీహార్ సీఎం నితీష్ ఏ విధంగా స్పందిస్తారో చూడాలి. ఇక, మరోవైపు తాజాగా తెలంగాణ సీఎం కేసీఆర్ తో నితీశ్ భేటీ జరిగింది. అందులో జాతీయ స్థాయిలో బీజేపీకి వ్యతిరేక పోరాటం పైన ఇద్దరూ చర్చించారు. బీజేపీ ముక్త భారత్ నినాదం ఇచ్చారు. అటు జేడీయూ ముక్త అరుణాచల్ ప్రదేశ్.. మణిపూర్ రాష్ట్రాల స్లోగన్లతో బీజేపీ తన పని తాను చేసుకుంటూ.. నితీష్ కు షాక్ ఇస్తోంది.












Click it and Unblock the Notifications